breaking news
-
‘ఇదేనా ప్రజాపాలన?’.. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇదేనా ప్రజాపాలన?.. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ‘ఇదేనా ప్రజాపాలన..? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా?. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదు. ప్రతిపక్షాల గొంతు అనిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు ?. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం..’అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇక.. బుధవారం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్దకు చేరుకోగా.. పోలీసులు, మార్షల్స్ బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డగించారు. సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడ వద్దనే నిబంధన ఉందని పోలీసులు అన్నారు. ఈ క్రమంలో ఇటువంటి కొత్త రూల్స్ ఏంటని పోలీసులతో హరీష్‌రావు, కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఇదేనా ప్రజాపాలన..? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదు. ప్రతిపక్షాల… pic.twitter.com/yxrID7RBW9 — Harish Rao Thanneeru (@BRSHarish) February 14, 2024 -
కేసీఆర్ వాడిన భాషపై చర్చిద్దామా? సీఎం రేవంత్ ఫైర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దూషణల పర్వంపై వాడీ వేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయిందని.. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని ఆయన అన్నారు. బుధవారం ఇరిగేషన్‌పై చర్చ సందర్భంగా.. ఆయన మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాషపైనా తీవ్రంగా స్పందించారు. సీఎం భాషకు అభ్యంతరం చెబుతున్నారు కదా( అసెంబ్లీలో కడియం అభ్యంతరాన్ని ప్రస్తావిస్తూ..). మరి మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాషపై చర్చ చేద్ధామా?. కేసీఆర్ భాష కూడా సభ్యుల్ని అవమానించేలా ఉంది. ఓ మాజీ సీఎం అయ్యి ఉండి ఓ సీఎంను పట్టుకుని ఏం పీకడానికి పోయాడని అనొచ్చా?(నల్గొండ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి). ఇది పద్ధతా? ఇదేనా తెలంగాణ సంప్రదాయం? అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బొక్కబోర్లా పడ్డా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదని.. చర్చలకు రమ్మంటే ప్రతిపక్ష నాయకుడు పారిపోయారని ఎద్దేవా చేశారాయన. .. కేసీఆర్‌ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయింది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్యాంట్ ఊడదీశారు. ఇప్పుడు చొక్కా లాగుతారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేడిగడ్డలో కూలింది రెండు ఫిలర్లే అయితే.. వాటి మీదైనా మాట్లాడేందుకు కేసీఆర్ సభకు రావాలి. రేపు సాయంత్రం వరకైనా కేసీఆర్ సభకు వస్తే చర్చిద్దాం. .. ప్రాజెక్టులపై చర్చిద్దాం. అవసరమైతే సాగునీటి ప్రాజెక్టులపైనా శ్వేత పత్రం విడుదల చేస్తాం. ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి. అవినీతి బయటపడుతుందనే సభకు రాకుండా పారిపోయారు. కాళేశ్వరం చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నాం. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా? అని బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలో సీఎం రేవంత్ నిలదీశారు. ఈ క్రమంలో సభ్యుల మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. -
ఇక నుంచి పాత కేసీఆర్ మెప్పిస్తాడా?
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం నుంచి దిగిపోయాక తొలిసారి నల్గొండ నుంచి పోరాట శంఖం పూరించారు. ఆయన చెప్పిన విషయాలతో మనం ఏకీభవించవచ్చు. విబేధించవచ్చు. కాని ఒక విషయం మాత్రం అంగీకరించక తప్పదు. ప్రసంగం చేయడంలో, ప్రజలను ఆలోచింపచేయడంలో, అవసరమైతే రెచ్చగొట్టడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని మరోసారి రుజువు చేసుకున్నారు. తాను పులినంటూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారిని దద్దమ్మలు, చేతకాని చవటలు అంటూ విరుచుకుపడ్డారు. తన హయాంలో జరిగిన కొన్ని అభివృద్ది పనులు వివరించారు. కరెంటు సరఫరా గురించి ప్రస్తావించారు. మేడిగడ్డకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వెళ్లడంపై కూడా స్పందించారు. కాగా ఈ ప్రసంగంలో ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా ఆయన ఉచ్చరించకపోవడం గమనించదగిన అంశం. రేవంత్ బహుశా తన స్థాయి కాని వ్యక్తి అని అనుకుని ఉండవచ్చు. లేదా అనవసర ప్రాధాన్యత ఎందుకు అని భావించి ఉండవచ్చు. కృష్ణా నదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్‌కు అప్పగించడానికి వీల్లేదంటూ కేసీఆర్ నల్గొండలో భారీ సభను నిర్వహించారు. సహజంగానే కేసీఆర్ స్పీచ్‌పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఆయన వాయిస్ ఏ రకంగా ఉంటుంది? ఎంత పదునైన భాష వాడతారు అన్న ఆసక్తి నెలకొంది. ఆ విషయంలో ఎవరి అంచనాలను ఆయన తగ్గించలేదు. తన శైలిలో ఉచ్ఛస్వరంతో ఆయన మాట్లాడుతుంటే సబికులంతా శ్రద్దగా విన్నారు. ఆయా సందర్భాలలో చప్పట్లు కొట్టారు. మరో పోరాటానికి ప్రజలు సిద్దపడాలని, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణలోని జిల్లాల వారంతా అప్రమత్తం అవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. కృష్ణా నది జలాలలో ఏభై శాతం వాటాను పొందకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారాదన్న డిమాండ్ పేరుతో జరిగిన ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సభను గమనిస్తే ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఒకప్పటి కాంగ్రెస్ నేతలు విబి రాజు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డలపై ఒక నానుడి వ్యాప్తిలో ఉండేది. వీబీ రాజు మంత్రిగా ఉంటే సమస్య, చెన్నారెడ్డి మంత్రివర్గం బయట ఉంటే సమస్య అన్నది ఆ నానుడి. అంటే చెన్నారెడ్డి మంత్రిగా లేకపోతే ఏదో ఒక ఉద్యమం తీసుకు వస్తారన్నది అప్పట్లో అందరి భావన. దానికి తగినట్లుగానే ఆయా సందర్భాలలో మంత్రిగా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుండేవారు. ఉదాహరణకు 1969లో ఆరంభమైన తెలంగాణ ఉద్యమంలో తొలుత ఆయన ప్రమేయం ఏమి లేదు. కాని అప్పట్లో ఆయన ప్రభుత్వంలో లేరు. దాంతో ఆయన తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాన వేసుకుని మొత్తం ఈ ప్రాంతం అంతటా తన ప్రభావాన్ని చూపించారు. తదుపరి తెలంగాణ ప్రజాసమితి పేరుతో పార్టీని పెట్టి పది లోక్ సభ స్థానాలను గెలిచి సంచలనం సృష్టించారు. తదుపరి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వేరే కథ. ఈ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకఛత్రాధిపత్యంతో ప్రభుత్వాన్ని నడిపారన్నది ఎక్కువ మంది భావన. కానీ.. ప్రతిపక్షంలోకి రాగానే తిరిగి ఉద్యమకారుడి అవతారం ఎత్తగలిగారు. గత ఎన్నికల సమయంలో వివిద ప్రచార సభలలో కేసీఆర్ స్పీచ్ లలో ఉత్తేజం పెద్దగా కనిపించేది కాదు. ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నారన్నట్లుగా అనిపించేది. నల్గొండ సభలో ఆయనలో పాత కేసీఆర్ కనిపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఏ తరహాలో ఉపన్యాసాలు ఇచ్చేవారో, దాదాపు అదే స్టైల్లోకి వచ్చారనిపిస్తుంది. తెలంగాణ యాస,భాషతో పాటు, దద్దమ్మలు, చవటలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నవారిపై ద్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా శాసనసభకు హాజరు కావడానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కాని నల్గొండలో పోరాట సభ పెట్టి ప్రజలలో కొత్త ఆలోచనలు రేకెత్తించారు. ప్రజలను రెచ్చగొట్డానికి కేసీఆర్ ఈ సభను వాడుకున్నారన్న విమర్శలు వస్తే రావచ్చు. కాని ఆయన మళ్లీ ప్రజా జీవనంలో బాగా చురుకుగా ఉండబోతున్నారనిపించింది. తద్వారా బీఆర్ఎస్ క్యాడర్లో ఒక ఆత్మ విశ్వాసం పెంచగలిగారు. కేసీఆర్‌కు జనంలో ఆదరణ తగ్గలేదన్న నిరూపించుకునే యత్నం చేశారు. తాను తెలంగాణ కోసమే పనిచేస్తానని చెప్పడానికి ఈ సభను వాడుకున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులందరూ చేసిన విమర్శలకు ఒకేసారి జవాబు ఇచ్చారనిపిస్తుంది. కోమటిరెడ్డి రైతు బందు రాలేదని అన్నవారిని చెప్పుతో కొడతానన్న వ్యాఖ్యను ఆయన ప్రస్తావించి రైతుల వద్ద ఇంకా గట్టి చెప్పులు ఉంటాయని హెచ్చరించారు. తాను విద్యుత్ సరఫరా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని 24 గంటలు ఇస్తూ, కాంగ్రెస్ రాగానే కోతలు మొదలయ్యాయని అంటూ అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.నిజంగానే గతంలో ఎప్పుడూ శాసనసభలో ఇలా ప్రత్యేకంగా బయటనుంచి తెప్పించి జనరేటర్ పెట్టలేదు. ఎప్పుడైనా కరెంటు పోయినా వెంటనే వచ్చేది. ఈ పాయింట్ నిజంగానే తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది కలిగించేదే. దానిని కేసీఆర్ సద్వినియోగం చేసుకున్నారు. రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయన నిలదీశారు. కృష్ణా జలాల వాటాపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఆయా అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. పులి మళ్లీ వచ్చిందన్న చందంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కట్టెకాలేవరకు పులిలా పోరాడతానని కేసీఆర్ ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఆందోళలనలకు అనుమతి ఇవ్వడానికి అంతగా ఇష్టపడని కేసీఆర్, ధర్నా చౌక్ ను కూడా అనుమతించని కేసీఆర్ ,ఇప్పుడు ప్రతిపక్షంగా పోరాడే హక్కు ఉంటుందని చెప్పడం విశేషం. తనకు ,తన ప్రభుత్వానికి ఒక మచ్చగా మారిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనను ఆయన తక్కువ చేసి చూపించే యత్నం చేశారు. రేవంత్ నాయకత్వంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ప్రదేశాన్ని చూడడానికి ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని ఆయన తప్పుపడుతూ , ఏమిటి వారు చూసేది. బొందలగడ్డ అంటూ వ్యాఖ్యానించారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుంగలేదా? కడెం ప్రాజెకట్టు గేట్లు తగలేదా? మూసి ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోలేదా?అంటూ అది పెద్ద విషయం కాదన్నట్లుగా సమాదానం ఇచ్చారు. గోదావరి లో నీరు ఉన్నా,ఎత్తిపోయకుండా రైతులను ఎండగడుతున్నారని ఆయన ఆరోపించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంలు మేడిగడ్డపై చేస్తున్న విమర్శలకు కేసీఆర్ సూటిగా సమాదానం చెప్పినట్లు అనిపించలేదు. తాము తిరిగి డబుల్ స్పీచ్ లో తిరిగి అధికారంలో వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానిదని ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని అవకాశాలను కేసీఆర్ వాడుకున్నారు. ఎన్నికల కోసం ఈ సభ పెట్టలేదంటూనే కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలలో విజయం సాదించడం కోసం ఎజెండాను సెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గత శాసనసభ ఎన్నికలలో దక్షిణ తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం ,మహబూబ్ నగర్ జిల్లాలలో బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్న నేపధ్యంలో నల్గొండ నుంచే ఈ సభను నిర్వహించడం విశేషం. తద్వారా వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తన పట్టు నిలబెట్టుకోవడానికి ఆయన నాందీ ప్రస్తావన పలికారనిపిస్తుంది. ఒక రకంగా ఇది ఆయనకు పరీక్షే. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తదితరులు ఎంత యాక్టివ్ గా పనిచేసినా, కేసీఆర్ రంగంలో దిగితే ఉండే ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చూపించడానికి ఈ సభను ఆయన విజయవంతంగా వాడుకున్నారు. కాకపోతే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇదంతా రాజకీయం కోసమే అని జనం అనుకుంటే మాత్రం కొంత నష్టం జరగవచ్చు. తెలంగాణ సాధనకోసం పలువ్యూహాలు అమలు చేసిన కేసీఆర్ ఈ విషయాలు తెలియనివి కావు. అయినా తాను ఎంచుకున్న మార్గంలో వెళ్లడమే ఆయన శైలి. ఈ సభతో బీఆర్ఎస్ క్యాడర్ లో విశ్వాసం ఎంత మేర పునరుద్దరణ అయింది తెలుసుకోవడానికి పార్లమెంటు ఎన్నికలే గీటు రాయి అవుతాయని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
Telangana Assembly Budget 2024 Session Updates ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది: వేముల ప్రశాంత్ రెడ్డి నేను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రి గా పనిచేశాను అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదు ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది సీఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు ..మేము మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారు సీఎం చెప్పేదొకటి చేసేదొకటి అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు ..నియంత్రణ ఎలా పెడతారు ఇలాంటి వాటిని తట్టుకుంటాం ..పోరాడతాం అసెంబ్లీ లో సీఎం రేవంత్ అనుచిత భాష ను ఖండిస్తున్నాం: కడియం శ్రీహరి చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు సీఎం భాష కు ధీటుగా బదులు ఇవ్వగలం ..కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే అవకాశం ఇవ్వలేదు బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు కంచెలు తొలగిస్తామని.. ఇదేమి కంచెల పాలనా? తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత మీడియా పాయింట్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేడ్లు అడ్డుపెట్టి మరీ ఆపిన పోలీసులు, మార్షల్స్ సభ జరుగుతున్న సమయంలో మాట్లాడ వద్దనే నిబంధన ఉందన్న పోలీసులు కొత్తగా ఈ రూల్స్ ఏంటని పోలీసులతో హరీష్‌రావు, కేటీఆర్ వాగ్వాదం మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నం స్పీకర్ నుంచి తమకు ఎలాంటి నోట్ రాలేదన్న బీఆర్ఎస్ కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. పోలీస్ పాలన:బీఆర్ఎస్ సభలో మైక్ ఇవ్వరు.. బయట కూడా మాట్లాడనివ్వరా? ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ నిరసన తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము ఊరుకోవాలా: మంత్రి శ్రీధర్‌రెడ్డి సీఎం రేవంత్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ భాషపై ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు రాజగోపాల్ రెడ్డి, కడియం శ్రీహరి వాఖ్యలలో అభ్యంతరాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాలి రేపు సభలో ఇరిగేషన్‌పై శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం.. అప్పుడు కాళేశ్వరంపై మాట్లాడండి. ముఖ్యమంత్రి బాష అభ్యంతరకరంగా ఉంది: కడియం శ్రీహరి పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం వేరు.. సీఎం హోదాలో మాట్లాడటం వేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరైంది కాదు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా?: సీఎం రేవంత్ మేడిగడ్డకు వెళ్లి సమస్యను పరిశీలించాం: సీఎం రేవంత్ ప్రభుత్వం సరైన భాష మాట్లాడటం లేదంటున్నారు కేసీఆర్ మాట్లాడిన భాష సరిగా ఉందా? తప్పందా కొత్త ప్రభుత్వానిదే అన్నట్టు కేసీఆర్ మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా? ఇప్పటికే కేసీఆర్ ప్యాంట్ ఊడదీశారు.. ఇప్పుడు చొక్కా లాగుతారు ప్రాజెక్టులపై చర్చిద్దాం ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి అవినీతి బయటపడుతుందని సభకు రాకుండా దాక్కుంటున్నారు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం పెడుతుంది కాళేశ్వరంపై చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నాం కడియం వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఐటీలో లక్షల ఉద్యోగాలను సృష్టించినందుకు కేటీఆర్‌కు థాంక్స్: కడియం ఐటీని తారా స్థాయికి కేటీఆర్ తీసుకెళ్లారు గత ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలను మళ్లీ ఎంవోయూలు చేసుకున్నారు: కడియం. ఎంవోయూలపై కడియం వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలు ఒక్కటి కూడా మొన్నటి ఒప్పందాల్లో లేవు: శ్రీధర్ బాబు టీసీఎస్ లాంటి ఒప్పందాలు గత ప్రభుత్వంలో లేవు: శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వఃపై బీఆర్ఎస్ బురదజల్లుతుంది. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్‌పై సభలో స్పందించిన బీఆర్ఎస్ మేడిగడ్డపై ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలి: కడియం శ్రీహరి విచారణలో ఎవరు దోషులని తెలితే వాళ్లకు శిక్ష పడుతుంది మేడిగడ్డ బ్యారేజీని వెంటనే రిపేరు చేయాలి మేడిగడ్డను రాజకీయం కోసమే కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి జూలై నెల వరకు మేడిగడ్డపై కాపర్ డ్యాం నిర్మించి ప్రజలకు నీళ్లు అందించేలాగా చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా కూర్చో కూర్చో అంటూ కేటీఆర్ రన్నింగ్ కామెంట్స్ మాట్లాడేది వినబుద్ధి కాకపోతే సభలో నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ కేటీఆర్‌ను సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంట్స్ భార్య పిల్లలను అడ్డం పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిన వాళ్లు కూడా సభలో మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం కౌశిక్ రెడ్డి, కేటీఆర్ నన్ను భయపెడితే నేను భయపడను: మంత్రి పొన్నం భయపడితే భయపడడానికి నేను బానిసను కాదు: మంత్రి పొన్నం ఇరిగేషన్‌పై తెలంగాణ శాసనసభలో రసాభాస కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పదేళ్లు మా యువరాజు సిరిసిల్లకు అన్యాయం చేశారు కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఇప్పటికీ పూర్తి చేయలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే 80 శాతం పూర్తయిన గౌరవెల్లి ఇప్పటికీ నీలి ఇవ్వలేకపోతోంది: మంత్రి పొన్నం ప్రభాకర్ లోయర్ మానేరు ఎల్లంపల్లి శ్రీరాంసాగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వింది. శాసన సభలో ఆరు గ్యారెంటీల అమలుపై రసాభాస ఆరు గ్యారెంటీల అమలు కోసం 53వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషనలు, 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు కావాలంటే 1లక్ష 36వేల కోట్లు కావాలి ఆరు గ్యారెంటీల అంశం పై కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే అవుతుంది.. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం:శ్రీధర్ బాబు. ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మారు.. తీరా గెలిచిన తరువాత ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెడుతున్నారు: కడియం వనరులు చూసుకోకుండా, లెక్కలు చెయ్యకుండా హామీలు ఇచ్చారా?: కడియం బడ్జెట్‌పై చర్చలో కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమే ఎమర్జెన్సీ అనగానే కడియం ను అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దేశం ఏర్పడిన రోజు సూది తయారు చేసుకునే పరిస్థితి లేకుండే - మంత్రి పొన్నం కడియం బడ్జెట్ పై మాత్రమే మాట్లాడాలి పదేళ్లలో గత ప్రభుత్వం ఏమైనా చేసిందా? నేను బుక్ లో ఉన్నది మాత్రమే చర్చ చేస్తున్నా: కడియం శ్రీహరి ఎమ్మెల్యే మంత్రులకు ఏమైనా డౌట్ ఉంటే బడ్జెట్ పుస్తకం చదువుకోవాలి బడ్జెట్ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలి అందరి కోసం కాదు... కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ... మరో వైపు బయట తిడుతున్నారు గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది? అభివృద్ధి జరగకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెటే 2లక్షల 75వేలు ఎలా పెడతారు? తెలంగాణ శాసన సభలో బడ్జెట్ పై మొదలైన చర్చ బడ్జెట్ పై BRS నుంచి చర్చను మొదలు పెట్టిన కడియం శ్రీహరి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు:కడియం శ్రీహరి. బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సీఎం రేవంత్ లేరు: కడియం శ్రీహరి బడ్జెట్‌పై చర్చలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరు అసెంబ్లీలో.. మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రసంగం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి ఇరిగేషన్‌పై సభలో మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు నేడు తెలంగాణ అసెంబ్లీలో.. కాసేపట్లో ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఇరిగేషన్‌పై చర్చకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు -
నల్లగొండను నాశనం చేసిందే నువ్వు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాను నాశనం చేసిందే కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘పదేళ్ల పాటు జిల్లాలోని ప్రాజెక్టులను పడావు పెట్టారు. కనీసం జిల్లా ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు తన ఏజెంట్లతో కృష్ణా ప్రాజెక్టుల వివాదాన్ని రగిలించి ఆ మంటల్లో చలి కాచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు..’ అని ఆరోపించారు. నల్లగొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఒక ప్రకటనలో వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల కోసమే కేసీఆర్ నాటకాలని, నాలుగు రోజుల్లో తన ఇంటికి కలవడానికి వచ్చేంత జనమే కేసీఆర్ మీటింగ్‌కు వచ్చి ఉంటారని ఎద్దేవా చేశారు. పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడేటప్పుడు పరిణతితో మాట్లాడాలన్న విజ్ఞతను మరిచి కల్లు కాంపౌండ్ దగ్గర తాగుబోతు కంటే అ ధ్వాన్నంగా మాట్లాడు తున్నాడని విమర్శించా రు. పిచ్చికూతలు కూ స్తే చూస్తూ ఊరుకునేది లేదని, దెబ్బకు దెబ్బ ను ప్రజాస్వామ్య యు తంగా కొట్టి తీరతా మని హెచ్చరించారు. నల్లగొండ ప్రజల రక్తంలోనే ఉద్యమం ‘నల్లగొండ బిడ్డ శ్రీకాంతాచారి త్యాగంతో తెలంగాణ వచ్చింది. శ్రీకాంతాచారి తల్లికి పదవి ఇస్తానని చెప్పి పదేళ్లు అవమానించాడు. నల్లగొండ సభలో ఏర్పాటు చేసిన బ్యానర్‌పై ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి ఫోటో కూడా లేకుండా తన ఒక్కడి ఫోటో మాత్రమే పెట్టుకుని నియంతలా వ్యవహరించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ చరిత్ర ప్రజల ముందు పెట్టి ఆయన అహంకారానికి కళ్లెం వేస్తాం. నల్లగొండ ప్రజల రక్తంలోనే ఉద్య మం ఉంది. నియంతృత్వ భావ జాలాన్ని, నియంతలను ఇక్కడి ప్రజలు దగ్గరకు రానీయరు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని శపథం చేసిన సీమాంధ్ర సానుభూతిపరుడు కేసీఆర్. ఇప్పుడు అధికారం పోగానే గజనీలా గతం మర్చిపో యాడు. ఆయన అక్కడకే వెళ్లి ఆంధ్ర రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టుకోవడం మంచిది. అసెంబ్లీని వదిలి నల్లగొండకు ఎందుకు? నేను రైతుబంధు రాలేదన్న బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టాలంటే, ప్రజలను అన్నట్టుగా ఆపాదించారు. ఇది కేసీఆర్ కుటిల బుద్ధికి నిదర్శనం. నిజంగా కేసీఆర్‌కు చిత్తశుద్ధి, ప్రజలపై ప్రేమ ఉంటే ఐదు నిమిషాల్లో చేరుకునే అసెంబ్లీని వదిలిపెట్టి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండకు ఎందుకు వచ్చారు? ఆయన కుమారుడి అనుంగు అనుచరుడైన ఓ అధికారిని విచారిస్తే వేల కోట్ల ఆస్తులు దొరుకుతుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. మెదక్‌లో కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తాం. దమ్ముంటే కేసీఆర్ గెలవాలి.’ అని కోమటిరెడ్డి సవాల్ చేశారు. -
కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఒక బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే దానిపై కాంగ్రెస్ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగం, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం.. వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని వివరించారు. దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో శాసనసభ్యులు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రాణహిత–చేవెళ్ల ఎందుకు కట్టలేదు? ఏదో జరిగిందని మేడిగడ్డ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలని హరీశ్‌రావు హితవు పలికారు. కాళేశ్వరంతో ఏం చేశారని అడుగుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. రైతుల దగ్గరకు వెళ్లి అడగాలని సూచించారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్ చూసి అద్భుతం అని మెచ్చుకున్నారని, నేర్చుకున్నారని గుర్తు చేశారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రాణహిత – చేవెళ్ల ఎందుకు కట్టలేదని నిలదీశారు. మేము నీళ్ళు లేని ప్రాంతం నుంచి నీళ్ళు ఉన్నచోటకు ప్రాజెక్టును మార్చి కట్టి నీళ్ళు అందించామని, మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే అనే విషయం తెలుసుకోవాలని అన్నారు. తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి మేము చేసిన పనుల్లో తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అన్నారు. అదే సమ యంలో చేసిన పనులను ఆపకుండా పునరుద్ధ రణ పనులు చేపట్టాలని కోరారు. దురుద్దేశంతో ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం లేదని, మీ రు చేసే పనుల వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని, దీన్ని ప్రజలు క్షమించరని అన్నా రు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ ఉందనే మేడి గడ్డ బ్యారేజీ టూర్ ప్రోగ్రాం పెట్టారని హరీశ్‌రా వు విమర్శించారు. మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించొద్దంటూ తాము నిద్ర లేపితే వారు లేచారని విమర్శించారు. -
మేడిగడ్డపై సీబీఐ విచారణ అంటే ఎందుకు భయం?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతిపై గత సీఎం కేసీఆర్ సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదు. మేడిగడ్డపై సీబీఐ విచారణకు ఆ రెండు పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలి’ అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం వరంగల్‌లో పార్టీపార్లమెంట్ కార్యాలయం ప్రారంభం, వేయిస్తంభాల ఆలయం కల్యాణ మంటపం పనులను పరిశీలించిన అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాటి బీఆర్ఎస్ సర్కారు, ఎన్నికల తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉత్తరాలు పంపినా స్పందించలేదన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వార్తలు రాగానే.. మరుసటి రోజు 22న తాను కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాశానని, ఆ తర్వాతి రోజే భారత ప్రభుత్వ జలశక్తి శాఖ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి.. మేడిగడ్డకు పంపిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 24, 25న ఆ రెండు రోజులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర అధికారులను వివరాలు అడిగి నవంబర్ 1న ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందన్నారు. ప్రాజెక్ట్ సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని వెల్లడించిందన్నారు. ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని మంత్రి చెప్పారు. మేడిగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు ప్రతిపక్ష, పాలక పార్టీలు ఆడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని పొలిటికల్ మైలేజ్‌కి కాంగ్రెస్ వాడుకుంటున్నదన్నారు. అసెంబ్లీ బంద్ పెట్టి.. మేడిగడ్డకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని, ఇంతకు ముందే మంత్రులు చూశారు. రేవంత్, రాహుల్‌గాంధీ చూశారు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళుతున్నారో చెప్పాలి? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ తీరు అలాగే ఉన్నదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్, నల్లగొండ బహిరంగ సభకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్ సభ ఏపీ పోలీసులను పెట్టి బలవంతంగా కృష్ణా నీళ్లు తీసుకెళ్తే.. ఏం చేయాలో ఇప్పటివరకు యాక్షన్‌ప్లాన్ ఏంటో, మీ వైఖరి ఏమిటో.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చె ప్పాలని నిలదీశారు. మీరు పరిష్కరించుకుంటే.. కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. ప్రాజె క్టుల సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పా రు. కేంద్రంపై నిందలు వేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కేసీఆర్ నల్లగొండ సభ పెట్టారని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఒకరు కృష్ణా జలాలపై, మరొకరు కాళేశ్వరంపై రచ్చ చేస్తూ ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుందన్నారు. -
దోపిడీకి కాళేశ్వరం బలి
మేడిగడ్డ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టును రూ.94 వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తే.. 98వేల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే వచ్చిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. డిజైన్, నిర్మాణ, నిర్వహణ లోపాలతో నిర్మించిన మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోయే స్థితికి చేరిందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్లను మంగళవారం సాయంత్రం రేవంత్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, బ్యారేజీ కుంగిన తీరు, ఇతర అంశాలపై ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి, విజిలెన్స్ డీజీ రాజీవ్‌రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రూ.94వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా నీరివ్వకపోయినా.. కోటి ఎకరాలకు నీళ్లిచ్చినట్టు కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారు. రూ.36 వేలకోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా వైఎస్సార్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కాదని.. రీడిజైన్ పేరుతో అవినీతి కోసం లక్ష కోట్ల ప్రాజెక్టును నిర్మించారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ పియర్లు కుంగిపోతే.. సరిచేసే ప్రయత్నం చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరించారు. పోలీస్ పహారాతో ఎవరినీ ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అ అంశంపై మేం అసెంబ్లీలో చర్చ పెడితే.. కేసీఆర్ వేల కోట్ల దోపిడీపై చర్చ జరగకుండా ఉండాలనే నల్లగొండలో సభ పెట్టుకున్నారు. ప్రజల ముందు బండారమంతా బయటపడుతోందనే కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడికి దిగారు. నల్లగొండ దూరమా?.. అసెంబ్లీ దూరమా? చావు నోట్లో తలకాయ పెట్టానంటూ కేసీఆర్ కోటి ఒకటవసారి అబద్ధం చెప్పారు. ఆ మాట నమ్మి ప్రజలు రెండుసార్లు సీఎంగా అవకాశమిస్తే.. భారీగా దోచుకున్నారు. కేసీఆర్ ప్రజల కోసం ఏనాడూ ఏమీ చేయలేదు. ఓడిపోయి సీఎం కుర్చీ పోయింది కాబట్టే మరోసారి ప్రజలు గుర్తుకొచ్చారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే అయితే శాసనసభకు ఎందుకు రాలేదు? మీరు చేసిన నిర్వాకాన్ని సభలో ఆధారాలతో సహా బయటపెట్టాం. మేడిగడ్డ సందర్శనకు రావాలని మా మంత్రి ఉత్తమ్ మీకు లేఖ రాశారు. తేదీపై అభ్యంతరం ఉంటే.. మీరు చెప్పిన తేదీనే వెళదామని చెప్పాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్లగొండ సభకు ఎలా వెళ్లారు? నల్లగొండ దూరమా? అసెంబ్లీ దూరమా? మేడిగడ్డ బ్యారేజీని రూ.1,800 కోట్ల అంచనాతో డిజైన్ చేసి.. తర్వాత రూ.4 వేల కోట్లకు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయి. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25వేల కోట్లు అవసరమవుతాయి. నాలుగైదు పిల్లర్లు కుంగితే ఏమిటని చులకన చేస్తారా? మేడిగడ్డ పిల్లర్లు కుంగడం కాదు.. ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో ఉంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు కూడా ముప్పు ఉందని తేల్చింది. విజిలెన్స్ నివేదిక కూడా అదే చెప్పింది. కానీ కేసీఆర్ రూ.94 వేలకోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో నాలుగైదు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారంటూ చులకనగా మాట్లాడుతున్నారు. కుంగినది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. çతెలంగాణ ప్రజల నమ్మకం. ప్రజల సొమ్ము అంటే అంత చులకనా? మీ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. మేడిగడ్డ ఇష్యూను చులకన చేసి మాట్లాడటం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్లగొండ సభ కుంగిన మేడిగడ్డ బ్యారేజీని ఎవరూ చూడకుండా కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. పోలీసులతో అడ్డుకున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతితో రాహుల్‌గాందీ, నేను, శ్రీధర్‌బాబు బ్యారేజీని పరిశీలించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించాం. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో భారీగా లోపాలు ఉన్నాయని విజిలెన్స్ తేల్చింది. మేడిగడ్డను సందర్శించి వాస్తవాలు తెలుసుకుందామని స్పీకర్ అనుమతితో వచ్చాం. కానీ కేసీఆర్ తన బండారం బయటపడుతుందని భావించి.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు నల్లగొండలో సభ పెట్టారు. అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వండి కృష్ణాబోర్డు (కేఆర్ఎంబీ)కు ప్రాజెక్టుల అప్పగింతపై అడిగితే తాను సలహాలు ఇచ్చేవాడినని కేసీఆర్ అంటున్నారు. అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వొచ్చని మేం ముందునుంచీ చెప్తున్నాం. స్పీకర్ ద్వారా ప్రతిపక్ష నాయకుడిని పిలిపించాలని కూడా కోరాం. అసెంబ్లీ రాకుండా.. పైగా సభలో చేసిన తీర్మానాన్ని తప్పుపడుతున్నారు. తీర్మానంలో లోపాలుంటే హరీశ్‌రావు ఎలా మద్దతు ఇచ్చారు. అందుకే హరీశ్‌రావు మాటలకు విలువ లేదని.. కేసీఆర్ సభకు రావాలని మేం కోరాం. నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కాదు.. శాసనసభకు రండి. ఏం చేయాలో చెప్పండి. మమ్మల్ని వెంటాడతామంటూ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు. కానీ కాళేశ్వరంపై చర్చకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? ముందే తెలిస్తే.. ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ మాట్లాడుతున్నారు. మీ గురించి ప్రజలకు ఎన్నికల ముందే తెలిసి ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు. మీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం ఇంకా సిద్ధంగా ఉందనుకుంటున్నారా? కేసీఆర్‌ను ఆహా్వనిస్తున్నా.. సభకు రావాలి, బడ్జెట్‌తోపాటు సాగునీటి రంగంపై చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆరే కాబట్టి ఆయనే వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. ఆయన స్వార్థం కోసం కాకుండా ఒక్కసారైనా ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చండి. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై మీ వైఖరేమిటో సభలో చెప్పండి సానుభూతి కోసం ఎత్తుగడ కుర్చీపోగానే కేసీఆర్‌కు నీళ్లు, నల్లగొండ ఫ్లోరైడ్ గుర్తొస్తాయి. అందుకే కుర్చీని వెతుక్కుంటూ నల్లగొండ వెళ్లారు. పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతితో ఓట్లు పొందాలనేది కేసీఆర్ ఎత్తుగడ. భయపడబోనంటూ ప్రగల్భాలు పలకడం కాదు. వచ్చి సభలో మాట్లాడాలి. అవసరమైతే కాళేశ్వరాన్ని సందర్శిస్తానని కేసీఆర్ అంటున్నారు. ఆయన కేసీఆర్ కాళేశ్వరానికి కాదు..ఇక కాశీకి పోవాల్సిందే. బీజేపీతో చీకటి పొత్తు ఎందుకు? బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా ఎన్నాళ్లు చీకట్లో పొత్తు పెట్టుకుంటాయి? మేడిగడ్డ సందర్శనకు బీజేపీ వాళ్లు వస్తారనుకున్నాం. ఎంఐఎం, సీపీఐ వాళ్లు వచ్చారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలన్న బీజేపీ ఇప్పుడు ఎందుకు రాలేదు. కిషన్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుకున్నారు. బీజేపీ వైఖరేమిటో, కేసీఆర్ అవినీతికి సహకరిస్తారో, అవినీతిపై విచారణ చేసే మా ప్రభుత్వానికి సహకరిస్తారో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలి. సీబీఐ విచారణ పేరుతో కేసీఆర్ జుట్టు తమ చేతిలో పెట్టుకొని లబ్ధి పొందాలనుకుంటున్నారు. సీబీఐ కంటే ఉన్నతమైన జ్యుడీషియల్ విచారణ చేయించబోతున్నాం. కేసీఆర్ అవినీతిని బయటపెట్టడానికి ఈ పర్యటన కీలకం. అలాంటి మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. బాధ్యులపై విచారణ జరుగుతుంది సాంకేతిక నిపుణులతో చర్చించాక మేడిగడ్డ పునరి్నర్మాణంపై మా నిర్ణయం వెల్లడిస్తాం. మేం ఇంజనీర్లం కాదు. 80వేల పుస్తకాలు చదవలేదు. అక్రమాలకు బాధ్యులైన వారిపై విచారణ కొనసాగుతుంది. అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం – కట్టిన మూడేళ్లలోనే మేడిగడ్డ కొట్టుకుపోయే దుస్థితి: ఉత్తమ్ – తుగ్లక్ కూడా సిగ్గుపడే విధంగా నిర్మించారని వ్యాఖ్య మేడిగడ్డ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: స్వతంత్ర భారత చరిత్రలో కాళేశ్వరం కుంభకోణం అతి పెద్దదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.94 వేలకోట్లు ఖర్చు చేసి.. 97 వేల ఎకరాలకు నీరివ్వడమనేది ఎక్కడా ఉండదన్నారు. కట్టిన మూడేళ్లలోనే బ్యారేజీ కొట్టుకుపోయే స్థితికి చేరుకుందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో.. రూ.68 వేలకోట్లు అప్పు తెచ్చినవని, ప్రభుత్వం సమకూర్చిన రూ.33 వేల కోట్లు పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసినవేనని చెప్పారు. వైఎస్సార్ హయాంలో రూ. 38 వేలకోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదిస్తే.. రీడిజైన్ పేరిట ఖర్చును రూ.94వేల కోట్లకు పెంచి 18 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించారని పేర్కొన్నారు. తుగ్లక్ కూడా సిగ్గుపడే విధంగా ప్రాజెక్టు నిర్మించారని విమర్శించారు. డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా తెలియకుండా నిర్మించడం వల్లే ప్రస్తుతం మేడిగడ్డకు ఈ పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధం: పొన్నం కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనకు రాలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎంఐఎం, సీపీఐ వచ్చినా బీజేపీ రాకపోవడానికి బీఆర్ఎస్తో ఆ పారీ్టకి ఉన్న ఫెవికాల్ బంధమే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టడం లేదని, ఆరోపణలతోనే కాలం వెల్లదీయడానికి కారణమేంటని నిలదీశారు. రూ.లక్ష కోట్లు గోదావరిలో పోసినట్టే – సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సాక్షి ప్రతినిధి, వరంగల్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా చూడటం బాధగా ఉందని, రూ.లక్ష కోట్లు గోదావరిలో పోసినట్టేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపం ఉందని, దీనికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఎన్నో కుంభకోణాలు చేసిందని.. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలను ఎగ్గొడుతోందంటూ విమర్శలు చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. వైఎస్సార్ సర్కారు ప్రతిపాదించినట్టుగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే.. ఇంత ఖర్చు, వృధా అయ్యేది కాదని చెప్పారు. -
కట్టె కాలేవరకు పులిలా కొట్లాడతా: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తనకు చేతనైనా కాకపోయినా.. తన కట్టె కాలే వరకు, చివరి శ్వాస వరకు ప్రజలకు అన్యాయం జరిగితే పులిలా పోరాడతానని.. లేచి కొట్లాడతా తప్ప పిల్లిలా ఉండనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆరునూరైనా ప్రజలకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరగనివ్వనన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట మంగళవారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు ‘‘చలో నల్లగొండ’ రాజకీయ సభ కాదు.. కొందరికి రాజకీయం. మనకు మాత్రం ఉద్యమ, పోరాట సభ. కృష్ణా నీళ్లపై ఆధారపడిన మన బతుకులకు సంబంధించిన సమస్య. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య. చావో రేవో తేల్చే సమస్య. అందుకే నా కాలు విరిగిపోయినా కుంటి నడకతో కట్టె పట్టుకొని ఇంత ఆయాసంతో రావాల్సి వచ్చింది. కొంతమంది మంది సన్నాసులు తెలివి లేక, వాళ్లకు వ్యతిరేకంగా ఈ సభ పెట్టామని అనుకుంటున్నారు. వారిలా ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నీటి పారుదల మంత్రికి, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు ఈ సభ ఒక హెచ్చరిక..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర బిల్లు కోసమే తాత్కాలిక సర్దుబాటుకు ఒప్పుకున్నాం ‘ఆనాడు అధికారంలో ఉన్న, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి.. ఆ తరువాత ఎవరి వాటా వారికి వస్తాయని చెప్పింది. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాస్ కావాలి.. తెలంగాణ రావాలి.. ఇదొక ఆటంకం కాకూడదు. తర్వాత చూసుకుందాం అనే ఉద్దేశంతో సరే కానివ్వండి అని చెప్పినం. ఆ తరువాత వాళ్లు పోయి మోదీ ప్రభుత్వం వచ్చింది. మేం మునిగిందే నీళ్లల్లో.. నీళ్లు లేక మా బతుకులు ఆగమైపోయాయి.. వెంటనే నీళ్లు పంపిణీ చేయండని వందల ఉత్తరాలు రాశాం. ట్రిబ్యునల్ వేయమన్నా వేయలే. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లి తగాదా పెట్టాం. ఆ తరువాత మీటింగ్‌లో మేము గట్టిగా నిలదీస్తే మీరు కేసు ఉపసంహరించుకోండి.. నీటి పంపకాలకు మేము ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం అని చెబితే ఉపసంహరించుకున్నాం. అయినా తొందరగా వేయలేదు. మళ్లీ ఉత్తరాలు రాశా. లోక్‌సభ వారం రోజులపాటు స్తంభింపజేశాం. ఆ ఒత్తిడికి తలొగ్గి మొన్న ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు..’ అని తెలిపారు. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు ‘ఏ ప్రభుత్వం ఉన్నా ట్రిబ్యునల్ ముందుకుపోయి గట్టిగా వాదించాలి. అది మొగోడు చేయాల్సిన పని. జనంపై ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డారో.. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు. ఈ ప్రభుత్వం మన జీవితాలను దెబ్బకొట్టేలా కృష్ణా జలాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించింది. జలాల్లో వాటా తేల్చమని అడుగాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రాజెక్టులను అప్పగిస్తూ సంతకం పెట్టింది. దాని మెమోరాండం దొరికింది. దానివల్ల జరిగే నష్టం నీళ్ల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు తెలుసు కాబట్టి గర్జించారు. దాంతో నాలుగైదు రోజులు నాటకాలు ఆడారు. అబద్ధాలు ఆడారు. బిడ్డా మిమ్మల్ని బజారున నిలబెట్టి మీ సంగతి ప్రజల ముందే తేల్చుకుంటాం..అని చలో నల్లగొండకు పిలుపు ఇచ్చా. ఇజ్జత్ మానం పోతోందని అతి ముఖ్యమైన బడ్జెట్ పక్కకు పెట్టారు. ఆగమేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అది కూడా సరిగ్గా పెట్టకుండా తాగునీటి కోసమని పెట్టారు. కరెంటు ఉత్పత్తి గురించి పెట్టలేదు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుందామనుకున్నా.. ‘ప్రజలు అధికారం ఇచ్చారు. ఐదేళ్లు ఉండండి. మాకు అభ్యంతరం లేదు. నేను నాలుగు రోజులు ఆరాంగా కూర్చుందామనుకున్నా. కానీ ఏం చేశారు. నల్లముఖం పిల్లిపోయి సచ్చిన ఎలుకను పట్టినట్లు.. ప్రభుత్వం వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్లను తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పగించింది. కట్టమీద మొత్తం రిజర్వు పోలీసోళ్లు ఉన్నరు. మంచినీళ్లను చిప్పపట్టి అడుక్కోవాలి. విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే అడుక్కోవాలి. మనకున్న అధికారులను వారికి అప్పగించారు. నన్ను బెదిరించినా అప్పగించలే. గవర్నమెంట్‌ను పడగొడతామన్నారు. రాష్ట్రపతి పాలన పెడతమన్నారు. అయినా ఒప్పుకోలేదు. నా తలకాయ పోయినా ప్రాజెక్టులను అప్పగించనని చెప్పా. కానీ ఈ ప్రభుత్వం అప్పగించింది. ఇటీవల బీఆర్ఎస్ ఎంపీలు వెళ్లి అడిగితే మీ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి ఆలోచనలు మాని వెంటనే బడ్జెట్ సమావేశాలు ముగించి కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి. ప్రధానిని నిలదీయాలి. ఆరు నెలల్లో వాటాలు తేల్చండి అంటూ ప్రధాని ఆదేశించేలా పోరాటాలు నిర్వహించాలి..’ అని సూచించారు. దద్దమ్మల రాజ్యం ఇలాగే ఉంటుంది ‘మంత్రి ఉత్తమ్‌కుమార్ ఉమ్మడి రాష్ట్రమే బాగుందని అసెంబ్లీలోనే అన్నారు. అదే మంచిగుంటే మరి అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది.. కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు.. శ్రీకాంతాచారి ఎందుకు చనిపోయారనే సోయి లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లకు పదవులు కావాలి.. పైరవీలు కావాలి.. డబ్బు కావాలి తప్ప ప్రజల హక్కుల గురించి పట్టించుకోరు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే 24 గంటల ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం పోగానే ఆ కరెంట్ పోతదా? తొ‘మ్మిదిన్నరేళ్లు ఇచ్చిన కరెంటు ఈరోజు ఏమైంది. ఏమైనా మాయ రోగం వచ్చిందా? దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది. చేతగాని చవటల రాజ్యం ఉంటే గిట్లనే ఉంటది. కరెంటు ఎందుకు ఇస్తలేరు. ఎందుకు తిప్పలు పెడుతున్నారు? ఏమైందిరా బిడ్డా కరెంట్ అని మీరు అడగాలి. బిడ్డా.. ఈ సభతో ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బజారుకీడుస్తాం. కరెంటు, సాగునీరు, తాగునీటి విషయంలో ప్రజలను ఇబ్బందులు పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం. అసెంబ్లీలో జనరేటర్ పెట్టిన చరిత్ర వీరిదే. అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంట్ పోతదా?’ అని కేసీఆర్ నిలదీశారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా.. ‘రైతుబంధు అడిగితే ఇవ్వడానికి చేతకావడం లేదా? ఇంత దద్దమ్మలా.. ఇవ్వకపోతే ఇవ్వలేదు.. రైతు బందు అడిగితే చెప్పుతో కొడతానని రైతులను అంటావా? పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటయ్. అవి గట్టిగా ఉంటాయ్. ఒక్కసారికి మూడు పళ్లు రాలిపోతాయి. మీకు ఇవ్వడం చేతగాకపోతే తరువాత ఇస్తామని చెప్పు. లేదంటే డబ్బులు లేవని చెప్పాలి. చలో నల్లగొండ పెడితే కేసీఆర్‌ను తిరగనీయం అంటారా? ఇంత మొగోళ్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనీయరా? ఏం చేస్తరు చంపుతారా? దా చంపుదువు రా.. కేసీఆర్‌ను చంపి మీరుంటరా? మీకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు పూర్తిచెయ్. మేడిగడ్డకు పోతం.. బొందల గడ్డ పోతాం అని వెళ్తున్నావు. బిడ్డా మేము కూడా ఈ స్టేజీ మీద ఉన్నోళ్లమంతా పోతాం. మీ బండారం బయట పెడతం. మేడిగడ్డకు పోయి ఏం పీకుతావు. దమ్ముంటే ప్రాణహిత నీటిని ఎత్తిపోయి. డోర్నకల్‌కు నీరు వస్తలేవు. సూర్యాపేటకు, తుంగతుర్తికి మునుపు వచ్చిన నీరు ఎందుకు తగ్గిపోయాయి..’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఆట»ొమ్మ అనుకుంటున్నవా? ‘కాళేళ్వరం అంటే ఒక ఆట బొమ్మ కాదు. మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 200 కి.మీ సొరంగాలు, 1,500 కి.మీ కాలువ, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి. మేడిగడ్డలో 250 పిల్లర్లు ఉంటాయి. రెండు కుంగిపోయాయి. గతంలో ఎన్నిసార్లు కుంగిపోలే. నాగార్జునసాగర్‌లో కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టకపోలేదా? మూసీ గేట్లు కొట్టుకు పోలేదా. ఏదన్న పోతే బాగుచేయాలి. తొందరగా పనిచేసి రైతులకు నీళ్లియ్యాలి. అది చేయకుండా అంత చిల్లర రాజకీయం ఎందుకు? ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. మేం మళ్లీ డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తం. అప్పుడు నేను గిట్టనే మాట్లాడాలా? ఇకనైనా ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. ఈరోజు నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు. పార్లమెంటు ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉంది. నేను మీ బిడ్డను. 15 ఏళ్లు పోరాడి, చావునోట్లో తలపెట్టి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు ఆరాటం ఉంటది. రాష్ట్రం నాశనం కావద్దనే తపన ఉంటది. దీన్ని అర్థం చేసుకోండి..’ అని కేసీఆర్ అన్నారు. మద్దతు ధర ఇస్తే బోనస్ ఇవ్వరట ‘కొత్త ప్రభుత్వం వచ్చినపుడు గతంలో కంటే బాగా పనిచేయాలి. వాళ్లు వచ్చినప్పటి నుంచి ఒక్కటైన మంచి మాట అన్నరా. పొద్దున లేస్తే కేసీఆర్‌ను ఎట్లా తిట్టాలనే ఆలోచనే. కేసీఆర్‌ను తిడితే, బురద జల్లితే పెద్దోల్లవుతారా? అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మాట మార్చుతున్నారు. ధాన్యానికి మద్దతు ధర వస్తే రూ.500 బోనస్ ఇవ్వరట. దొంగ మాటలతో, నంగనాచి మాటలతో తప్పించుకుంటామంటే నడవదు బిడ్డా జాగ్రత్త. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం..’ అని కేసీఆర్ హెచ్చరించారు. -
కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు: సీఎం రేవంత్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: గత ప్రభుత్వంలో మెడిగడ్డకు ఎవ్వరినీ చూడనివ్వలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలకు పాల్పడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సీఎం రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి బృందం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రజల ముందు దొషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే కేసీఆర్ నల్గొండ సభ పెట్టారు. కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము.మెడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు. కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మెడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నం అయింది. మెడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమాణించారు. ...కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్ రావు మద్దతు పలికారు. తీర్మానంపై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. భయపడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్‌కు ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుతం అంటూ న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టును చూపించారు. కేసీఆర్ నల్గొండలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి రావాలి. ఇరిగేషన్‌పై రేపు శ్వేతపత్రం పెడతాం.. కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మెడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. ...కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మెడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది. రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి. ఎల్ అండ్ టీ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలా వద్దా అనేది కేసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు. ప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు.. అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. ...భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటనకు వెళ్ళాలి. వస్తానన్న బీజేపీ ఎమ్మెలను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. కేసీఆర్ అవినీతిని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
వారికి చలో నల్గొండ సభ ఒక హెచ్చరిక: కేసీఆర్
సాక్షి, నల్గొండ: చలో నల్గొండ సభ.. ఉద్యమ సభ, పోరాట సభ.. రాజకీయ సభ కాదని మాజీ సీఎం కే. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కృష్ణా నీళ్ల మీద మన హక్కు అనేది.. మనందరి బతుకులకు చావో రేవో తేల్చే సమస్య అని పేర్కొన్నారు కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఈ రోజు నల్గొండలో ‘చలో నల్గొండ’ కార్యక్రమం చేపట్టాం. కారణం ఏంటి? ఎందుకు ఈ సభ పెట్టాల్సి వచ్చింది. నాకు కాలు విరిగినా ఎందుకు రావాల్సి వచ్చానో? తెలుసుకోవాలని అన్నారు. ఈ రోజు చలో నల్గొండ కార్యక్రమం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఇది రాజకీయం. కానీ.. ఇది ఉద్యమ సభ.. పోరాట సభ అని రాజకీయ సభ కాదని తెలిపారు. కృష్ణా నీళ్లమీద మన హక్కు అనేది.. మనందరి బతుకులకు చావో రేవో తేల్చే సమస్య అని తెలిపారు. ఈ మాట తాను తెలంగాణలో పక్షిలాగా తిరుగుతూ చెప్పవట్టి 24 ఏళ్లు అయిందని తెలిపారు. కృష్ణా కావోచ్చు.. అటు గోదావరి కావోచ్చు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఇదే నల్గొండలో నీళ్లు లేకపోతే ప్రజల బతుకులు వంగిపోయాయి. లక్షా యాబై వేల మంది మునుగోడు, దేవరకొండ ఇరత ప్రాంతాల్లో బిడ్డల నడుములు ఫ్లోరైడ్‌తో వంగిపోయాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారలంతా కలిసి ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయిన బిడ్డలను తీసుకెళ్లి ప్రధానమంత్రి టెబుల్‌పై పడుకోబెట్టి.. అయ్యా మా బతుకు ఇది అంటే పట్టించుకున్నవారు లేరు. ఆనాడు పార్టీలు లేవా.. మంత్రులు లేరా? ఎవరు పట్టించుకోలే. నల్గొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక జీరో ఫ్లోరైడ్‌గా చేశాం. ప్రజలను అడిగితే చెబుతున్నారు. మిషన్ భగీరత నీళ్లతో తమకు బాధలు లేవని చెబుతున్నారు. ఏడాడు ఏ నాయకుడు పటట్టించుకోలే. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ సభ పెట్టింది ఎందుకు? కొంత మంది సన్నాసులు తెలివి లేక వాళ్లకు వ్యతిరేకం అనుకుంటున్నారు. తాను ఒక్కటే మాటలో జరగవల్సింది చెబుతా.. ఉవ్వెత్తున మనం ఎగిసిపడకపోతే.. మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే.. ఎవరూ కూడా మన రక్షణకు రారు. ఈ మాట రాసి పెటట్టుకోండి. ఆనాడు ఫ్లోరైడ్ సమయంలో ఎవరూ రాలేదు. ఓట్లు ఉన్నప్పుడు వస్తారు కబుర్లు చెప్పడానికి కానీ, తర్వాత ఎవరూ రారు. ఓటు గుద్దినం గడ్డకు ఎక్కిర్రు అంటే మన వీపులో గుద్ది బొందలోకి నెట్టిర్రు తప్పితే ఎవరూ రాలే. ఇది జరిగిన చరిత్ర.. ఇప్పుడు జరుగుతున్న చరిత్ర.. దయచేసి మీరు గనించాలి. ఇది చిల్లరమల్లర రాజకీయ సభకాదు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర నాయకులకు, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్, కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రికి గాని మన నీళ్లు దొబ్బి పోదామనుకునే స్వార్థ శక్తులకు గాని.. ఈ చలో నల్గొండ సభ ఒక హెచ్చరిక అని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ఖమ్మం, నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజల జీవన్మరణ సమస్య ఇది పదేళ్ళ పాటు ఎలాంటి సమస్యలు లేకుండా పాలన చేసిన ఆముదాలు పండే నల్లగొండలో లక్షల టన్నుల వరి పండేలా చేశా పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపాయే అనే పాట నేనే రాశా పాలమూరు ఎత్తపోతల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆనాడు కాంగ్రెస్ సంవత్సర కాలానికి మాత్రమే నీళ్ల సర్దుబాటు చేసుకోండంటే తెలంగాణ రావాలని ఒప్పుకున్నాం నీళ్ల పంపిణీ చేయాలని మోదీ ప్రభుత్వం వచ్చాక వందల ఉత్తరాలు రాశాం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లినాం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లోక్ సభలో కూడా ఆందోళన చేశాం ఏ ప్రభుత్వం ఉన్నా మనకు రావాల్సిన వాటా కోసం కొట్లాడాలి పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుందని ఉత్తమ్ సోయిలేకుండా అంటున్నారు తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టె కాలే వరకు పులిలా కొట్లాడుతా నేను ఛలో నల్లగొండకు పిలుపునిస్తే అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం కూడా సరిగా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేసీఆర్‌ని తిట్టాలనే తపన తప్ప ఇంకొకటి లేదు ఎవరికీ అధికారం శాశ్వతం కాదు.. తెలంగాణ హక్కులు మాత్రమే శాశ్వతం కేసీఆర్ ప్రభుత్వం పోగానే కరెంట్ కట్ అవుద్దా... దద్దమ్మలు, చవటల రాజ్యం ఉంటే అలానే ఉంటుంది. కరెంటుకు, నీళ్లకు తిప్పలపెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం అసెంబ్లీలో జనరేటర్లు పెట్టారు. ఒకనాడు ఏడ్చిన తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించాం రైతు బంధు కూడా ఇవ్వరా.. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతాం అంటారా.. కళ్లు నెత్తికెక్కినయా పంటలు పండించే రైతులకు కూడా చెప్పులుంటాయి రైతు చెప్పుతో కొడితే మూడు పళ్లు ఊడుతాయి కేసీఆర్‌ను నల్లగొండలో తిరగనీయం అంటున్నారు. దమ్ముందా సంపుతరా? కేసీఆర్‌ని చంపి మీరుంటరా? పాలమూరు, సీతారామ ఎత్తిపోతలు, గురుకులాల ఏర్పాటు, కరెంట్ సరఫరా, మంచినీళ్ల సరఫరా సరిగా ఇవ్వాలనేది లేదు మేడిగడ్డ కాడ తోకమట్ట ఉందా... ఏం పీకుతరు.. అసెంబ్లీ అయిపోయాక మేం కూడా మేడిగడ్డకు పోతాం దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయ్యాలి సాగర్ కుంగిపోలేదా, కడెం గేటు కొట్టుకుపోలేదా, మూసి గేట్లు సరిగా ఉండేనా డబుల్ స్పీడ్‌తో మేం మళ్లీ అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం ఇలానే మాట్లాడాలా నది నీళ్లపై నీకు అవగాహన లేదు. నన్ను అడిగితే నేను చెప్పకపోయేవాడినా బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో మన వాటా తేలే వరకు పోరాటానికి ఐదు జిల్లాల ప్రజలు సిద్ధంగా ఉండాలి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా నాకు బాధ్యత ఉంటది అసెంబ్లీలో జనరేటర్ పెట్టిన ఘనులు కరెంట్ ఇస్తారా మళ్లీ మనమే వస్తాం. తెలంగాణకు ఏం కానివ్వను వరికి కనీస మద్దతు ధర ఇస్తే బోనస్ ఇవ్వరట కృష్ణా, గోదావరిలో రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం బీఆర్ఎస్ కొట్లాడుతది. నీళ్ల వాటా విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. ప్రాజెక్టులను అప్పగించాలని నన్ను కూడా బెదిరించారు. అయినా వినలేదు. -
పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు: కేసీఆర్
KCR Nalgonda Public Meeting Updates నల్గొండ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన మాజీ సీఎం కేసీఆర్ ఇది ఉద్యమ సభ, పోరాట సభ ఇది రాజకీయ సభ కాదు నీళ్లు లేకపోతే మనకు బతుకులేదు పక్షిలా తీరుక్కుంటూ రాష్ట్ర మొత్తానికి చెబుతూనే ఉన్నా నీరు లేకపోతే తెలంగాణ లేదు ఫ్లోరైడ్ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా పరిష్కరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే మనం ఉద్యమించకపోతే మనల్ని రక్షించేందుకు ఎవరూ రారు నల్లగొండ సభ తెలంగాణ వ్యతిరేకులకు ఓ హెచ్చరిక నిమిషం కూడా కరెంట్ పోకుండా మనం సప్లయ్ చేశాం పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు ఉమ్మడి రాష్ట్రమే బాగుండే అని ఇప్పటి పాలకులు అంటున్నారు ఉమ్మడి రాష్ట్రమే బాగుంటే అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది శ్రీకాంతాచారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టేకాలే వరకు పులిలా కొట్లాడుతా పిల్లిలాగా సైలెంట్‌గా ఉండను అవసరమైతే పిడికిలి బిగించాలి కేసీఆర్ సర్కారు పోగానే కరెంటు ఎటు పోయింది చేతగాని చవటలు, దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది అదనపు కరెంట్ ఉన్నా 24 గంటలు ఎందుకు ఇవ్వడంలేదు మీకు తెలివిలేక, నడపరాక, చేతకాక కరెంట్ పోతోంది 3 కోట్ల టన్నుల వడ్డు పండించిన తెలంగాణకు ఏం బీమారి వచ్చింది రైతుబంధు ఇవ్వడానికి ఏం రోగం వచ్చింది రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారు పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి రైతుల చెప్పులు బందోబస్తుగా ఉంటాయ కేసీఆర్‌ను తెలంగాణలో తిరగనీయమనేంత మొనగాళ్లా? కేసీఆర్‌ను బద్నాం చేయాలనే దుష్టబుద్ధితో రైతులను ఎండబెడతారా? కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు మేడిగడ్డ, బొందల గడ్డ పోతారట మేడిగడ్డ పోయి ఏం పీకుతారు దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయాలి మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే బాగు చేయించి నీళ్లు ఇవ్వాలి నాగార్జున సాగర్కుంగలేదా? కడెం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టులకు ఇబ్బందులు రాలేదా? అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో న్యాయమైన వాటా తేలేవరకూ కొట్లాడాలి నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు..హక్కుల మీద పోరాటానికి సిద్ధంగా లేకపోతే నష్టపోతాం కరెంట్ ఇప్పుడే లేకపోతే ముందు ముందు ఇంకా ఇస్తరా రైతు బంధు బ్యాంకుల్లో పడటం లేదు.. ఫోన్లు మోగడంలేదు అధికారం కోసం నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు దొంగ, నంగనాచి మాటలతో తప్పించుకుంటే నడవదు మీరేం బాధపడకండి, మళ్లీ మనమే వస్తాం కృష్ణా, గోదావరి జలాల్లో సంపూర్ణమైన వాటావచ్చే వరకూ పోరాడుతాం నల్గొండలో బీఆర్ బహిరంగ సభ సభా ప్రాంగణానికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ► నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది. బస్సుపైకి కోడిగుడ్లు విసిరి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. బస్సులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారు. ఎన్ఎస్యూఐ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాక్షి, నల్గొండ: కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ బయల్దేరారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, శ్రేణులు భారీగా చేరుకున్నారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు తరలివస్తున్నారు. నల్లగొండతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరానుండటంతో సభా ప్రాంగణానికి నలువైపులా జనం చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు సభకు పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనంలోకి అడుగుపెడుతుండటంతో ఈ సభపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనుంది. అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభు త్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశముంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభావేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. -
మళ్లీ సెంటిమెంట్ వైపు తెలంగాణ రాజకీయాలు
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ సెంటిమెంట్ వైపు నడుస్తున్నట్లున్నాయి. శాసనసభలో కృష్ణా జలాల వాటాకు సంబంధించి, ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించే అంశంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య జరిగిన వాగ్యుద్దం చూస్తే గాలిలో కత్తులు తిప్పుతున్నట్లుగా కనిపించింది. ఇరుపక్షాలు ఒకదానిపై మరొకటి అప్పర్ హ్యండ్ అవడానికి గట్టి ప్రయత్నమే చేశాయి. వీరిద్దరు కాకుండా భారతీయ జనతా పార్టీ, ఎమ్ఐఎమ్లు కొంత ప్రాక్టికల్‌గా మాట్లాడారు. సీపీఐ మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు మద్దతుగా బీఆర్ఎస్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాయలసీమకు నీటిని పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషిని ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశం గుర్తించకపోయినా, తెలంగాణ రాజకీయ పక్షాలు అకనాలెడ్జ్ చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి వృధాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఏపీకి రావాల్సిన నీటి వాటాను పూర్తి స్థాయిలో తీసుకోవడానికి గాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను తలపెట్టారు. కాని కొందరు ఎన్జీటీకి వెళ్లి నిలుపుదల చేయించారు. ఇందులో ఏపీలో విపక్ష తెలుగుదేశం పరోక్ష పాత్ర ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ అంశాన్ని పక్కనబెడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, సాగర్ తదితర ప్రాజెక్టులను రివర్ బోర్డుకు అప్పగించడానికి అంగీకరించిందంటూ బీఆర్ఎస్ వివాదం చేసింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో నల్గొండలో సభ జరపతల పెట్టిన నేపధ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ చేపట్టి శాసనసభలో ఏభై శాతం నీటి వాటా ఇచ్చేవరకు ప్రాజెక్టులను అప్పగించబోమంటూ ఒక తీర్మానాన్ని పెట్టింది. ఆ తీర్మానానికి బీఆర్ఎస్తో సహా వివిధ పార్టీలు ఆమోదం తెలిపాయి. బీఆర్ఎస్ మాత్రం ఆ తీర్మానంలో తమ గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను తొలగించాలని డిమాండ్ చేసింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎమ్బీ) కు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, దానికి ముందు తెలంగాణకు కూడా కృష్ణా జలాలలో ఏభై శాతం ఇవ్వాలని తెలంగాణ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎమ్సీల నీటిని కేటాయించారు. రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా, ఇతర ప్రాధాన్యాల ఆధారంగా తెలంగాణకు 299 టీఎమ్సీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎమ్సీలు నీటిని వాడుకునే అవకాశం కల్పించారు. రాష్ట్ర విభజన సమయంలో దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం ఏమిటంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధన ముఖ్యం అంతా భావించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం వచ్చిందని భావిస్తారు. ఇప్పుడు అదే నీటి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాజకీయ లబ్ది పొందడానికి యత్నించాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఈ సెంటిమెంటును వాడుకోవడానికి ఈ రెండు పార్టీలు ఇప్పటినుంచే కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంటే, ఆ మొత్తం తప్పంతా బీఆర్ఎస్ దేనని కాంగ్రెస్ బుట్ట బోర్లవేస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తూ ఎప్పుడెప్పుడూ ఏమి జరిగింది? చెప్పే యత్నం చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆధ్వర్యంలో ఎఫెక్స్ కమిటీ సమావేశంలో కృష్ణా జలాలలో తెలంగాణకు 299 టీఎమ్సీలు వాటానీటికి, ఏపీకి 511 టీఎమ్సీలు నీరు ఇవ్వడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని ఉత్తమ్ తెలిపారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్ వద్ద పనిచేసిన ప్రభుత్వ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజక్టులను అప్పగించడానికి అంగీకరిస్తూ లేఖ రాశారని, దానిని ఆమోదించడం లేదని, ఏభై శాతం నీటి వాటాకు ఒప్పుకుంటేనే బోర్డుకు అప్పగిస్తామని ఉత్తమ్ చెప్పారు. ఈ క్రమంలో నీటి పారుదల శాఖను కేసీఆర్ నాశనం చేశారని, వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మొత్తం తప్పు బీఆర్ఎస్దే తప్పు అని రుజువు చేయడానికి మంత్రి వాదన వినిపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉన్న స్నేహం కారణంగానే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ సామర్ధాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 92 వేల క్యూసెక్కులకు పెంచుకోగలిగారని, అలాగే రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 8 టీఎమ్సీలు తీసుకువెళ్లే స్కీమ్‌ను చేపట్టారని ఆయన అన్నారు. కాగా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షనేత కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదని ప్రశ్నించారు. ఆయన వచ్చి ఇంతటి ముఖ్యమైన విషయంపై మాట్లాడాలి కదా అని అన్నారు. ఈ చర్చలో పాల్గొంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు తమ పార్టీపై నెపం వేయడానికి మంత్రి వక్రీకరణ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రాజెక్టులను కేఆర్ఎమ్బీకి అప్పగించడానికి అంగీకరిస్తూ అధికారులు లేఖ రాశారని ఇటీవలవరకు ఉన్న ఈఎన్సీ మురళీదర్ బోర్డు సమావేశం తర్వాత చేసిన వ్యాఖ్యల వీడియోను హరీష్ ప్రదర్శించారు. దానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి జోక్యం చేసుకుంటూ ఆయన బీఆర్ఎస్ ఏజెంట్ అని అందుకే తీసివేశామని, మరికొందరు ఏజెంట్లు ఉన్నారని, వారిపై కూడా చర్య తీసుకుంటామని అన్నారు. హరీష్ రావు, మరో నేత కడియం శ్రీహరిలు 299 టీఎమ్సీల కేటాయింపు తమకు సంబంధం లేనిదని, గతంలో ట్రిబ్యునల్ చేసిందని వివరించే యత్నం చేశారు. మంత్రి ఉత్తమ్ ఆ విషయాన్ని దాటవేస్తూ మాట్లాడడం విశేషం. అలాగే కేసీఆర్ సభకు రాని అంశాన్ని హరీష్‌రావు సమాదానం చెప్పకుండా దాటవేశారు. నిజానికి తెలంగాణకు కేటాయించిన 299 టీఎమ్సీల నీటిని పూర్తిగా వాడుకోగలిగితే ముప్పై లక్షల ఎకరాలు సాగు చేయవచ్చు. కాని ఇంకా ఆ పరిస్తితి రాలేదు. అంతేకాక కృష్ణానదికి నీరురావడం ఆరంభం అయిన వెంటనే కల్వకుర్తి వంటి లిఫ్ట్ స్కీమును ఆపరేట్ చేసి నీటిని తీసుకోవచ్చు. వీటన్నిటినీ విస్మరించి, కేఆర్ఎమ్బీ ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఏదో నష్టం జరుగుతుందన్న చందంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు చర్చను జరిపారయి. ఇది పరస్పరం విమర్శలకే ఉపయోగపడుతుంది. కేసీఆర్ కూడా ఎన్నికలలో పరాజయం తర్వాత తొలిసారి నల్గొండలో కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యపైనే భారీ సభలో మాట్లాడబోతున్నారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ తమతోటే ఉండేలా వారుప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవాలి. దీనిని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారిన వైనం, అవినీతిపై ఫోకస్ పెట్టింది. కాగా బీజీపీ సభ్యుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు ఘర్షణ పడే పరిస్తితి ఉన్నప్పుడు కేఆర్ఎమ్బీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తప్పేముందని అభిప్రాయపడ్డారు. బోర్డుకు ప్రాజెక్టులకు అప్పగించడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? లాభం ఏమిటన్న దానిపై ఆలోచించాలని సూచించారు. కాంగ్రస్, బీఆర్ఎస్లు ఈ కోణంలో కాకుండా పరస్పరం నిందలు మోపుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ విభజన చట్టం చేసినప్పుడే తాము ఈ సమస్యలు వస్తాయని చెప్పామని గుర్తు చేశారు. కానీ అప్పట్లో ఏ రాజకీయ పార్టీ దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్న నీటి ప్రాజెక్టులకు ఎంత నీరు అవసరమో, అంతమేర నీటిని పొందడానికి యత్నించడం తప్పు కాదు. కానీ ఆ పాయింట్లో ఈ నేతలు ఎవరూ మాట్లాడలేదు. కేవలం ఏభై శాతం కృష్ణానది జలాలలో వాటా ఇవ్వాలన్న డిమాండ్‌కే పరిమితం అయ్యారు. ఎందుకంటే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఆయా పార్టీలు దీనిని ఒక నినాదంగా తీసుకోవాలని చూస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే సభలు, ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది. దానిని తిప్పి కొట్టడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ప్లాన్ చేశారు. కర్నాటక రాష్ట్రం తుంగభద్ర నదిపై కడుతున్న కొత్త ప్రాజెక్టు, వర్షాభావ పరిస్థితిలో కృష్ణానదికి నీటి కొరత ఏర్పడుతున్న విషయాన్ని కూడా ఆయా సభ్యులు ప్రస్తావించారు. ఇంకో సంగతి చెప్పాలి. కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు గతంలో భేటీ అయిన సందర్భాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అప్పట్లో గోదావరి నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించే ఒక స్కీమును కేసీఆర్ ప్రతిపాదించారు. దానికి తొలుత వైఎస్ జగన్మోహన్రెడ్డి సముఖత వ్యక్తం చేశారు. అప్పుడు ఏపీ శాసనసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసించారని అంటూ ఉత్తంకుమార్ రెడ్డి ఒక వీడియోని ప్రదర్శించారు. నిజానికి అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా దానిని చూపారు. ఆ తర్వాత రోజులలో ఏపీ ప్రభుత్వం ఆ స్కీముపై వెనక్కి తగ్గింది. నిజానికి దానివల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం.దానిని గుర్తించే ఏపీ వెనక్కి తగ్గింది. కానీ ఉత్తమ్ మాత్రం అదేదో ఏపీకి కేసీఆర్ మేలు చేసేసినట్లు పిక్చర్ ఇచ్చారు. అలాగే ఒకసారి కుటుంబంతో సహా కంచి వెళుతూ కేసీఆర్ మధ్యలో నగరిలో ప్రస్తుత మంత్రి రోజా ఇంటి వద్ద ఆగి భోజనం చేశారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ గోదావరి జలాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని రాయలసీమకు తరలించగలిగితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని అన్నారు. దానిని వక్రీకరిస్తూ కేసీఆర్ ఏదో రాయలసీమకు నీళ్లు ఇస్తానని అన్నట్లు ఉత్తమ్, తదితర కాంగ్రెస్ సభ్యులు చెప్పడం విశేషం. తెలంగాణతో పోల్చితే ఏపీలో విస్తీర్ణం ఎక్కువ సాగు భూమి ఎక్కువ. జనాభా ఎక్కువ. నది దిగువ ప్రాంతం కావడంతో వరదలు వచ్చినా భరించేది ఆ రాష్ట్రమే. అలాగే మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే ఏపీ వాడుకోవల్సిన పరిస్థితి పలుమార్లు వస్తోంది. శ్రీశైలంలో నీటి కొరత ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని కిందికి వదలివేస్తుంటుంది. తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ చెప్పినట్లు కృష్ణాపై పది అనుమతి లేని ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటికి శ్రీశైలంలో తక్కువ నీటి మట్టం ఉన్నా లిప్ట్ ద్వారా నీటిని తీసుకువెళతారు. అదే ఏపీ వైపు నీటి మట్టం 854 ఉంటేనే అది కూడా వరద నీటినే తరలించుకోగలుగుతారు. కొన్నిసార్లు తన వాటా నీటిని కూడా వాడుకోలేకపోతున్నామని ఏపీ వాదన. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోత స్కీమ్‌ను చేపట్టింది. అయితే ఈ విషయాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు ఏపీతో సమానంగా నీటి వాటాను డిమాండ్ చేస్తూ చర్చలు జరిపారు. చివరికి దీనిని ఎంత సెంటిమెంటుగా మార్చుతారో తెలియదు కానీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మాత్రం గాలిలో కత్తులతో పోరాటం చేసినట్లే అనిపించింది. – కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
మాది ప్రజా ప్రభుత్వం.. భయపెడితే భయపడం: సీఎం రేవంత్
LIVE Updates గత ప్రభుత్వంలో మేడిగడ్డను ఎవ్వరినీ చూడనివ్వలేదు: సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే నల్గొండ సభ పెట్టారు కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము. మేడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది... అన్నారం సుందిల్లా సున్నం అయింది. మేడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమానించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్‌రావు మద్దతు పలికారు. తీర్మానం పై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం... భయపెడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్ కు ప్లా్రైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుత్వం అంటూ న్యూ యార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ను చూపించారు కేసీఆర్ నల్గొండ లో మాట్లాడటం కాదు - అసెంబ్లీ కి రావాలి ఇరిగేషన్ పై రేపు శ్వేతపత్రం పెడతాం... కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మేడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వయం ఉంది. కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యం గా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి L AND T సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా అనేది కసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు... ఇప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు... అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటన కు వెళ్ళాలి వస్తానన్న బీజేపీ MLA లను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ BRS ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ BRS చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. *కేసీఆర్ అవినీతి ని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది: మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించినా రాలేదు వాస్తవాలు తెలుస్తాయనే భయపడుతున్నారు మేడిగడ్డ చేరుకున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం, మంత్రులు. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం బృందం మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న అధికారులు. మేడిగడ్డ పర్యటనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం, మంత్రులు మరో గంటన్నరలో మేడిగడ్డకు చేరుకోనున్న సీఎం బృందం కాంగ్రెస్ సభ్యులతో కలిసి వెళ్లిన సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 3.30కు మేడిగడ్డ చేరుకోనున్న సీఎం, మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టు, కుంగిన పిల్లర్లను సందర్శించనున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం Hon’ble CM Sri. A.Revanth Reddy will participate in Medigadda Barrage site visit, Today https://t.co/o1kwK1stM5 — Telangana Congress (@INCTelangana) February 13, 2024 కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది: రేవంత్ రెడ్డి ట్వీట్ మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా...కేసీఆర్ నోరు మెదపడం లేదు రూ. 97 వేల కోట్ల వ్యయం చేస్తే 97 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. మేడిగడ్డ మరమత్తులకు పనికిరాదు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి… 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు… pic.twitter.com/GPGGtBX8Lf — Revanth Reddy (@revanth_anumula) February 13, 2024 కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు: హరీష్ రావు మిగతా బ్యారేజీలు కూడా చూడాలి రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శన బ్యారేజీ పిల్లర్లు కుంగితే ఇష్యూ చేస్తున్నారు గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నం మేడిగడ్డకు బయల్దేరిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం, మంత్రులు రోడ్డుమార్గాన మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం, మంత్రుల రాకతో మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు. మేడిగడ్డ సందర్శనకు సీపీఐ, ఎంఐఎం సభ్యులు. బీఆర్ఎస్, బీజేపీ దూరం. సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం నేడు సందర్శించనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో అక్కడికి వెళ్లనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బస్సులు సిద్ధంగా ఉన్నాయి. అసెంబ్లీ నుంచి బస్సుల్లో నేరుగా మేడిగడ్డకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జి, కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రుల మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి.. హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. -
25 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వస్తే..: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు పార్టీలోకి వస్తే తీసుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావుకు దేవాదాయ శాఖ మంత్రి పదవిని కూడా ఇస్తామని, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన పాపాల ప్రక్షాళనకు ఈ పదవి ఆయనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అయితే ఇందుకోసం హరీష్ రావుమరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకురావాల్సి ఉంటుందని షరతు విధించారు. అసెంబ్లీ లాబీల్లో రాజగోపాల్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ హరీష్ రావు‘రైట్‌పర్సన్ ఇన్ రాంగ్ పారీ్ట’అని, ఆయన కష్టపడతారని, ఇప్పుడున్న పారీ్టలో భవిష్యత్‌లేదని అన్నారు. నల్లగొండలో బీఆర్ఎస్ సభకు ప్రజలు హాజరయ్యే అవకాశాలు లేవని, అది అట్టర్‌ఫ్లాప్ అవుతుందని, డబ్బులు పంచి జనాల కాళ్లు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీమంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీని నడపాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్లో హరీశ్‌రావు, కడియం శ్రీహరి మాదిరిగా తమది అన్నింటికీ తలూపే జీ హుజూర్ బ్యాచ్ కాదని పేర్కొన్నారు. -
Telangana Assembly: కేసీఆర్ ఎందుకు రాలేదంటే..
సాక్షి, హైదరాబాద్: శాసనసభకు మాజీ సీఎం కేసీఆర్ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయారని, ఆయన వచ్చి మాట్లాడినా, ఆయన స్థానంలో బీఆర్ఎస్ సభ్యులుగా తాము మాట్లాడినా అది పార్టీ అభిప్రాయమే అవుతుందని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి పేర్కొన్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించలేదన్న అంశంపై సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చకు బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవటాన్ని అధికార పక్ష సభ్యులు పదే పదే పేర్కొన్న సందర్భంలో కడియం స్పందించారు. కేసీఆర్ హాజరు కాలేకపోయినా, పార్టీ అభిప్రాయంగా తాము మాట్లాడుతున్నామని వెల్లడించారు. హరీశ్‌కు కేటీఆర్ అభినందన కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై జరిగిన చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా అభినందించారు. అంశంపై పట్టులేని ముఖ్యమంత్రి రేవంత్, ఆయన సహచర మంత్రివర్గాన్ని హరీశ్‌రావు అద్భుతంగా ఒంటిచేత్తో ఎదుర్కొన్నారన్నారు. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన అసత్య ప్రచారం, అబద్ధాలను తిప్పికొట్టి అపోహలు తొలగించారన్నారు. మంగళవారం జరిగే ‘చలో నల్లగొండ’సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం, అబద్ధాలను తిప్పి కొడతారని కేటీఆర్ పేర్కొన్నారు. -
Congress vs BRS: ఇరిగేషన్ వార్ తారాస్థాయికి..
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీ నుంచి సీన్ మారి రోడ్డెక్కింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల నడుమ నీళ్ల నిప్పులు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే మంగళవారం పోటాపోటీ ప్రదర్శనలకు ఇరు పార్టీలు సిద్ధం అయ్యాయి. ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పైచర్చ జరగాల్సి ఉంది. అయితే అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మేడిగడ్డ సందర్శనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రాజెక్టు సందర్శనకు ప్రజాప్రతినిధులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. దీంతో అంతా బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టుకు బయల్దేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులంతా రోడ్డు మార్గాన బస్సుల్లో రావాలని ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నాం మూడు గంటల ప్రాంతంలో బస్సులు మేడిగడ్డకు చేరుకోనున్నాయి. గంటన్నర పాటు ప్రాజెక్టును, పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులంతా సందర్శిస్తారు. ఆపై సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉండనుంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఎంఐఎం సభ్యులు సైతం మేడిగడ్డ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి కేసీఆర్ సభ మరోవైపు కృష్ణా నది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు - KRMBకి అప్పగించడంపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టంది. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మర్రిగూడ బైపాస్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గం. ప్రాంతంలో ఈ సభ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభ ఇదే కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే నల్లగొండ, ఖమ్మంల నుంచి 2 లక్షల మంది సభకు తరలించాలని నిర్ణయించింది. ఈ సభలో కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు వివరిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. నల్లగొండలో ఉద్రిక్తత! కేసీఆర్ సభకు కౌంటర్‌గా.. నల్లగొండ క్లాక్ టవర్‌లో మినీ సభకు కాంగ్రెస్ సిద్ధమైంది. గత పదేళ్లలో కృష్నా జలాల విషయంలో బీఆర్ఎస్ అవలింభించిన విదాల్ని వివరించడంతో పాటు ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంపైనా పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధమైంది. అలాగే.. కేసీఆర్ కోసం గులాబీ కుర్చీ, కండువాను సిద్దం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. దీనిని బీఆర్ఎస్ అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
కడలిలో కలిసేవే ఇచ్చాం
సాక్షి, హైదరాబాద్: ఏటా రెండు వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తాయని, అలా కలిసే జలాలనే వాడుకొమ్మని తమ ప్రభుత్వ హయాంలో ఏపీకి అవకాశం ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దీనివల్ల కృష్ణా జలాలను ఎక్కువగా వాడుకోవడానికి తెలంగాణకు అవకాశం దొరుకుతుందన్నది తమ ఉద్దేశమని తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని అసెంబ్లీలో తీర్మానం చేయడం తెలంగాణ ప్రజల విజయమన్నారు. సోమవారం అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మేం నల్లగొండలో సభ పెట్టుకోవడం చూసే ఈ తీర్మానం చేశారు. చర్చ సందర్భంగా ప్రభుత్వం అసత్యాలు మాట్లాడింది. ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని మేం కృష్ణాబోర్డుకు అప్పగించడం సాధ్యమేకాదు. కాంగ్రెస్ సర్కారు మాటలు అవాస్తవమని ప్రస్తుత అధికారి రాహుల్ బొజ్జా కేంద్రానికి రాసిన లేఖే నిదర్శనం. ఆపరేషన్ ప్రొటోకాల్ లేకుండా ఒప్పుకోబోమని మేం అధికారంలో ఉండగా చెప్పాం. రెండో అపెక్స్ సమావేశంలో నీటి వాటాను వ్యతిరేకిస్తూ లేఖ రాశాం. గత కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రాకు 512 టీఎంసీలు వాటాగా ఉన్నాయి. మేం ఏపీ, తెలంగాణ చెరో సగం అనే డిమాండ్ తెచ్చాం. దీనిపై అనేకసార్లు లేఖలు రాశాం. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు.. జలాల విషయంలో కేసీఆర్‌ను విమర్శించడం సరికాదు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. సీఎం రేవంత్‌రెడ్డికి ఆ సీటు ఉండేది కాదు. సోనియాను దేవత, బలిదేవత అన్నదెవరో ప్రజలకు తెలుసు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమన్న తీర్మానాన్ని బలపరుస్తున్నాం. అయితే ప్రాజెక్టులను అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించినందుకు క్షమాపణ చెప్పాలి. ఉత్తమ్వన్నీ అవాస్తవాలే.. ప్రాజెక్టుల విషయంలో మంత్రి ఉత్తమ్ మాటలన్నీ ఉత్తవే. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలేదు. మీరు రెండు నెలల్లో అప్పగించారు. పైగా నాటి ప్రభుత్వం ఒప్పుకుందని అవాస్తవాలు చెప్తున్నారు. అవాస్తవం 1: అపెక్స్ కమిటీ మీటింగ్‌లో కృష్ణాబోర్డుకు అప్పగించామన్నారు. అతి తప్పు. ఎందుకంటే మ్యాటర్ సబ్ జ్యుడిస్ (కోర్టు పరిధిలో)గా ఉంది. అవాస్తవం 2: కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను బీఆర్ఎస్ సర్కారు సవాల్ చేయలేదన్నారు. ఇది అవాస్తవం. ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా.. 15.07.2021 నాటి గెజిట్‌లో మార్పులు చేయాలని కేంద్రానికి రాసిన లేఖ దీనికి సాక్ష్యం. అవాస్తవం 3: కృష్ణాబోర్డు 16వ Üసమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకొందన్నారు. ఇది అవాస్తవం.. ఆపరేషన్ ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టుల అప్పగింతకు మేం ఒప్పుకోబోమని స్పష్టంగా చెప్పాం. అవాస్తవం 4: రెండో అపెక్స్ కౌన్సిల్లో నీటివాటాను అంగీకరించామన్నారు. అవాస్తవం. మేం వ్యతిరేకించాం. ఈ అంశంపై 27 లేఖలు కూడా రాశాం. ఒప్పుకున్నది మీరే.. ఈ ఏడాది జనవరిలో జరిగిన మీటింగ్ మినిట్స్ ప్రకారం.. ‘‘ఏపీ, తెలంగాణ చర్చల తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను ఏడు రోజుల్లో అప్పగిస్తామనే ప్లాన్‌తో మీ ముందుకు వస్తాం. నెల రోజుల్లో ప్రాజెక్టులను అప్పగిస్తాం. సాగర్ డ్యాం వద్దకు వెళ్లాలంటే కృష్ణాబోర్డు అనుమతి కావాలి. బోర్డుకు ఇరు రాష్ట్రాలు డబ్బులు ఇస్తాయి..’’ అని కాంగ్రెస్ సర్కారు పేర్కొంది. దీనిపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పుడెందుకు నోరు మెదపలేదు. నేను ప్రెస్‌మీట్ పెట్టి నిలదీశాకే.. మీరు కేంద్రానికి లేఖ రాశారు. మళ్లీ ఫిబ్రవరి 1న జరిగిన మీటింగ్‌లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని చెప్పారు. మ్యాన్ పవర్ అవసరం గురించి చర్చించారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు అంగీకరించారు. అంటే.. కాంగ్రెస్ సర్కారే ఒప్పుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ రెండు మీటింగ్‌లలో తెలియకుండా ఒప్పుకొన్నామని శాసనసభకు క్షమాపణ చెప్పండి. పోరాడండి.. సహకరిస్తాం మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని మీద చర్చ లేదు. కృష్ణా ప్రాజెక్టులపై రెండు రోజులైనా చర్చపెడదామన్నారు. ఇప్పుడు మైకులు ఇవ్వడం లేదు. 2014 జూలై 14న కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కేంద్రాన్ని కేసీఆర్ అడిగారు. నదీ జలాల చట్టం ప్రకారం ఏడాది గడిచాక.. ట్రిబ్యునల్ వేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లాం. తర్వాత కేసు వాపస్ తీసుకుని, సెక్షన్ 3 కింద ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. మేం 9 ఏళ్లు కష్టపడితే ట్రిబ్యునల్ వచ్చింది. మీరు పోరాటం చేయండి. మేం సహకరిస్తాం. ట్రిబ్యునల్‌కు సమయం పెడదాం. 6 నెలల్లో ప్రాజెక్టుల వారీగా నీళ్లు కేటాయించాలని అడుగుదాం. పోతిరెడ్డిపాడుపై అప్పుడు మాట్లాడలేదేం? మేం సముద్రంలో కలిసే గోదావరి జలాలను వినియోగించుకునేందుకు ఏపీకి అవకాశం ఇచ్చామేగానీ.. కృష్ణా జలాల గురించి చెప్పలేదు. రాయలసీమ లిఫ్ట్ గురించి 2020 మే 5న జీఓ వచ్చింది. అంతకుముందే 2020 జనవరి 29నే మేం కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ఆ ప్రాజెక్టును ఆపాలంటూ మే 12న లేఖ రాశాం. అపెక్స్ కమిటీ మీటింగ్‌లలో కూడా కోరాం. కాంగ్రెస్ సర్కారు అవాస్తవాలు చెప్తోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినప్పుడు మేం పేగులు తెగేదాకా కొట్లాడాం. అప్పుడు మీరెందుకు మాట్లాడలేదు?..’’ అని హరీశ్‌రావు నిలదీశారు. -
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలపై విచారణ జరపాలని ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిసారీ చేసింది కాంగ్రెస్ నేతలయితే, కేసీఆర్ కుటుంబం సెంటిమెంట్‌ను వాడుకుని రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌లతో కలిసి ఆయన మాట్లాడుతూ, హెచ్ఎండీఏలో ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంటే పెద్దోళ్లు బయటకు వస్తున్నారని అన్నారు. ఈ శాఖను కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నిర్వహించిన నేపథ్యంలో ఈ అవినీతిలో ఎవరెవరు ఉన్నారన్నది బట్టబయలు చేయాలని కోరారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన చరిత్ర తమదని, తెలంగాణ రైతాంగానికి కూడా రుణమాఫీ చేస్తామని, రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. నాడు పోపో అంటే... నేడు రా.. రా అంటున్నారు: జగ్గారెడ్డి ధరణి పోర్టల్ లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, రైతులకు ఉపయోగపడని ధరణిని రద్దు చేయాలని రాహుల్‌గాం«దీనే చెప్పారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్ల తర్వాత అసెంబ్లీలో మూడున్నర గంటలపాటు చర్చ జరిగిందని, అసెంబ్లీలో ఏం జరుగుతోందన్నది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిని పోపో అని నోరు మూసేవారని, ఇప్పుడు సీఎం రేవంత్ మాత్రం రా..రా.. అంటున్నా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారం ఇవ్వకపోతే కేసీఆర్ అసెంబ్లీకి రాడా అని ప్రశ్నించారు. ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్ అవమానపరుస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. -
రాజ్యసభ అభ్యర్థిగా సుప్రియా శ్రీనేత్?
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏఐసీసీ సోషల్ మీడియా చైర్మన్ సుప్రియా శ్రీనేత్‌కు అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే చాన్స్ ఉన్న నేపథ్యంలో ఒకటి ఏఐసీసీ నుంచి మరోటి తెలంగాణ నుంచి భర్తీ చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ జర్నలిస్టు సుప్రియా శ్రీనేత్ పేరును పరిశీలిస్తున్నారని గాందీభవన్ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ లేదంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాందీలను తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని, లేదంటే రాజ్యసభకు పంపాలని కోరుతూ టీపీసీసీ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి అభ్యర్థిత్వాలు కాని పక్షంలో శ్రీనేత్తో పాటు కేంద్ర మాజీ మంత్రులుగా పనిచేసిన ఇద్దరి నేతల పేర్లు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రానికి చెందిన ఒకరిని ఈమారు రాజ్యసభకు పంపనున్నారు. చాలాకాలం తర్వాత రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభిస్తుండటంతో పలువురు నేతలు రేసులో ఉన్నారు. అయితే, ఈసారి తెలంగాణ నుంచి బీసీ నేతను రాజ్యసభకు పంపుతారనే చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వస్తే జానారెడ్డి, రేణుకా చౌదరిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈనెల 15వ తేదీతో రాజ్యసభ అభ్యర్థిత్వాల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో బుధవారం రాజ్యసభ అభ్యర్థులెవరన్న దానిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. -
కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ముందా?
వేములవాడ: కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడానికి కారకులైన కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా ? అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజాహితయాత్రలో భాగంగా సోమవారం రాత్రి వేములవాడకు చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎల్అండ్టీ సంస్థను బెదిరించి సబ్‌కాంట్రాక్టు తీసుకొని పనులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. కాంగ్రెస్ వారు మేడిగడ్డను టైంపాస్‌గా చూసేందుకో, పిక్నిక్ స్పాట్, వాటర్‌ఫాల్స్ చూడటానికి వెళ్లినట్టు ఉండొద్దని సూచించారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేసిన కేసీఆర్ కుటుంబం ఆస్తుల జప్తు చేయాలని కోరారు. మేడిగడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. వేములవాడలో సంజయ్ సరదాగా ఆటో నడిపారు. ఆయన పక్కనే బీజేపీ నేత డాక్టర్ వికాస్‌రావు కూర్చున్నారు. ఒంటరిగానే బరిలోకి దిగుతాం.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ఖర్మ తమకు లేదని స్పష్టం చేశారు. వేములవాడరూరల్ మండలం చెక్కపల్లి, నూకలమర్రి, నమిలిగుండుపల్లి, వట్టెంల, శాత్రాజుపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాహితయాత్రలో ఆయన మాట్లాడారు. -
నేడు నల్లగొండలో కేసీఆర్ సభ
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనంలోకి అడుగుపెడుతున్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతుగర్జన పేర బీఆర్ఎస్ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేసింది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభు త్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశముంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభావేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సభకు ప్రాధాన్యం గత ఏడాది డిసెంబర్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే పార్టీ అధినేత కేసీఆర్ తుంటి ఎముక శస్త్ర చికిత్స జరిగి విశ్రాంతి తీసుకున్నారు. పార్టీ నేతలతో నందినగర్ నివాసంలో, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయిన కేసీఆర్, ఇప్పటివరకు బహిరంగంగా జనంలోకి రాలేదు. ఈనెల 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ అదేరోజు తెలంగాణభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతోనూ భేటీ అయ్యారు. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా, కేసీఆర్ వాటికి దూరంగా ఉన్నారు. కానీ నల్లగొండ సభలో కేసీఆర్ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా ప్రారంభించినట్లేనని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణభవన్ నుంచి నల్లగొండ సభకు పార్టీ ముఖ్య నేతలు తెలంగాణభవన్ నుంచి బయలుదేరేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నల్లగొండ సభకు హాజరవుతారు. కేటీఆర్ నేతృత్వంలో నేతలందరూ ప్రత్యేక బస్సుల్లో నల్లగొండకు వెళతారు. కేసీఆర్ మాత్రం హెలికాప్టర్ ద్వారా నల్లగొండకు చేరుకొని, సభ అనంతరం తిరిగి వాయుమార్గాన హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నల్లగొండసభకు కీలక నేతలు హాజరు కావడం ద్వారా ప్రభుత్వ వాదనను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. -
TS: స్వరాష్ట్రంలోనే అన్యాయం!
కృష్ణా జలాల పంపిణీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్.. దానిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదంతో సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కింది. కృష్ణా నీటిని ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్రానికి తరలించుకుపోతుంటే కేసీఆర్ సహకరించారని అంటూ అధికారపక్షం విమర్శలు గుప్పించగా.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తోందని, ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ దీటుగా ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ సర్కారు తీరును వివరించేందుకు తాము నల్లగొండలో బహిరంగ సభ చేపడితే.. దృష్టి మళ్లించేందుకు సభలో తీర్మానం పెట్టారని మండిపడింది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పాపాల భైరవుడు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్రాన్ని మోసం చేసిన కేసీఆర్‌ను కొడతారంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్: నదీ జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాకే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. జలాల్లో ఏపీకి ఎక్కువ వాటా ఇచ్చినా, ఆ రాష్ట్రం భారీగా తరలించుకుపోతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ సర్కారు కుమ్మక్కైందని ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించినది గత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నం చేసినా.. స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకొని మంత్రిని మాట్లాడనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘2020లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 92,500 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోవడానికి ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 203 తెచ్చినా కేసీఆర్ సర్కార్ అడ్డుకోలేదు. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. కృష్ణా నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినా పట్టించుకోలేదు. పోతిరెడ్డిపాడు ద్వారా 1983లో 11,150 క్యూసెక్కుల నీరు తరలిస్తే.. 2005లో వైఎస్సార్ ప్రభుత్వం దానిని 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచింది. జగన్ వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏకంగా 92,500 క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడు ద్వారా 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలను తీసుకెళ్తే.. 2014 నుంచి 2024 వరకు ఏకంగా 1,201 టీఎంసీలను ఏపీ తరలించుకుపోయింది. ఏనాడూ అభ్యంతరం తెలపలేదు 2014లో కేంద్ర ప్రభుత్వం కృష్ణాజలాల్లో నీటి వాటాను తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలుగా నిర్ణయిస్తే.. అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి 299 టీఎంసీలకు ఒప్పుకొని.. కృష్ణా జలాల్లో తెలంగాణకు శాశ్వత నష్టం చేకూర్చారు. 2015 నుంచి 2023 వరకు ఏటా ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్, హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలేమీ తెలపలేదు. అప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల కోసం 299 టీఎంసీలకు ఒప్పుకొన్నవాళ్లు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన 225 టీఎంసీల గురించి గానీ, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమైన 206 టీఎంసీల గురించి గానీ ఏనాడూ అడగలేదు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డిలకు అవసరమైన నీటి గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. అపెక్స్ కమిటీ సమావేశంలో కేసీఆర్ సైతం.. 2016 సెపె్టంబర్ 16న ఢిల్లీలో జరిగిన తొలి అపెక్స్ కమిటీ సమావేశానికి అధికారులతో పాటు అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్‌రావు హాజరయ్యారు. అప్పుడు కూడా కృష్ణాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొని వచ్చారు. నీటి వాటాలపై ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా పాత ఒప్పందమే కొనసాగించాలంటూ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా కేసీఆర్ అంగీకరించడం రాష్ట్రానికి తీరని ద్రోహమే. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతి, అన్యాయం స్వతంత్ర భారత చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇంతా చేసి తెలంగాణ ప్రజానీకంలో అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వాస్తవాలతో ప్రజెంటేషన్ ఇస్తున్నాం. కృష్ణానీటి వాటాలో అన్యాయంపై మేం పోరాడుతాం. ఏపీ ప్రయోజనం కలిగేలా చేశారు ఏపీ సీఎం జగన్, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ గంటల కొద్దీ ఏకాంత చర్చలు చేసుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు ముగిసేదాకా కేసీఆర్ అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరుకాకుండా ఏపీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరించారు. కేసీఆర్ తెలంగాణ నీళ్లను ఏపీకి ఇస్తున్నారంటూ జగన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో పొగడటం నిజం కాదా? అసెంబ్లీ ఎన్నికల చివరిరోజున నాగార్జునసాగర్‌ను ఏపీ ప్రభుత్వం అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక రాజకీయం లేదా? కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని తరలించుకోవడం వాస్తవం కాదా? ఈ ఘటనపై కేసీఆర్ ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కృష్ణాబోర్డుకు నాగార్జునసాగర్‌ను అప్పగించేందుకు సిద్ధమన్న రీతిలో అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కేంద్రానికి లేఖ రాయడం మరింత నష్టం కలిగించింది. మేం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకమని కేంద్రానికి స్పష్టం చేశాం. ఇందుకు సంబంధించిన సమావేశం మినిట్స్ మార్చాలని కోరాం. అయినా ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం తగదు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. కేసీఆర్ సభకు వస్తే.. తేలుస్తాం: రేవంత్‌రెడ్డి పదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ అని.. కృష్ణా నదిజలాలపై ముఖ్యమైన చర్చ జరుగుతుంటే ఆయన సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ చర్చలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు, వారి మాటలకూ ఏమాత్రం విలువ లేదు. గత పదేళ్ల పాపాలకు కేసీఆరే బాధ్యుడు. ఆ పాపాల భైరవుడు సభలోకి వచ్చి చర్చ చేస్తే మేం సమాధానం చెప్తాం. బీఆర్ఎస్ అధినేత ఇక్కడికొచ్చి మాట్లాడాలి. ఆయనకు ఎంతసేపైనా మైక్ ఇచ్చేందుకు సిద్ధం. తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో తేలుస్తాం..’’ అని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే సభను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత ఎన్నికల్లో కేసీఆర్‌కు నల్గొండ జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చెప్పుతో కొట్టినట్టుగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కనీసం మంచినీళ్లు కూడా అందని విధంగా నాశనం చేశారని ఆరోపించారు. ఇంత అన్యాయం చేసిన కేసీఆర్ నల్లగొండకు వచ్చే ముందు ముక్కు నేలకురాసి తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కోవర్టులున్నారు.. సాగనంపుతాం: భట్టి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. కృష్ణా జలాలపై అప్పటి ఈఎన్సీ మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈఎన్సీ బీఆర్ఎస్ వ్యక్తిగా పనిచేశారని, అందుకే సాగనంపామని పేర్కొన్నారు. ఇలాంటి కోవర్టులు ఇంకా ఉన్నారని, వారిని కూడా పంపేస్తామని చెప్పారు. -
ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్‌పై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. సోమవారం ఆయన తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఉత్తమ్ మాటలు మాకే అర్థం కాలేదని.. ప్రజలకు ఏం అర్థమవుతుందన్నారు. ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంది. ఉత్తమ్ తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్‌లో మాట్లాడారని కేటీఆర్ అన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
Telangana Assembly Budget Session.. అప్డేట్స్.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా కేసీఆర్ తెలంగాణకు తీరని నష్టం చేశారు: ఉత్తమ్ పదేళ్లలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారు రేపు కాళేశ్వరం సందర్శనకు అందరినీ ఆహ్వానిస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ చిట్‌చాట్ ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంది. ఉత్తమ్ తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు ఉత్తమ్ మాటలు మాకేం అర్థం కావడం లేదు.. ప్రజలకు ఏం అర్థమవుతుంది. ఆనాడు పదవులు కోసం పెదవులు మూసుకుంది: హరీష్‌రావు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేంద్రానికి చెప్పి వచ్చి ఇక్కడ తంటాడు పడుతున్నారు పోతిరెడ్డిపాడుపై పేగులు తెగేదాకి కొట్లాడింది మేం అపోహలు సృష్టించి సభను తప్పుదోవ పట్టించొద్దు రాష్ట్రానికి కృష్ణా జలాల కంటే ఎక్కువ మరేముంది: మల్లు భట్టి విక్రమార్క కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్సర్కార్ అనేక తప్పులు చేసింది గత సర్కారు తప్పులను సరిచేయడానికి ఉత్తమ్ నానా తంటాలు పడుతున్నారు కేసీఆర్‌పై రేవంత్ సీరియస్ కేసీఆర్ సభకు రావాలి. పదేళ్ల పాలనలో జరిగిన పాపాలకు కేసీఆరే కారణం. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలకు విలువ లేదు. కేసీఆర్ సభకు వస్తే ఎంతసేపైనా చర్చిస్తాం. కృష్ణా జలాలపై చర్చకు కేసీఆర్ ఎందుకు రాలేదు?. కేసీఆర్ సభ రాకుండా ఫాంహౌస్‌లో దాక్కున్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారు. పద్మారావు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. పద్మారావును ప్రతిపక్ష నేతను చేయాలి. హరీష్ కామెంట్స్.. కాంగ్రెస్ ప్రాజెక్ట్‌లను అప్పగించేందుకు ఒప్పుకుంది. సీఎం రేవంత్ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. రేవంత్ కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజ్‌గిరికి ఎందుకొచ్చారు?. వాస్తవాలు చెప్తుంటే కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు. అధికారులను బద్నాం చేసుకుంటూ ఎన్ని రోజులు తప్పించుకుంటారు. ►తెలంగాణ శాసన మండలి ఈనెల 14కు వాయిదా ఉత్తమ్ కామెంట్స్.. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోంది. ప్రాజెక్ట్‌లు అప్పజెప్పడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హరీష్‌రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావు కోమటిరెడ్డి కామెంట్స్.. దక్షిణ తెలంగాణను నాశనం చేశారు. నల్లగొండవాసులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. నల్లగొండ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కేసీఆర్ నల్లగొండకు రావాలి. హరీష్‌రావు కామెంట్స్.. నల్లగొండలో సభ పెట్టినందునే ప్రభుత్వం తీర్మానం పెట్టింది. ఇది బీఆర్ఎస్ విజయం మాకు ప్రజెంటేషన్ అవకాశం ఎందుకు ఇవ్వలేదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ శాసనసభలో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు విఫలమైంది. కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారం. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కృష్ణా జలాలు తరలించే ప్రసక్తే లేదు. కృష్ణా ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పజెప్పే ప్రసక్తే లేదు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది. నదీ జలాల పంపకాల్లో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం. తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ, బీఆర్ఎస్ వచ్చాన కృష్ణా జలాల్లో మరింత అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే.. ప్రత్యేక రాష్ట్రంలోనే ఎక్కువ అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయి. ఇన్ ఫ్లో తగ్గింది.. డైవర్షన్ పెరిగింది. కృష్ణా జలాలపై గత ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదు. ఏపీ ప్రభుత్వం అదనపు నీటని తరలిస్తున్నా మౌనంగా ఉన్నారు. పాలమూరు-రంగారెడ్డికి రూ.27500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. 811 టీఎంసీల్లో కేవలం 299 టీంసీలే క్లేయిమ్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 50 శాతం కావాలని మాట్లాడుతున్నారు. అంతా చేసి నల్లగొండలో సభ పెడితే ఏం లాభం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీరియస్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రధాన చర్చ మిగులు గోదావరి జలాలపై.. కృష్ణా జలాలపై కాదు. ఏపీ సీఎం జగన్ కృష్ణా జలాలపై మాట్లాడలేదు.. గోదావరి జలాలపై మాట్లాడారు. దీన్ని కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంచేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ షాకింగ్ కామెంట్స్ కేసీఆర్ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలి. కేఆర్ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పగించింది కేసీఆరే. రాజకీయాల నుంచి కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిన రాష్ట్రాన్ని మేము గాడిలో పెడుతున్నాం. నల్లగొండ జిల్లాకు కేసీఆర్, జగదీష్ రెడ్డి తీరని అన్యాయం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీవేడీ చర్చ కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. అసెంబ్లీలో రెండు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు. సభలో సభ్యులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్ అయితే, సభలో తమకూ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ విజ్ఞప్తిని తిరస్కరించిన స్పీకర్ ఇక, ప్రజెంటేషన్ కాపీలను ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నారు. ►చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►విద్యుత్, ఫారెస్ట్ కార్పొరేషన్ వార్షిక రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. ►అలాగే, దివంగత నేతలు మచిందర్ రావు, నర్సారెడ్డి, రాజమల్లుకు సంతాపం తెలపనుంది. ►బడ్జెట్‌పైచర్చ-సమాధానం ఇవ్వనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ►అలాగే ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ►మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టుపై సభలో ప్రకటన చేయనుంది. ►ఇక, టొబాకో అండ్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ►2023-24 సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్‌పెండేచర్‌పై ప్రకటన ►మరోవైపు కృష్ణా జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య మాటల యుద్ధం నడుస్తోంది. ►కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.