4.5 కిలోల గంజాయి స్వాధీనం
కొండమల్లేపల్లి : నల్గొండ జిల్లాలోని దేవరకొండ మడలం బేమనపల్లెలో శనివారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు దేవరకొండ పోలీసులు గంజాయి తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్ ఎదుట ప్రవేశపెట్టి పంచనామా నిర్వహించారు. పూర్తి వివరాలను సాయంత్రం మీడియా సమావేశంలో వివరిస్తామని పోలీసులు చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి