breaking news
-
జైల్లో చిప్పకూడు తినిపిస్తా
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కాలు విరిగిందని, అధికారం పోయిందని, కూతురు జైలుకెళ్లిందని ఇన్నాళ్లూ సంయమనం పాటించామని.. సైలెంట్‌గా ఉన్నామని ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాను జానారెడ్డి టైపు కాదని.. తప్పుడు మాటలు మాట్లాడితే అంగీ, లాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని హెచ్చరించారు. గతంలోనే తాను చెప్పినట్టు కేసీఆర్, కూతురు, అల్లుడు, కుటుంబం ఉండేట్టు అందులో డబుల్ బెడ్రూం కట్టిస్తానని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ ప్రసంగించారు. బీఆర్ఎస్తోపాటు బీజేపీపై, ఆ పార్టీల నేతలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే..‘‘ఇన్నాళ్లూ కుక్కలు మొరిగినయ్. ఇప్పుడో నక్క వచ్చింది. మొన్న సూర్యాపేటకు, నిన్న కరీంనగర్‌కు వెళ్లింది. కేసీఆర్ తననేం పీకుతారని అడుగుతున్నారు. వెంట్రుక కూడా పీకలేరని అంటున్నారు. అది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? పదేళ్లుగా రాష్ట్రాన్ని పీడించి, దోచుకున్న దొంగలు వాళ్లు. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం.. గత ఏడాది సెప్టెంబర్ 17న సోనియాగాంధీ ఇదే చోట సభలో ఆరు గ్యారంటీలిచ్చి తెలంగాణలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా దేశానికి ఐదు గ్యారంటీలను రాహుల్‌గాంధీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుంది. జూన్ 9న ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఎలా తొక్కారో.. అదే ఊపు, ఉత్సాహం, పట్టుద లతో బీజేపీని తొక్కడానికి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సభకు వచ్చారు. వైబ్రెంట్ తెలంగాణ నినాదాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తాం. మా పాలనను మీ ముందు పెట్టాం మా 100 రోజుల పాలనను మీ ముందు పెట్టాం. మేం మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమ లు చేస్తే, ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించామని అనుకుంటే మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు, అనుమతులు తెచ్చుకోవాలన్నా తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలు గెలవాలి. మోదీ.. గాంధీ కుటుంబం మధ్య పోరాటం.. విదేశాలు తిరుగుతూ గంటకో డ్రెస్ మార్చే మోదీ దేశ ప్రధాని కావాలో.. దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి చుట్టివస్తున్న రాహుల్ గాంధీ కావాలో తేల్చుకోవాలి. రాబోయేవి ఎన్నికలు కావు. పోరాటం. నరేంద్ర మోదీ కుటుంబం, గాంధీ కు టుంబం మధ్య పోరాటం. మోదీ కుటుంబంలో ఈవీఎం, ఈడీ, ఐటీ, సీబీఐ ఉన్నాయి. గాంధీ కుటుంబంలో ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీతోపా టు ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులను త్యాగం చేసిన సోనియాగాంధీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, దేశంలో దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు. నమో అంటే నమ్మితే మోసం.. రాజ్యాంగాన్ని మార్చాలనే మోదీ ప్రయత్నా లను ఆపాలంటే తెలంగాణ రాహుల్ గాంధీ వెంట నడవాలి. అసలు బీజేపీకి ఎందుకు ఓటే యాలి? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోసం చేసినందుకా? రైతులను చంపినందుకా? దేశంలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టినందుకా? హైదరాబాద్‌లో వరదలు వస్తే ఈ సిగ్గులేని కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి అయినా వరద సాయం తెచ్చారా? నమో అంటే నమ్మితే మోసం. 2024 నాటికి ప్రతిపేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని మోదీ చెప్పారు. మరి తెలంగాణలో ఎన్ని ఇళ్లు ఇచ్చా రో బీజేపీ నేతలు లెక్కచెప్పి ఓట్లడగాలి..’’ అని రేవంత్ డిమాండ్ చేశారు. -
అంతిమ విజయం మాదే..: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీటీంగా ఉన్న బీఆర్ఎస్ను ఓడించామని.. లోక్‌సభ ఎన్నికల్లో ఏ టీం బీజేపీని ఓడిస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ దగ్గర ఈడీ, సీబీఐ, సంపద ఉన్నాయని.. తమ దగ్గర నిజాయతీ, ప్రజల ప్రేమ ఉన్నాయని చెప్పారు. అంతిమ విజయం నిజాయతీది, ప్రజల ప్రేమదేనన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని.. న్యాయపత్రం పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు ఐదు గ్యారంటీలు ఆత్మలాంటివని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, ఇప్పటివరకు 20వేల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే మరో 50వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటించారు. తెలంగాణ దేశానికి మోడల్ కావాలని ఆకాంక్షించారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ ఏడాదికి రూ.లక్ష వేతనంతో అప్రెంటిస్‌షిప్ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. నారీ న్యాయ్ పేరుతో ఏటా రూ.లక్షను ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు ఇస్తాం. ఇది విప్లవాత్మక మార్పు. దీనిద్వారా దేశ ముఖచిత్రం మారబోతోంది. కిసాన్ న్యాయ్ పథకం ద్వారా రుణమాఫీ చేస్తాం. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించబోతున్నాం. స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తాం. శ్రామిక్ న్యాయ్ పథకం ద్వారా కార్మికులు, కూలీలకు కనీస వేతనాలు అమలు చేస్తాం. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారితో పాటు ఇతర రంగాల్లోని కారి్మకులకు రోజుకు రూ.400 కనీస వేతనం ఇస్తాం. ఎవరెంతో.. వారికంత.. మేం మరో చరిత్రాత్మకమైన గ్యారంటీ ఇస్తున్నాం. దేశంలో 50శాతం మంది ప్రజలు బలహీనవర్గాలకు చెందినవారే. 15శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, ఆదివాసీలు, 15 శాతం మంది మైనార్టీలు, 5 శాతం మంది పేద అగ్రవర్ణాల ప్రజలున్నారు. 90శాతం వీరే ఉన్నారు. కానీ దేశంలోని ప్రభుత్వ సంస్థలు, పెద్ద కంపెనీల్లో వీరు కనిపించరు. దేశంలోని పెద్ద 200 కంపెనీల యజమానులను చూస్తే ఈ వర్గాలకు చెందిన వారుండరు. దేశాన్ని పాలించే ముఖ్యమైన 90 మంది ఏఐఎస్ అధికారుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు. జనాభా 50శాతం అయితే పాలనలో భాగస్వామ్యం ఐదుగురిదే. ఒక గిరిజనుడు, ముగ్గురు దళితులు ఉన్నారు. ఇక బడ్జెట్ ఖర్చులో వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలకు 6 శాతమే వస్తోంది. మా ప్రభుత్వం వస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్నట్టుగానే.. జనాభా కులగణన చేస్తాం. దేశాన్ని ఎక్స్‌రే చేసి పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తాం. ఆయా వర్గాల ఆర్థిక, వ్యవస్థీకృత సర్వే కూడా చేయించి.. ఎవరి హక్కులు వారికి కల్పిస్తాం. మావి గ్యారంటీలు కాదు.. ప్రజల గొంతుక.. జాతీయ స్థాయి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పుడు ఆవిష్కరించుకున్నాం. మేమిచ్చింది ఐదు గ్యారంటీలు కాదు. అది ప్రజల గొంతుక. తెలంగాణలో అమల్లోకి తెచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి గ్యారంటీలన్నీ ప్రజల గొంతుకలే. తెలంగాణలో హామీలను నిలబెట్టుకున్నాం. దేశంలో భారీగా నిరుద్యోగం ఉన్న సమయంలో తెలంగాణలోని 20వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. 50వేల మందికి త్వరలోనే ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఇక్కడ మాట నిలబెట్టుకున్నట్టుగానే.. జాతీయ స్థాయి మేనిఫెస్టోను అమలు చేస్తాం. కేసీఆర్, మోదీలవి బలవంతపు వసూళ్లు గతంలో తెలంగాణ సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో తెలుసు. వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పోలీసు వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేసి నదిలో పడేశారు. భయపెట్టి, బలవంతం చేసి మీ సంపద దోచుకున్నారు. తెలంగాణలో అదంతా వెలికితీసే పని ప్రారంభమైంది. ఇక్కడ కేసీఆర్ చేసినట్టుగానే ఢిల్లీలోని మోదీ ప్రభుత్వం చేస్తోంది. ఆ పార్టీ పక్షాన ఓ బలవంతపు వసూళ్ల విభాగం (ఎక్స్టార్షన్ డైరెక్టరేట్) పనిచేస్తోంది. దేశంలోని అత్యంత అవినీతిపరులంతా మోదీ వెనుక నిలబడ్డారు. ఎన్నికల కమిషన్‌లో కూడా మోదీ తన మనుషులను పెట్టుకున్నారు. ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఆ బాండ్లను పరిశీలిస్తే వాస్తవాలేంటో తెలుస్తాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం బ్యాంకు ఖాతాలను నిలిపివేశారు. కానీ మేం భయపడేది లేదు. తెలంగాణలో బీజేపీకి బీటీంను ఓడించాం. ఇప్పుడు దేశంలో ఏ టీంను ఓడించబోతున్నాం. మనది కుటుంబ బంధం తెలంగాణ ప్రజలతో నాకున్నది రాజకీయ బంధం కాదు. కుటుంబ బంధం. సోనియాగాంధీ ఎలాగూ మీ వైపే ఉంటారు. ఢిల్లీలో నేను కూడా మీ సిపాయినే. తెలంగాణ ప్రజలు, యువకులు ఎప్పుడు పిలిచినా వస్తాను. చిన్న పిల్లాడు పిలిచినా మీ ముందుంటా. మీ కోసం వస్తా. దేశంలో తెలంగాణ కొత్త రాష్ట్రం. ఈ రాష్ట్రం దేశానికి మార్గం చూపించాలి. మేడిన్ తెలంగాణ.. మేడిన్ చైనాతో తలపడేలా చేద్దాం. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటోంది దేశంలోని పౌరులందరికీ రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ భావిస్తోంది. కానీ మేం ఆ పని చేయనీయం. బీజేపీ హింసను ప్రోత్సహిస్తోంది. మత విద్వేషాలు రేపుతోంది. అదే మా పోరాటం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే. మా విప్లవాత్మక మేనిఫెస్టో దేశ ముఖచిత్రాన్ని మార్చబోతోంది. అది దేశ ఆత్మ. పేదలు, రైతులు, మహిళలు, యువకుల జీవితాలను మార్చగలదు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది. జైహింద్... జై తెలంగాణ’’ అంటూ రాహల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు. -
రైతులను ఆదుకునే దాకా ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్/ సిరిసిల్ల/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/జహీరాబాద్: కరువు పరిస్థితులతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు దీక్షలు’ చేపట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ దీక్షలు నిర్వహించారు. రైతుల ధాన్యంకు ప్రతీ క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని.. అకాల వర్షాలు, వడగండ్లు, ఎండలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.25వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్లలో, మాజీ మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డిలో, జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో, గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూరు క్రాస్‌రోడ్డు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దీక్షల్లో పాల్గొన్నారు. ఇక చెన్నూరులో మాజీ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో రైతు దీక్షకు ఏర్పాట్లు చేయగా.. అనుమతిలేదటూ పోలీసులు టెంట్‌ను తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన దీక్షల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయారు: కేటీఆర్ వరికి రూ.500 బోనస్, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించడానికి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని, తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతుదీక్షలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని, ఇప్పుడు గోస పడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుబంధు అందక, రుణమాఫీ కాక, పంటలు ఎండి రైతులు.. ప్రభుత్వ వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రాక నేతన్నలు, దళితబంధు అందక దళితులు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నాయని పేర్కొన్నారు. సరిగా వర్షాలు పడక కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 300 పిల్లర్లు ఉంటే.. రెండు, మూడు పిల్లర్లలో సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టునే విఫలమంటూ కాంగ్రెస్ యాగీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కేసీఆర్‌ను బద్నాం చేసి, రాజకీయ లబ్ధి పొందేందుకే లక్షల ఎకరాల పంట పొలాలను ఎండబెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు రైతుభరోసా రూ.15వేలు, రూ.4వేల పెన్షన్, రూ.2లక్షల రుణమాఫీ పొందిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలని.. లేకుంటే బీఆర్ఎస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. సర్కారుకు మిషన్ భగీరథ నిర్వహించడం చేతగాక.. తాగునీటి కొరత వచ్చిందని ఆరోపించారు. తమ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను కాంగ్రెస్ సర్కారు ఇచ్చినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక బీజేపీ నేతలు రుణమాఫీ గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని విమర్శించారు. రైతులకు కన్నీళ్లే మిగిలాయి: హరీశ్‌రావు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మందికిపైగా రైతులు చనిపోయారని.. మంత్రులు కనీస పరామర్శకు రావడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో, జహీరాబాద్‌లో జరిగిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేక రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పిందని, కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ పా ర్టీకి.. తుక్కుగూడ సభలో మేనిఫెస్టోను ప్రకటించే నైతికత ఎక్కడిదని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు బోనస్, కౌలురైతులకు రూ.15 వేల ఆర్థిక సాయం వంటి హామీల అమలు ఏదని నిలదీశారు. రైతుబంధు డబ్బు జమ కాలేదనే వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారని.. చెప్పులతో కొట్టించుకునేందుకే ప్రజ లు కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరెంట్, కాలువల్లో నీళ్లున్నాయని.. కాంగ్రెస్ రాగానే ఏమైపోయాయని హరీశ్‌రావు నిలదీశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 నగదు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ నేత లు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తే చీపురు మడతపెట్టి తరమాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకునేందుకు మంత్రి ఉత్తమ్‌కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు కేసీఆర్ జిల్లాల పర్యటన చేపడితేనే.. రాష్ట్ర బీజేపీ నేతలు కళ్లు తెరిచి, దీక్షలు చేపట్టారని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. -
టిఫిన్‌పే చర్చ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకులు, కార్యకర్తల టిఫిన్ బైఠక్‌లు శనివారం ఉత్సాహంగా సాగాయి. పార్టీ సంస్థాపక దినోత్సవం సందర్భంగా.. శనివారం ఉదయం పోలింగ్‌బూత్ స్థాయిల్లో నాయకులు, కార్యకర్తలు కలుసుకుని అల్పాహారం తింటూ పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ముఖ్యనేతలు, పోలింగ్‌బూత్ కమిటీల అధ్య క్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా ఆవిష్క రణ కార్యక్రమం, శక్తికేంద్రాల్లో (నాలుగైదు పోలింగ్ బూత్ లు కలిపి ఒకటి) సమావేశాల నిర్వహణతో పాటు 44 ఏళ్లలో పార్టీ చరిత్ర, వికాసం, పరిణామక్రమంపై చర్చ చేపట్టారు. ఇక పార్టీ కోసం పనిచేసిన, చేస్తున్న సీనియర్లను సన్మానించారు. ఆయా పోలింగ్ బూత్‌లో పార్టీ బలాబలాలు, వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, తదితర అంశాలపై చ ర్చించారు. ఈ సందర్భంగా... ఫిర్ ఏక్‌బార్ నరేంద్ర మోదీ సర్కార్ అంటూ నినదించారు. దేశ వ్యాప్తంగా 370 సీట్ల సా ధన, అందులో భాగంగా ప్రతి పోలింగ్ బూత్‌లో అదనంగా 370 ఓట్ల సాధన, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతీ బూత్‌లో 50 శాతం ఓట్లు పడేలా కృషి చేస్తామంటూ పార్టీనా యకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకున్నారు. సికింద్రాబా ద్ నియోజకవర్గం కాచిగూడలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో సునీల్ బన్సల్ దిశానిర్దేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ సునీల్‌బన్సల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధా నకార్యదర్శలు చంద్రశేఖర్ తివారి (సంస్థాపక) తదితర నా యకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గుజ్జుల ప్రే మేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో శనివారం ఐదువేల చోట్ల బీజేపీ టిఫిన్ బైఠక్‌లు జరిగాయి. ఈ నెల 15 నుంచి 18 వరకు అసెంబ్లీ స్థాయిలో జరిగే సమావేశాలు.. 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు సంబంధించిన అంశాలపై ఆయా బైఠక్‌లలో చర్చించామని తెలిపారు. -
త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పొగరు కారణంగానే గత ఎన్ని కలకు ముందు 104 మందితో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇటీవలి ఎన్నికల తర్వాత 39కి తగ్గిందని సాగు నీరు, పౌరసరఫరాల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమ ర్శించారు. ఇప్పుడు అందులోనూ 25 మంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని జోస్యం చెప్పారు. శనివా రం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లతో కలసి ఉత్తమ్ మాట్లాడారు. కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ అన్నీ అబద్ధాలు మాట్లాడారని, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఎవరినో తొక్కడం కాదని, లోక్‌సభ ఎన్నికల్లో జనమే కేసీ ఆర్‌ను బొంద పెడతారని వ్యాఖ్యానించారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఇంట్లో పడుకున్న కేసీఆర్ ఇప్పుడు నైరాశ్యంలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమను బ్రోకర్, జోకర్ అంటున్న కేసీఆర్ లాగా తాము పాస్‌పోర్టులు అమ్ముకొని బ్రోకర్లుగా పనిచేయ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ లాంటి పొగరుబోతు వ్యక్తి ని తానెప్పుడూ చూడలేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వేరే దేశాల్లో అయితే ఉరి తీస్తారన్నారు. కరువు తెచ్చింది కేసీఆరే.. కేసీఆర్ సాగునీటి రంగాన్ని పదేళ్లపాటు సర్వనాశనం చేశా రని, ఆయన కమీషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టు కొచ్చిందని ఉత్తమ్ ఆరోపించారు. కరువును తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, కేసీఆరేనని, ఆయన మాటలు ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాగు, సాగునీటి అవసరాల కోసం కేసీఆర్ మొహం చూసి తాము నీళ్లు విడుదల చేయట్లేదని, షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి సమస్య రాకుండా చూసుకుంటామని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ను పాతిపెట్టాలి: జూపల్లి కేసీఆర్ చవట, దద్దమ్మ కాబట్టే ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన రూ. 8 లక్షల కోట్ల భారం మోపా రని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాంతీయుడు అన్యాయం చేస్తే ప్రాంతంలోనే పాతిపెట్టా లన్న కాళోజీ అన్నట్టు కేసీఆర్‌ను పాతిపెట్టాలని వ్యాఖ్యానించారు. ఆయన అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడైనా పంట నష్టం పరిహారం రైతులకు ఇచ్చారా అని ప్రశ్నించారు. నాలుగు మాసాల తమ పాలన చూసే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా ఒక్క లోక్‌సభ స్థానం కూడా రాదని అన్నారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని తాము ధైర్యంగా చెబుతున్నామని, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని రద్దు చేసుకుంటానని చెప్పే ధైర్యం కేసీఆర్‌కు ఉందా అని సవాల్ విసిరారు. తల ఎక్కడ పెట్టుకుంటావ్... కేసీఆర్: పొన్నం మిషన్ కాకతీయ పేరుతో రూ. 40 వేల కోట్లు పెట్టి కేసీఆర్ చెరువుల్లో పూడికలు తీయిస్తే భూగర్భంలో ఉన్న నీళ్లు ఏమ య్యాయని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయానన్న అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఉపయోగించిన భాషతోనే తాము కౌంటర్ ఇస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. తాము రేపటి నుంచి ఫీల్డ్‌లోనే ఉంటామని, ఎవరు ఎవరిని తొక్కుతారో చూద్దామని సవాల్ చేశారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో.. రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ కొత్తగా మ్యానిఫెస్టో విడుదల చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఆరు గ్యారంటీ ల అమలుపై చర్చించడానికి రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘దేశంలో ఉన్న ప్రతి మహిలకు లక్ష రూపాయల భృతి ఇస్తామని అంటున్నారు. తెలంగాణ లో ఇస్తామని చెప్పిన నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది ? ఉట్టికి ఎగరనివాడు ఆకాశానికి ఎగిరినట్లు ఉంది. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇస్తామని చెప్పిన రైతు రుణ మాఫీ ఏమైంది ? రుణమాఫీ చేయకుండా.. గిట్టుబాటు ధర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి.. ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తాం -
రైతు బంధు కోసం పెట్టిన రూ. 7 వేల కోట్లు ఏమయ్యాయి: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉన్న తమ నేత కేసీఆర్.. ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగితే.. సీఎం రేవంత్ ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం దున్నపోతుతో సమానమని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన నాలుగు నెలల్లోనే వ్యవసాయం సంక్షోభం వస్తుందని ఊహించలేదని.. ఇలాంటి దుస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి సర్కారే అని మండిపడ్డారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుదీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు కోసం రూ. 7 వేల కోట్లు సిద్ధంగా పెట్టామని అయితే రైతుబంధు ఇవ్వొద్దంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆపిందని గుర్తు చేశారు. రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసీకి రేవంత్ లేఖ రాయాలి రైతులకు 500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని సీఎం, మంత్రులు చెబుతున్నారని.. పాలన తన చేతుల్లో లేదని సీఎం రేవంత్ అనడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పంటలకు బోనస్ ఇస్తామని ఈసీకి రేవంత్ లేఖ రాయాలని అన్నారు. ఇందుకు తాము కూడా మద్దతిస్తామన్నారు. చదవండి: నేడు కాంగ్రెస్ జనజాతర సభ.. తుక్కుగూడ నుంచే సమర శంఖం కాంగ్రెస్ తెచ్చిన కరువు కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గం. అందుకే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావరి నీళ్లు ఎత్తిపోశాం. ఇవాళ కూడా గోదావరిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయ్. ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తళ్లు దూకినాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువని అన్నారు. కేసీఆర్ వస్తున్నారని నీళ్లు వదిలారు ‘300 పిల్లర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగాయి. కేసీఆర్‌ను బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. యూట్యూబ్‌లో వచ్చే తప్పుడు వార్తలు చూసి ఆగం కావొద్దు. కేసీఆర్ వస్తున్నారని అన్నారం, సుందిళ్ల నీళ్లు వదిలారు. హరీశ్‌రావు హెచ్చరిస్తే కూడవెళ్లి వాగుకు నీళ్లు ఇచ్చారు. ఇన్నాళ్లు నీళ్లు ఉన్నా కూడా ఇవ్వలేదని అర్థమైంది కదా.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. రైతుబంధు రూ. 15 వేలు ఇస్తామని మోసం చేసింది. రూ. వరికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని ఇవ్వడం లేదు. ఎర్రటి ఎండల్లో కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చారు. రైతుల హక్కుల తరుపున కొట్లడుదాం. రేపటి నుంచి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్‌పై కాంగ్రెస్ పార్టీని నిలదీద్దాం. మిషన్ భగీరథ అప్పగించినా నీళ్లిచ్చే తెలివి కాంగ్రెస్‌కు లేదు. వండిన అన్నం వడ్డించే తెలివి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు వివరించాలి.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
Tukkuguda: ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్షవేస్తాం: రాహుల్ గాంధీ
తుక్కుగూడ జన జాతర సభ.. రాహుల్ గాంధీ ప్రసంగం ముఖ్యాంశాలు కొన్ని రోజుల కిందటే ఇక్కడే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశా కొన్ని నెలల క్రితం తెలంగాణకు చేసిన వాగ్ధానం గుర్తుంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లు దేశంలోనూ మాట నిలబెట్టుకుంటాం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు న్యాయసూత్రాలు భారతీయుల ఆత్మ యువతకు శిక్షణా కార్యక్రమాలు పెట్టబోతున్నాం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టాం మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలు నిరుపేదలయ్యారు తెలంగాణలో 30 వేల ఉద్యోగాలిచ్చాం మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం రూ.500కు గ్యాస్ ఇచ్చాం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చాం దేశ ప్రజల మనసులోని మాటే మా మేనిఫెస్టో నారీ న్యాయ్ కింద ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష వేస్తాం .. నారీ న్యాయ్‌తో దేశ ముఖ చిత్రం మారబోతోంది ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష నగదు జమ చేస్తాం పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తాం దేశంలో నిత్యం 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేం అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం ధనవంతులకు మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు రైతులకు మాత్రం మోదీ రూపాయి కూడా మాఫీ చేయలేదు స్వామినాథన్ ఫార్ములా ప్రకారం రైతులకు మద్దతు ధర ఇస్తాం దేశంలో 50 శాతం మంది వెనుకబడిన వర్గాలే బడుగుల జానాభా 50 శాతం ఉంటే 5 శాతం ఉన్నవారి దగ్గరే అధికారం ఉంది కార్మికులకు కనీస వేతనాలు కల్పిస్తాం కేసీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించారు... గతంలో ఉన్న సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో మీకు తెలుసు వేల మంది ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించాడు ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశాడు రాత్రి పూట ఫోన్ చేసి డబ్బులు వసూలు చేశారు ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పని మొదలు పెట్టింది.. నిజం మీ ముందుంది కేసీఆర్ ఏం చేశారో మోదీరు అదే చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఏం చేశారో ఢిల్లీలో మోదీ అదే చేస్తున్నారు తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడించాం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్ ఈడీ ఎక్స్టార్షన్ డైరెక్టరేట్‌గా మారింది ఒక రోజు సీబీఐ ఒక కంపెనీకి ఝలక్ ఇస్తుంది అదే కంపెనీ మరుసటి రోజు ఎన్నికల బాండ్లు కొంటుంది బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర ప్రేముంది.. బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర మీ ప్రేముంది బీజేపీ అనే అతిపెద్ద వాషింగ్‌మెషిన్ నడుస్తోంది బీజేపీకి డబ్బు ఇచ్చిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది మేము రాజ్యాంగాన్ని రద్దు చేయం మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం మా మేనిఫెస్టో దేశ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు రైతులు, వెనుకబడిన వారికి మరో 5 హామీలు ఇచ్చాం ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది: సీఎం రేవంత్‌రెడ్డి జాతికి 5 గ్యారెంటీలను రాహుల్ అంకితం చేశారు జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేయడం సంతోషం బీఆర్ఎస్ను ఓడించినట్లే దేశంలో బీజేపీని ఓడించాలి గత ప్రభుత్వం కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు బీఆర్ఎస్ను తుక్కుతక్కుగా ఓడించిన ఉత్సాహం తుక్కుగూడలో కనిపిస్తోంది ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది ఉద్యోగాలివ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం పదేళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసింది పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలి కేసీఆర్‌కు చర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా .. రేవంత్ మాజీ ముఖ్యమంత్రి భాష సరిగా లేదు పదేళ్ల పాలనలో తెలంగాణను పీడించారు కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు లుంగీ లాగి చర్లపల్లిలతో చిప్పకూడు తినిపిస్తా కేసీఆర్‌కు జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలులో ఉండొచ్చు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు నేను జానారెడ్డిని కాదు.. ఊరుకోవడానికి పదేళ్లలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎన్ని పదేళ్లలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత నాది మేం హామీలు నెరవేరిస్తే 14 లోక్‌సభ సీట్లు గెలిపించండి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలంటే 14 మంది ఎంపీలను గెలిపించాలి కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రాహుల్‌గాంధీ తుక్కుగూడ జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆవిష్కరించిన రాహుల్ తెలంగాణకు సంబంధించి మేనిఫెస్టోలో 23 అంశాలు న్యాయపత్రం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో 5 గ్యారెంటీల పత్రం పేరుతో మేనిఫెస్టో విడుదల భట్టి విక్రమార్క కామెంట్స్.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ప్రకటించాం కేసీఆర్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నాం 200 యూనిట్ల విద్యుత్ జీరో బిల్లులిస్తున్నాం జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌గాంధీ తుక్కుగూడ జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌గాంధీ రాహుల్‌గాంధీ వెంట పలువురు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్‌గాంధీ కేసీఆర్ మాట, యాస అదుపులో ఉంచుకుని మాట్లాడాలి : మంత్రి పొన్నం పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఎలా మాట్లాడాలో తెలియడం లేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌గాంధీ కాసేపట్లో తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభ సభ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ ఘనస్వాగతం పలికిన సీఎం రేవంత్, భట్టి, దీపాదాస్ మున్షీ జాతీయ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్‌గాంధీ తెలంగాణకు ఇచ్చే హామీలు వివరించనున్న రాహుల్ మళ్లీ సమర శంఖం కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణకు ప్రత్యేక హామీలు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది. చేరికలపై గోప్యత జన జాతర సభ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్ హోటల్లో రాహుల్ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్‌గౌడ్, మాణిక్‌రావు, డి.సు«దీర్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. శంషాబాద్ నుంచి నోవాటెల్‌కు.. తర్వాత సభకు.. రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. -
కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే..
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు కోసం కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం గణేష్ పేరును ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కాగా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం శ్రీగణేష్ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, శ్రీగణేష్ ఇటీవలే బీజేపీని వీడి హస్తం గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీగణేష్ రెండో స్థానంలో నిలిచారు. ఇక, బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి లాస్య నందిత విజయం సాధించారు. కాగా, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మృతిచెందడంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరుగనుంది. ఇక, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అదే రోజున జరుగనుంది. పేరు కంటోన్మెంట్ జిల్లా హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య 250,733 పురుషులు 124,245 మహిళలు 122,315 నవంబర్ 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేష్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాంగ్రెస్ హామీ స్వాగతించదగినది, కానీ..: కేటీఆర్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జంపింగ్ నేతలు పార్టీలు మారుతుండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక, కొన్ని పార్టీలు కూడా జంపింగ్ నేతలకే టికెట్ ఇవ్వడంతో పొలిటికల్‌గా అసలు కథ మొదలైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. కానీ, ఇప్పుడు మేనిఫెస్టో ద్వారా ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని తెలిపారు. Congress party, which is the mothership that promoted the “Aaya Ram, Gaya Ram” culture of political defections in India seems to have had a Big change of heart Welcome their noble proposal of on amending 10th schedule to ensure automatic disqualification of MLAs/MPs if they… pic.twitter.com/gKzhERg1bK — KTR (@KTRBRS) April 6, 2024 పదో షెడ్యూల్ చట్ట సవరణ స్వాగతించదగినది. కానీ, కాంగ్రెస్ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా వారి విధానాలు ఉంటాయి. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ చేర్చుకుంది. అందులో ఒక ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఇచ్చింది. హామీలపై నిబద్ధత ఉంటే ఈ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడాలి. వారి పార్టీలో చేరిన ఇద్దరితో రాజీనామా చేయించాలి. అనర్హులని స్పీకర్ ప్రకటించాలి. చెప్పిందే చేస్తాం.. అబద్ధాలు చెప్పబోమని కాంగ్రెస్ నిరూపించుకోవాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
తెలంగాణలో అసలు ఆట మొదలైంది: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఆట మొదలైందన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగుకాబోతుందన్నారు. అలాగే, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడీలు చేస్తోందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాగా, కిషన్‌రెడ్డి బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించబోతుంది. ఫిర్ ఏక్ మోదీ సర్కార్ అని ప్రజలు నినదిస్తున్నారు. మోదీ విశ్వనేతగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కానుంది. కాంగ్రెస్ ఇంతకంటే ఎదగలేదు. తెలంగాణలో అసలు ఆట మొదలైంది. రాష్ట్రంలో బీజేపీని ఏమీ చేయలేరు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నేతలు గారడీలు చేస్తున్నారు. గ్యారంటీల అమలు మీద సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి లేదు కానీ.. పార్టీ ఫిరాయింపుల మీదే ఆయన ఫోకస్ పెట్టారు. తెలంగాణలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం. ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నాం. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేశాం. ట్రిపుల్ తలాక్ రద్దుచేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచాం. బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
నేడు బీజేపీ టిఫిన్ బాక్స్ బైఠక్‌లు
సాక్షి, హైదరాబాద్: శనివారం బీజేపీ 44వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ‘టిఫిన్ బాక్స్ బైఠక్’ల నిర్వహణకు పార్టీ సిద్ధమౌతోంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి మొదలు అన్ని స్థాయిల నేతలు, కార్య కర్తలు తమ తమ ఓటున్న సొంత పోలింగ్ బూత్ కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలు, పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీ పతాకాలను ఆవిష్కరించనున్నా రు. కాగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలోని పోలింగ్ బూత్ కేంద్రాలకు ఎవరి అల్పాహారం (టిఫిన్) వారు తెచ్చుకుని, అక్కడే తింటూ ఉదయ ం నుంచి మ«ధ్యాహ్నం వరకు భేటీలు నిర్వహించను న్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీపరంగా సన్నద్ధ తపై, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ కేడర్ మధ్య మెరుగైన సమన్వయ సాధన, కార్యాచరణ రూప కల్పనకు ఈ భేటీలు దోహదపడతాయని నేతలు చెబుతున్నారు. మూడు లక్ష్యాల సాధనకు సంకల్పం ఒక్కో పోలింగ్ బూత్‌లోని మూడు, నాలుగు పోలింగ్ స్టేషన్లలో ఆయా సామాజికవర్గాల ఓట్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారికి సంబంధించి సమాచారం, ఇతర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువత, మహిళలు, రైతులు ఇలా వివిధ వర్గాల ఓటర్లను ఏవిధంగా చేరుకోవాలి, దళిత బస్తీలు, గిరిజన తండాల్లో ఎలాంటి ప్రచారాన్ని నిర్వహించాలన్న దానిపై అభిప్రాయ సేకరణ జరపను న్నారు. ఫిర్ ఏక్‌బార్ నరేంద్ర మోదీ సర్కార్ కోసం 370 సీట్ల సాధన, ప్రతి పోలింగ్ బూత్‌లో అదనంగా 370 ఓట్ల సాధన, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి బూత్‌లో 50 ఓట్ల సాధనకు ఈ సందర్భంగా సంకల్పం తీసుకోనున్నారు. కాచిగూడలో కిషన్‌రెడ్డి.. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ శనివారం ఉదయం అంబర్‌పేట నియోజ కవర్గం కాచిగూడలోని 214 పోలింగ్ స్టేషన్లో కిషన్‌రెడ్డి టిఫిన్ బాక్స్ బైఠక్‌లో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి అభయ్‌పాటిల్ సికింద్రాబాద్ అసెంబ్లీలోని మెట్టుగూడ 33–35 పోలింగ్ స్టేషన్లలో, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నారాయణపేట అసెంబ్లీ కోయిల్‌కొండలోని 23–27 పోలింగ్ స్టేషన్లలో పాల్గొంటారు. ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్‌లోని సాధనా స్కూల్ 174వ పోలింగ్ స్టేషన్లో, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజక వర్గం చిక్కడపల్లిలోని 9వ పోలింగ్స్టేషన్లో, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ మల్కాజిగిరిలోని వినాయక్‌నగర్ 155–157 పోలింగ్స్టేషన్లలో, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ అసెంబ్లీలోని గాజులపేట 192 పోలింగ్ స్టేషన్లో, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి మహేశ్వరం అసెంబ్లీలోని నాదర్గుల్, బడంగ్‌పేట పోలింగ్ స్టేషన్లలో పాల్గొంటారు. -
తుక్కుగూడ నుంచే సమర శంఖం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పారీ్టలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణకు ప్రత్యేక హామీలు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది. చేరికలపై గోప్యత జన జాతర సభ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్ హోటల్లో రాహుల్ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్‌గౌడ్, మాణిక్‌రావు, డి.సు«దీర్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. శంషాబాద్ నుంచి నోవాటెల్‌కు.. తర్వాత సభకు.. రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. -
‘పాలమూరు’కు జాతీయ హోదా!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయనుంది. ఈ మేరకు శనివారం తుక్కుగూడ జన జాతర సభలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చే 23 ప్రత్యేక హామీలను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. మంత్రి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ ఖరారు చేసిన ఈ ప్రత్యేక హామీలను సీఎం రేవంత్‌రెడ్డి తుక్కుగూడ సభ వేదికపై ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ఇవ్వనున్న ప్రత్యేక హామీలివే..! 1) ఐటీఐఆర్ ఏర్పాటు 2) ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం.. కాజీపేట్ రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్–వి జయవాడ హైవేలో ర్యాపిడ్ రైల్వే సిస్టం, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు. 3) భద్రాచలం సమీపంలోని ఏటపాక, గుండాల, పురుషో త్తమ పట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలు తిరిగి తెలంగాణలో విలీనం. 4) పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా. 5) హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం 6) కొత్త విమానాశ్రయాల నిర్మాణం 7) రామగుండం, మణుగూరు రైల్వేలైన్ 8) కొత్తగా నాలుగు సైనిక్ స్కూళ్ల ఏర్పాటు 9) కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పెంపు 10) నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు 11) నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు 12) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఏఎస్ఈఆర్) 13) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ఫారిన్ ట్రేడ్ 14) నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ 15) ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) క్యాంపస్ 16) అధునాతన వైద్య ఆరోగ్య పరిశోధనా కేంద్రం 17) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయింపు 18) ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ యూనిట్ 19) ఐదు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం (హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్–నల్లగొండ–మిర్యాలగూడ, సింగరేణి పారిశ్రామిక కారిడార్) 20) అంతర్జాతీయ స్థాయి కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ 21) మేడారం జాతరకు జాతీయ హోద 22) న్యూ డ్రైపోర్టు ఏర్పాటు 23) హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు -
కేసీఆర్‌కు అరెస్టు భయం.. అందుకే యాత్రలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు భయంతో ప్రజల్లో సానుభూతి కోసమే కేసీఆర్ రాజకీయ యాత్రలు చేస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ కేసులో సంబంధిత చట్టం ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజాప్రాతి నిథ్య చట్టం ప్రకారం, వరుసగా రెండేళ్లు జైలు శిక్ష పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే వీలుండదని, ఇక కేసీఆర్ రాజకీయాలు వదిలేస్తే మంచిదని సూచించారు. అరెస్టు భయంతోనే ఇప్పుడు కేసీఆర్ యాత్రలు చేస్తున్నారే తప్పించి ఏనాడూ ప్రజల గురించి చిత్తశుద్ధితో పనిచేయలేదని గుర్తు చేశారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలపై తాను కేసీఆర్‌ను నిలదీస్తే, కేసీఆర్ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనకు వారిలా బూర్చుఖలీఫాలో ఇల్లు లేదనీ, ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని వెల్లడించారు. ‘నాకు కంపెనీ ఉంటే నిరూపించాలని, గాలిమా టలతో తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదు. నీలా తప్పులు చేసే వ్యక్తిని కాదు, నా గురించి మాట్లాడేముందు ఓసారి ఆలోచించుకుని మాట్లాడాలి’ అని సూచించారు. వర్షాభావం కాంగ్రెస్ వైఫల్యమా: పొంగులేటి వర్షాభావ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపేందుకు కేసీఆర్ శతవి ధాలా ప్రయత్నిస్తున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తొమ్మిదిన్న రేళ్లు సీఎంగా ఉండి, తన హయాంలో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే ఏనాడూ పంటపొ లాలకు వెళ్లి రైతులను పరామర్శించని కేసీఆర్‌కు అధికారం పోగానే రైతులు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ వరకు వచ్చిన కేసీఆర్, పక్కనే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని దెబ్బతిన్న పిల్లర్లను కూడా సందర్శించి ఉంటే బాగుండేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, ఏం చేశారని మీటింగ్‌లు పెట్టి ఓట్లు అడుగుతారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయి? ఇప్పుడు వాటి కి కాంగ్రెస్ ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది’అని విమర్శించారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత తాడూరి శ్రీనివాస్‌తో పాటు ఉప్పల్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్త లు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంరావాలని, అప్పుడే హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా చెబుతున్నారన్నారు. ‘రాహుల్ ప్రధాని కాలేరు, కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయలేదు’అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కరెంటు కోతలున్నాయని, బీజీపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా కరెంటు కోతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, పార్టీ అధికార ప్రతి నిధి ఎన్.వి.సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనం ఏమైంది?
గజ్వేల్/పాపన్నపేట: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలకు మోసం జరిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయు లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు వేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మాట నిలుపుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ రాకముందే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కావాల్సినంత సమయమున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. మార్చి 31న పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు అందాల్సిన డబ్బులను బాండ్ల రూపంలో ఇస్తారని లీకులు వస్తున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ఉనికే లేదని.. కేవలం రాముడిని చూపుతూ ఆ పార్టీ ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు. వీడియోలతో విమర్శనాస్త్రాలు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగు తోంది. శుక్రవారం పాపన్నపేట మండలం కొత్తపల్లి లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వీడి యో క్లిప్పింగ్‌లు ప్రదర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్‌లను చూపుతూ.. ఇవి అమలు అయ్యాయా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. -
మేనిఫెస్టో పేరిట ఎన్నాళ్లు మోసం?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో మేని ఫెస్టోల పేరిట ప్రజలను మోసం చేయొద్దని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడం, ఆ తర్వాత విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. పార్టీని మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తెస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్ప దమని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీని ఉద్దేశించి శుక్రవారం హరీశ్‌రావు లేఖ రాశారు. ‘ఉమ్మడి ఏపీలో 2004, 2009 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినా అమలు చేయలేదు. అదే తరహాలో గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనేక హామీలు ఇచ్చి విస్మరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అనేకమార్లు మాట తప్పి ఏ ధైర్యంతో మేనిఫెస్టో విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్ని సార్లైనా మోసం చేయొచ్చనే మీ ధైర్యానికి.. ‘రాజ్యాంగ పరిరక్షణ చాప్టర్ లోని 13వ పాయింట్ కింద ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ మారితే, ఆ వెంటనే సభ్యత్వం పోయేలా చట్టం చేస్తామని తాజా మేనిఫెస్టోలో హామీనిచ్చారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని వారికే ఎంపీ టికెట్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో చెప్పిన నీతులకు, అధికారంలో ఉండి చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతన లేదు. ప్రజలను ఎన్నిసార్లైనా మోసం చేసి గెలవవచ్చు అనే మీ మొండి ధైర్యానికి ఆశ్చర్యం కలుగుతోంది’ అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓట్లేశారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే సందర్భంగా కూడా ఆరు హామీలకు చట్టబద్ధత కల్పించే పత్రంపై మీ సంతకాలు చేసినా ఆ హామీలేవీ రాష్ట్రంలో అమలు కావడం లేదు’ అని ఆరోపించారు. మీకు కొత్తహామీలిచ్చే హక్కు లేదు ‘మహాలక్ష్మి పేరుతో కాంగ్రెస్ పార్టీ మహిళలకు మహా మోసం తలపెట్టింది. రైతులను దగా చేసి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నట్టేట ముంచింది. రూ.2లక్షల రుణమాఫీపై తుక్కుగూడ సభలో స్పష్టమైన ప్రకటన చేయాలని రైతుల పక్షాన కోరుతున్నాను. ఎకరాకు రూ.15వేల రైతుబంధు సాయం అందక రైతులు ఇబ్బందులు పడుతు న్నారు. క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామనే బోగస్ మాటలతో మీ పార్టీ తమాషా చేస్తోంది. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇలా ప్రతీ హామీ బూటకమని తేలింది. మీ పార్టీ అధికారంలోకి వంద రోజుల్లోనే 210 మంది రైతులు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మళ్ళీ కష్టాలు మొదలుకావడానికి కారకులైన మీరు, మీ పార్టీ క్షమాపణలు చెప్పాలి. హామీల అమలులో శ్రద్ధ లేని మీకు మళ్ళీ కొత్త హామీలను ఇచ్చే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేయాలనుకునే మీ ఎత్తుగడలు ఇక ముందు సాగవు’ అని హరీశ్‌రావు తన లేఖలో హెచ్చరించారు. -
మళ్లీ పాత తెలంగాణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే సామర్థ్యం, శక్తి లేవు. అందుకే రాష్ట్రంలో వనరులున్నా నీటికి, కరెంటుకు కొరత ఏర్పడుతోంది. కాంగ్రెస్ ఇందిరమ్మ పాలనలో పాత తెలంగాణ పునరావృతమైంది. రాష్ట్రంలో మంచినీళ్ల గోసలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు.. అవే దృశ్యాలు తిరిగి కనిపిస్తున్నాయి. లత్కోర్, అసమర్థుల రాజ్యంలో ఉన్నాం కాబట్టే, కరెంట్, మిషన్ భగీరథ నడిపే తెలివిలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, వృద్ధాప్య పింఛన్, ఓవర్సీస్ స్కాలర్షిప్, చేనేతల బకాయిలు, బ్రాహ్మణ పరిషత్, గొర్రెల పంపిణీ వంటి పథకాలకు నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీల అమలు కోసం వెంటపడతాం. ఆయా పథకాల లబ్ధిదారులు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి కర్చు కాల్చి వాతపెట్టాలి. రైతుబంధుకు నిధులు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా తమ తాబేదార్లకు బిల్లులు విడుదల చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి అసలేమీ తెలియదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇంతకాలం కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని ఆగాం. కానీ ఇక ఆగేది లేదు..’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ‘పొలం బాట’ చేపట్టిన కేసీఆర్.. శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పంటలు, ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధారణం కంటే అధిక వర్షం కురిసినా.. ‘మానేరు వాగు, వరద కాలువ, ఎల్లంపల్లి, గోదావరి నదులు.. నాలుగు సజీవ జలధారలను జిల్లా ప్రజలు అనుభవించారు. కరీంనగర్ లక్షల టన్నుల ధాన్యం పండించింది. అలాంటిదాన్ని నాలుగు నెలల్లోనే ఎడారిగా మార్చారు. కరీంనగర్, సిద్దిపేట ప్రజల దాహార్తి తీర్చిన ఎల్ఎండీలో నీటి కటకట. ఎడారిని తలపిస్తూ స్మశానంలా మారింది. రోజూ తాగునీరు వచ్చే కరీంనగర్లో ఇపుడు రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. గోదావరి బేసిన్లో ఉన్న కరీంనగర్, ఇతర జిల్లాలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తెలంగాణలో ఇపుడు పంట ఎండని, మోటార్లు కాలని జిల్లాలు లేవు. ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి వాస్తవానికి ఈసారి తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసింది. నీటిని నిల్వ చేసుకునే, వాడుకునే తెలివిలేక, నాణ్యమైన కరెంటు సరఫరా చేయక పోవడం వల్ల పంటలు ఎండినయ్. ఎండిన పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. మరోవైపు రైతుబంధు ఇప్పటికీ పూర్తిగా వేయలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారంటే సీఎం లిస్టు ఇమ్మన్నాడు. మేం 209 మంది వివరాలు సీఎస్‌కు పంపాం. కానీ ఇప్పటికీ ఉలుకు పలుకూ లేదు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి, పరామర్శించే దాకా వదలం..’ అని కేసీఆర్ అన్నారు. నేను వస్తున్నా అనగానే నీళ్లిస్తున్నారు.. ‘తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ తీరే కారణం. నేను నల్లగొండకు వెళ్తున్నా అనగానే.. సాగర్ నుంచి, కరీంనగర్‌కి వస్తున్నా అనగానే.. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నారు. అదేంటి అంటే కేసీఆర్ మాకు చెప్పలేదు అంటున్నారు.. సీఎం నువ్వా? నేనా? సీఎంగా నువ్వు, నీ యంత్రాంగం ఏం చేస్తున్నాయి? ఒక 25 రోజుల ముందు నీళ్లు ఇచ్చి ఉంటే.. నల్లగొండ, కరీంనగర్లో పంటలు ఎండేవి కావు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? బ్యాంకర్ల నుంచి రైతులకు నోటీసులు వస్తుంటే ఉలుకూ పలుకూ లేదెందుకు?..’ అని మాజీ సీఎం నిలదీశారు. సీఎంకు తులం బంగారం దొరకడం లేదా? ‘కేవలం నాలుగు నెలల్లో పథకాలను ఆగమాగం చేశారు. గొర్రెల పంపిణీ బంద్ అయింది. 1.30 లక్షల మందికి దళితబందు రెండో విడత నిలిపివేశారు. రూ.12 లక్షలిస్తామని చెప్పి ఇవ్వలే. కళ్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం ఇస్తామన్నారు.. తులం బంగారం సీఎంకు దొరకడం లేదా? ఇంట్లో ఇద్దరికీ వద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పి 30 లక్షల మంది కుటుంబాలకు ప్రతి పింఛన్ మీద రూ.24,000 చొప్పున బకాయి పడ్డారు. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని మోసం చేశారు, మహాలక్ష్మీ లేదు మన్నూ లేదు. ప్రతి మహిళకు రూ.2 వేలిస్తామని శఠగోపం పెట్టారు..’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతలు పులులై తరిమి కొడతరు ‘ఒకప్పుడు సిరిసిల్లలో చేనేత కారి్మకుల ఆత్మహత్యలు చూసి చలించిన నేను భిక్షాటన చేసి వారి కుటుంబాలను ఆదుకున్నా. తెలంగాణ వచ్చాక చేనేతలకు చేతినిండా పని కలి్పంచాం. రంజాన్, బతుకమ్మ, స్కూలు యూనిఫామ్‌లు అంటూ పని ఇచ్చాం. వారు కష్టం చేసి ప్రభుత్వానికే పంపారు. వీటికి సంబంధించిన బకాయిలు రూ.300 కోట్లు ఇస్తలేరు. ఈ విçషయంపై కోర్టుకు పోతాం. సిరిసిల్లలో ధర్నా చేస్తాం. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి అంటాడా? చేనేత కారి్మకులు నిరో«ద్లు అమ్ముకోవాలని అంటారా? చేనేతలు పులులై తరిమి కొడతరు..’ అని బీఆర్ఎస్ అధినేత హెచ్చరించారు. మేం వ్యవసాయానికి ఊపిరిలూదాం ‘మేం అస్తవ్యస్తమైన తెలంగాణ రైతు ఆర్థిక స్థితిని తిరిగి గాడిన పెట్టాం. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి వలస వెళ్లిన రైతులను తిరిగి గ్రామాలకు వచ్చేలా చేసి వ్యవసాయానికి ఊపిరిలూదాం. మీరు తాబేదార్లకు బిల్లులు చెల్లించి రైతుల నోట్ల మట్టి కొట్టారు. ఇపుడు చాలామంది రైతుల అప్పుల పాలై వడ్డీలు కడుతున్నారు. మేము తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 7,600 మెగావాట్ల నుంచి 18,600 మెగావాట్లకు తీసుకుపోయినా ఎందుకు కొరత వస్తోంది? దీనికి కూడా కేసీఆర్ చెప్పలేదు అంటారా?..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 50 వేలమంది రైతులతో మేడిగడ్డకు పోతా.. ‘కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి తోకా తొండం తెల్వదు. మేడిగడ్డ బ్యారేజీ మీద మూడు పిల్లర్లు కుంగిపోయినయి. కాంగ్రెస్ హయాంలోనూ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయ్. 25 సెం.మీల వానకు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి కంపెనీ కట్టిన ఎంఎండీ కొట్టుకుపోయింది. మేము కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలేదు. నిండ నింపి గంగమ్మ లెక్క చేసినం.. అందుకే ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకినయ్. జూన్‌లో 25 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. ఈసారి నీటిని ఎత్తిపోయకుంటే నేను 50 వేలమంది రైతులతో మేడిగడ్డ వద్దకు పోయి పండవెట్టి తొక్కుతా. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతో చిన్న ఇంజినీరింగ్ లోపాన్ని పెద్దది చేసి చూపే విఫలయత్నం చేశారు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజధానిలో ట్యాంకర్లా? ‘హైదరాబాద్‌లోని ప్రతి పేదవారి ఇంట్లో నల్లా ఉండాలన్న లక్ష్యంతో, రూ.1కే నల్లా కింద అందరికీ నల్లాలు ఇచ్చినం. బిందెలు కనబడకుండా చేసినం. కానీ ఇపుడు బిందెలు, ట్యాంకర్లుæ కనిపిస్తున్నయ్. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ బయల్దేరిండు. ఇక ఆగడు..గద్ద లెక్క వాలుతా.. మీ భరతం పడతాం.. మెడలు వంచుతాం..’ అని మాజీ సీఎం స్పష్టం చేశారు. ఫసల్ బీమా యోజన గుజరాత్‌లోనే లేదని, అసలు బీజేపీకి ఓ విధానం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెండు, మూడురోజుల్లో ఖచ్చితంగా స్పష్టమైన జవాబు ఇస్తానని తెలిపారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో: రాహుల్ గాంధీకి హరీశ్‌రావు లేఖ
సాక్షి,హైదరాబాద్: మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని, తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి శుక్రవారం(ఏప్రిల్ 5) ఒక బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ మోసాలు ఇప్పటికే అనేకసార్లు అనుభవపూర్వకంగా రుజువైనందున, మళ్లీ మేనిఫెస్టోల పేరుతో ప్రజలను మోసం చేయవద్దని సూచిస్తున్నామని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదమని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీలివ్వడం తర్వాత చేతులు ఎత్తేయడం మీకు అలవాటేనని లేఖలో హరీశ్‌రావు చురకంటించారు. ‘కాంగ్రెస్ మోసం చరిత్రలో ఎన్నోసార్లు రుజువయింది. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్‌లో మీరే అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన అన్ని హామీలన్నింటిని విస్మరించారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉన్నదా ? ఒక్కదానినైనా అమలు చేశారా ? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? ఈసారి మీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం పొంతనలేదని విషయం ఇప్పటికే రుజువైంది. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీరు చెప్పలేదు. హామీలు ప్రకటించడమే తప్ప వాటిని అమలు చేసే విషయంలో ఏమాత్రం శ్రద్ధ లేని మీకు, మళ్ళీ కొత్త హామీలను ఇచ్చే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మళ్లీమళ్లీ మోసం చేయాలనుకునే మీ ఎత్తుగడలు ఇక ముందు సాగబోవు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా’ అని లేఖలో హరీశ్‌రావు తెలిపారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల -
కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ
Live Updates.. ► కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట ►కరీంనగర్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ ►జిల్లాలోని మొగ్దుంపూర్లో ఎండిపోయిన పంటను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ► రోడ్డు మార్గంలో కరీంనగర్‌కు బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ ►లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ►ఈ సందర్బంగా సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్ ముందుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. ► మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌కు తిరుగుపయనమవుతారు. కాగా, ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తారా?: ఉప ముఖ్యమంత్రి భట్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘తీవ్రవాదుల గుర్తింపు, దేశ భద్రత కోసం ఏర్పాటు చేసి న చట్టాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టింది. ఇది ఎంత వరకు కరెక్ట్? ప్రతిపక్షాలు, పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. భార్యాభర్తలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంతా చేసి తీరా ఫోన్ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం అని తప్పించుకుంటారా? వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఎవరూ క్షమించరు’’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘వ్యక్తిగత సమాచారం ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పాలించమని అధికారాన్ని అప్పజెప్పితే ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించే విధంగా వ్యవహరిస్తారా? ఇంతకంటే అన్యాయం, ద్రోహం ఇంకేముంది. పదేళ్లు తెలంగాణలో వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేకుండా చేశారు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించే హక్కును ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తోంది.’’అని ఆయన పేర్కొన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర మహా సభ ఏర్పాట్లను గురువారం పరిశీలించిన అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు ’’రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీఆర్ఎస్ హయాంలో అతాలాకుతలమైంది. ప్రజలపై భారం మోపే విధంగా యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. జెన్కోను, ట్రాన్స్‌కోను సర్వనాశనం చేశారు. ఇప్పుడు వ్యవస్థలన్నింటినీ చక్కబెడుతున్నాం. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చూస్తున్నాం. చేసిందంతా చేసి ప్రస్తుతం అడ్డగోలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు. మూడు నెలలు ఫాంహౌస్‌లో పడుకుని.. తీరా ఎన్నికల ముందు బయటికొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవాస్తవాలు మాట్లాడే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు’’అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుక్కుగూడలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటన ‘దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం. తుక్కుగూడ జనగర్జన సభ ఈ దేశానికి దిశా నిర్దేశం చేయనుంది. దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకం కానుంది. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను తుక్కుగూడ సభనుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనుంది’’అని ఆయన వివరించారు. భట్టి వెంట మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మా రెడ్డి, మహేశ్వరం సీనియర్ నేత దేప భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
లైలా.. ఓ అంబాసిడర్
సాక్షి, హైదరబాద్: లైలా ఓరుగంటి. ఒక ట్రాన్స్‌జెండర్. దశాబ్దాలుగా ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం పని చేస్తున్న సామాజిక కార్యకర్త. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆమెను అంబాసిడర్‌గా నియమియారు. వివిధ సామాజిక వర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, అన్ని వర్గాలకు చెందిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల కమిషన్ వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ చేపట్టిన క్యాంపెయిన్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి లైలా ఎన్నికల అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహించే కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని కొనసాగించనున్నారు.‘తెలంగాణలో సుమారు 1.5 లక్షల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.కానీ ఓటర్లుగా నమోదైన వాళ్లు కనీసం 3 వేల మంది కూడా లేరు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది.’అని లైలా అభిప్రాయపడ్డారు. వివక్ష తొలగలేదు... చాలామంది ట్రాన్స్జెండర్లుగా జీవనం కొనసాగిస్తున్నప్పటికీ ఓటింగ్‌లో మాత్రం ‘పురుషులు’ లేదా ‘మహిళలు’గా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.‘ట్రాన్స్జెండర్లు’గా నమోదు కావడం లేదు. దీంతో సామాజికంగా లక్షన్నర మంది ట్రాన్స్జెండర్లు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కేవలం 2,737 మంది మాత్రమే ట్రాన్స్జెండర్లుగా నమోదయ్యారు. ఈ వర్గంపైన ఉండే సామాజిక వివక్ష కారణంగా తమ ఉనికిని చాటుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు గోప్యంగా జీవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంఖ్యరీత్యా మెజారిటీగా ఉండే ఓటర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపే రాజకీయ పారీ్టలు ట్రాన్స్జెండర్లను గుర్తించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సామాజిక రుగ్మతను తొలగించుకొనేందుకు ప్రతి ట్రాన్స్‌జెండర్ ఓటరుగా నమోదు కావలసి ఉందని లైలా పేర్కొన్నారు. గత పదేళ్లలో ట్రాన్స్జెండర్ల సంఖ్య రెట్టింపయింది.‘అనేక రకాలుగా ‘ట్రాన్స్’గా జీవనం కొనసాగిస్తున్నవాళ్లు ఉన్నారు.కానీ కుటుంబం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాల కారణంగా ఇళ్ల నుంచి బయటకు వచి్చన వాళ్లు నిర్భయంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు.’ అని చెప్పారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కమ్యూనిటీకి చెందిన పుష్ప ఎన్నికల్లో పోటీ చేయగా, 2018లో జరిగిన ఎన్నికల్లో చంద్రముఖి ఎన్నికల బరిలో నిలిచారు. ట్రాన్స్ కమ్యూనిటీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఈ పోటీ ఎంతో దోహదం చేసిందని ఆ వర్గానికి చెందిన పలువురు అభిప్రాయపడ్డారు.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ లైలాను అంబాసిడర్‌గా నియమించడాన్ని కూడా ట్రాన్స్జెండర్లు, సామాజిక సంస్థలు ఆహ్వానిస్తున్నాయి.కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో ఎంఏ చదివిన లైలా ... స్వచ్చంద సంస్థల ద్వారా ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పథకాలు అందడం లేదు... వివిధ కారణాల వల్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎలాంటి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేకుండా బతుకుతున్న తమను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, చదువుకున్న వాళ్లకు కూడా ఉద్యోగా లు లభించడం లేదని లైలా ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగులు, పేద మహిళలు, తదితర వర్గాలకు లభించే రాయితీ సదుపాయాలు కూడా తమకు అందడం లేదని, అణగారిన వర్గాలకు ఇళ్లు, ఇంటిస్థలాలు అందజేస్తున్నట్లుగానే తమకు కూడా సొంత ఇళ్లకు ఆర్ధికసహాయం అందజేయలని ఆమె కోరారు. ఈ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ల సంఖ్య 1.50 లక్షలు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్లుగా నమోదైన ఓటర్లు : 2000 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు : 2,885 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్లు : 2,557 ప్రస్తుతం జరుగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల కోసం నమోదైన ట్రాన్స్‌జెండర్ ఓటర్లు : 2,737. -
‘జనజాతర’ అదరాలి!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు జాతీయ స్థాయిలో శంఖారావంగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 6న నిర్వహించనున్న జన జాతర బహిరంగ సభను విజయవంతం చేయడంపై ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు. 60 ఎకరాల మైదానంలో నిర్వహించే ఈ సభ ఏర్పాట్లను మంత్రివర్గ సహచరులు, పార్టీ ఎంపీ అభ్యర్థులతో కలసి పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం పార్టీ నేతలతో వివిధ కమిటీలు ఏర్పాటు చేసిన సీఎం... గురువారం సాయంత్రం స్వయంగా సభా వేదిక వద్దకు వెళ్లి, మంత్రులు, పార్టీ నేతలతో సుమారు గంటన్నరపాటు సమావేశమయ్యారు. పదేళ్ల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేలా 10 లక్షల మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్, పలువురు ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. 10 లక్షల జనం తరలాల్సిందే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత ప్రియాంకా గాంధీ హాజరయ్యే ఈ సభ ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సత్తా చాటాలని రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సభా వేదిక నుంచే జాతీయ స్థాయిలో పార్టీ మేని ఫెస్టోను విడుదల చేయడంతోపాటు అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఐదు గ్యారంటీలను కూడా రాహుల్ గాంధీ ప్రకటించనున్న నేపథ్యంలో సభకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించనుందని రేవంత్ పేర్కొన్నారు. అందువల్ల సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి 10 జిల్లాల నుంచి మొత్తం 10 లక్షల మంది ప్రజలను సభకు తరలించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు, ఇన్చార్జి మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ఎంపీ అభ్యర్థులు కూడా శ్రద్ధ తీసుకోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ జరపాలని రేవంత్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సభ జరిగే మైదానం పక్కనే సుమారు 300 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉండటంతో సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. జగ్జీవన్ జీవితం స్ఫూర్తిదాయకం: రేవంత్ సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవ లు చిరస్మరణీయమని సీఎం రేవంత్ కొనియాడా రు. జగ్జీవన్‌రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు. -
ఈసీ, గవర్నర్ జోక్యం చేసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్నికల సంఘం, గవర్నర్, ఇతర దర్యాప్తు సంస్థలు సుమోటోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్యాపింగ్ ద్వారా దేశ సమగ్రతకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. దీనిపై గవర్నర్ ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు. అలాగే గతంలో ఎన్నికల నిబంధనలు బీఆర్ఎస్ ఉల్లంఘించినందున ఈసీ కూడా జోక్యం చేసుకోవాలన్నారు. 2014 నుంచి ఎన్నికలు, ఇతర సందర్భాల్లో పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతూ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినందున బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఈసీని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు కారణం ఎవరో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక షాడో సీఎం గా వ్యవహరించిన కేటీఆర్ ఇప్పుడు ఫోన్‌ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్‌తో రూ. కోట్లు వసూలు చేశారు.. ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రయత్నం చేసినా బీజేపీ విడిచిపెట్టబోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రిటైరైన ఓ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించి కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం మామూలు విషయం కాదన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల ఫోన్లతోపాటు, బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల ఫోన్లను బీఆర్ఎస్ నేతలు ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రూ. కోట్లలో వసూళ్లు చేసినట్లు, ఇందులో కేసీఆర్, అయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు బయటపడుతోందని వ్యాఖ్యానించారు. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. రైతు హామీలను కాంగ్రెస్ అమలు చేయదేం? రైతులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఎందుకు అమలు చేయట్లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘కౌలు రైతులకు ఆర్థిక సహాయం ఇవ్వలేదు. రుణమాఫీ ఏ డిసెంబర్ 9న చేస్తారో తెలియదు? రైతులకు రూ. 500 బోనస్ బోగసేనా? రైతులకు కొత్త రుణాలు ఎందుకు ఇవ్వట్లేదు’అని ఆయన నిలదీశారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.