breaking news
-
రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొంత మంది నాయకులు వెళ్లినా పార్టీకి నష్టం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీలను కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ దిక్కులేదని విమర్శించారు. ఘట్కేసర్లో బుధవారం మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. రేవంత్ బీజేపీలో చేరడం పక్కా ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు రేవంత్ మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని. మీ పక్కనే ఉన్నాయన్నారు. రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు సహ అన్నింటిని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం ఖచ్చితంగా బీజేపీలో చేరుతాడని జోస్యం చెప్పారు. భద్రాచలానికి బీజేపీ ఒక్క రూపాయైనా ఇచ్చిందా? పదేళ్లు దేశాన్ని నడిపిన ప్రధాని మోదీ తెలంగాణకు రూపాయి ఇచ్చింది లేదని విమర్శించారు. సీఎం గుంపు మెస్త్రి అయితే ప్రధాని తాపీ మేస్త్రి అని ఎద్దేవా చేశారు. ఇద్దరు కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రాష్ట్రంపై ప్రేమ ఉంటే.. భద్రాచలం ఆలయానికి ఒక్కరూపాయి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. అయోధ్యలో ఉన్నది రాముడే, భద్రాచలంలో ఉన్నది కూడా రాముడేనని అన్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్‌రావు రిమాండ్ పొడిగింపు రాముడితో పంచాయితీ లేదు.. బీజేపీతోనే.. ‘శ్రీరాముడు అందరివాడు.. ఆ రాముడితో మనకు పంచాయితీ లేదు.. పంచాయితీ అంతా బీజేపీతోనే. ఈ పదేళ్లలో ఏం చేశారని బీజేపీ వాళ్లను ప్రశ్నిస్తే జైశ్రీరాం అంటారు. రాముడు బీజేపీ పార్టీ మనిషి కాదు.. ఆయన అందరి మనిషి. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని తన్ని తరిమేయాలన్నారు కేటీఆర్. యాదాద్రిని రాజకీయంగా వాడుకోలేదు. దేవుడు దేవుడే.. ధర్మం ధర్మమే.. రాజకీయం రాజకీయమే. ఎవరు మన కోసం పని చేస్తున్నారో.. ఎవరు దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతుకుతున్నారో ప్రజలకు వివరించాలి. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, మతోన్మాదానికి కారణమైన బీజేపీని పాతరేయాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
నోటితో తియ్యగా మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్న రేవంత్: హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అభయ హస్తం అక్కరకు రాని హస్తంలాగా తయ్యారైందని ఎద్దేవా చేశారు. కాగా, హరీష్ రావు బుధవారం సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భండా ఆయన మాట్లాడుతూ..‘ఇటీవల కేసీఆర్ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి చెత్త పదజాలంతో ఏవోవో వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్ లీడర్‌వా అని ప్రశ్నించారు. ఎలక్షన్స్ ముందు నోటితో తియ్యగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారు. మేము తలుచుకుంటే కేసీఆర్ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/Xrcp92r9dB — Telugu Scribe (@TeluguScribe) April 6, 2024 Video Credit: Telugu Scribe కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాల పొంగులాగా ఉంది. రాష్ట్రంలో ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. ఏ ముఖం పెట్టుకుని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకురాని హస్తం లాగా తయారయ్యింది. 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉంది. ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది’ అని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ డ్రాయర్ ఊడకొడ్తా అంటుండు రేవంత్ రెడ్డి నువు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేదా చడ్డీ గ్యాంగ్ సభ్యుడివా- హరీష్ రావు pic.twitter.com/tRh71znWNF — Telugu Scribe (@TeluguScribe) April 10, 2024 Video Credit: Telugu Scribe -
కాంగ్రెస్ గూటికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోదరుడు
హైదరాబాద్, సాక్షి: అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు..మూడ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. బీఎస్పీ అధ్యక్ష పదవి వదిలేసి బీఆర్ఎస్లో ప్రవీణ్‌కుమార్ చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్నకుమార్ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ అలక బూనారు. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విబేధించాలని సిద్ధపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్.. నేడో,రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్నకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. -
గ్రేటర్ యవనికపై విభిన్న దృశ్యం!
సాక్షి, హైదరబాద్: రాష్ట్రంలో వచ్చేనెల జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయం ఉంది. రాజధాని హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎంఐఎం సంగతలా ఉంచితే..మిగతా మూడు ప్రధాన పారీ్టల్లో మూడు విభిన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కమలం దూకుడు.. మూడో పర్యాయం కూడా దేశంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న ఉత్సాహంలో బీజేపీ శ్రేణులు గ్రేటర్ ప్రచార పర్వంలోనూ దూసుకెళ్తూ మిగతా వారికంటే ముందంజలో ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోకొచ్చే హైదరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలకు అందరికంటే ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంతో వారిప్పటికే ప్రచారం ప్రారంభించారు. ప్రజలను కలుస్తున్నారు. జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న మోదీ ప్రభను వివరిస్తూ దేశం కోసం చేసిన కార్యక్రమాలను చెబుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాలు ఇప్పటికే ఓ రౌండ్ పర్యటించారు. ఈ నెల 13 తర్వాత మరో దఫా రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డజను సీట్ల గెలుపు లక్ష్యంగా గ్రేటర్‌లోని నాలుగింటిపైనా కన్నేయడంతోపాటు మూడింట నెగ్గేలా వ్యూహరచన చేశారు. నియోజకవర్గాల వారీగా ప్రచారం జోరుగా సాగుతోంది. టిఫిన్ భేటీలు నిర్వహించారు. నోటిఫికేషన్ వెలువడ్డాక మరింత దూకుడు పెంచనున్నట్లు పారీ్టవర్గాల సమాచారం. బూటకపు గ్యారంటీలంటూ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్‌లను ప్రస్తావిస్తున్నారు. పాదయాత్రలతో ఇంటింటికీ ప్రచారం ఇప్పటికే మొదలుకాగా, మరింత ముమ్మరం కానుంది. సాధారణ ప్రచారం కంటే సోషల్‌మీడియా పవర్ తెలిసినందున ప్రతిరోజూ తప్పనిసరిగా కొన్ని పోస్టులుండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్లో వరుసగా నెగ్గుతూ వస్తున్న అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి హిందూ ధర్మ సంరక్షణ, సంఘ్ నేపథ్యం కలిగిన కొంపెల్ల మాధవీలతను బీజేపీ నిలబెట్టింది. ఇటీవల ‘ఆప్కీ అదాలత్’ ఇంటర్వ్యూలో ఆమె ఇచి్చన సమాధానాలు అసాధారణమైనవని, తర్కంతో మాట్లాడటమే కాక దృఢమైన అంశాలు ప్రస్తావించారని స్వయానా మోదీ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. దీంతో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి నగర ప్రజల్లో పెరిగింది. ఇలా.. వివిధ అంశాల్లో బీజేపీ మిగతా పారీ్టల కంటే ముందంజలో ఉంది. డీలా పడ్డ గులాబీ ఇక పదేళ్లపాటు ఓ వెలుగు వెలిగిన గులాబీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, పార్టీ దళపతి కాలు విరగడం, ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఫోన్‌ట్యాపింగ్‌లు రేపుతున్న దుమారం తదితరమైనవి ఆ పార్టీని కోలుకోలేకుండా చేస్తున్నాయి. ప్రతిపక్షాల చర్యల్ని కేటీఆర్ ఎంతగా తిప్పికొడుతున్నా, అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నా పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం తగ్గలేదు. పార్టీ అభ్యర్థులను ఎంతో ముందస్తుగా ప్రకటించిన చరిత్ర ఉన్న ఆ పార్టీ ప్రస్తుతం అభ్యర్థుల కోసం వెతుక్కునే దుస్థితి ఎదురైంది. పిలిచి టిక్కెట్టిస్తామన్నా ముందుకొచ్చేవారు లేకుండా పోయారు. పైసలు..ప్రచారం అన్నీ చూసుకుంటామన్నా పోటీచేసేందుకు గతంలో మాదిరి పోటీ లేదని పార్టీ నేతలే అంటున్నారు. సికింద్రాబాద్‌లో పోటీ చేసేందుకు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ససేమిరా అనడంతో పద్మారావును కూర్చోబెట్టి ఒప్పించాల్సి వచి్చంది. చేవెళ్లలో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్కు చేయిచ్చి కాంగ్రెస్ పంచన చేరారు. దాంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌ను దింపారు. మల్కాజిగిరిలోనూ ఉన్నవారిలో రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారు. అక్కడ పోటీ చేసేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి వెనుకడుగు వేశారు. హైదరాబాద్‌పై ఎలాగూ ఆశల్లేవు కనుక ఎవరైనా ఒకటే కావడంతో గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌కు టిక్కెట్టిచ్చారు. మరోవైపు ఎవరు ఎప్పుడు పారీ్టకి గుడ్‌బై చెబుతారో తెలియక,పార్టీ నేతలు గట్టు దాటకుండా చేసేందుకు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. ఎలాగోలా అభ్యర్థుల్ని ప్రకటించినా ప్రచారంలో జోష్ లేదు. ఎవరూ పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేరు. కేవలం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ క్యాడర్‌తో సమావేశాలు తప్ప ప్రజల ముందుకెళ్లింది లేదు. ఇక మిగిలిన సమయంలోనైనా పుంజుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. ‘ఆకర్ష్ పై’ కాంగ్రెస్ దృష్టి! ఇక రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి..విజయోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం కంటే ఎక్కువగా ఇతర పారీ్టల నేతలు/అభ్యర్థులను తమవైపు ఆకర్షించడమే పనిగా పెట్టుకుంది. వారిని తమవైపు గుంజితే చాలు.. తమ బలం పెరిగిందని ప్రజలు ఓట్లేస్తారని భావిస్తున్నట్లున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. మూడు సీట్లు పక్కా కొట్టాల్సిందేనని పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నప్పటికీ ఇంకా ప్రజల మధ్యకు వెళ్లలేదు. సికింద్రాబాద్‌లో దింపిన దానం నాగేందర్‌ను, మల్కాజిగిరిలో నిలబెట్టిన సునీతా మహేందర్‌రెడ్డిని, చేవెళ్లలో రంజిత్‌రెడ్డిని బీఆర్ఎస్ నుంచి లాగడం తెలిసిందే. సికింద్రాబాద్ టిక్కెట్‌ను ప్రకటించినప్పటికీ దానం నాగేందర్ విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు పార్టీ మారితే చర్యలుండాల్సిందన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఇరకాటంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల గెలుపే ఈ ఎన్నికలకూ అక్కరకొస్తుందని, పారీ్టలోకి ఎక్కువ మందిని రప్పించడంపై దృష్టి సారించిన పారీ్ట.. ప్రజల మధ్యకు వెళ్లడం ఇంకా ప్రారంభించలేదు. చేరికలు, సభలతోనే ఇప్పటివరకు సరిపోయింది. మున్ముందు వైఖరి ఎలా ఉంటుందో చూడాల్సిందే. -
పీకే మాటలకు విలువే లేదు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రశాంత్‌కిషోర్ (పీకే) మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, బతుకు దెరువు కోసం సర్వే సంస్థ పేరుతో రోజుకో మాట మాట్లాడుతాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. గాం«దీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పీకే సర్వేల పేరిట చెపుతున్న జోస్యాలను కొట్టిపారేశారు. పీకే మాటలకు విలువ లేదని తేల్చి చెప్పారు. దేశంలో గెలిచేది బీజేపీ అని ఓసారి, ఇంకోసారి కాంగ్రెస్ అని అంటాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పాడని, కానీ కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. పీకే సర్వేలకు, మాటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పారీ్టకి 12 నుంచి 14 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ పాలనకు వంద మార్కులు రేవంత్ పాలనకు వంద మార్కులు వేస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే బాగుంటుందనే రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో కింగ్, కింగ్ మేకర్ రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. కరువు కాంగ్రెస్‌తో వచి్చందని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు వర్షాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలుసుకునే తెలివి లేదా అని విమర్శించారు. కేసీఆర్ ఇంకా ఓటమి ఫ్ర్రస్టేషన్లోనే ఉన్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఏ విషయంపైనా కనీస అవగాహన ఉండదని విమర్శించారు. బీజేపీ బౌండరీలో మంద కృష్ణ రాజకీయాలు బీజేపీ బౌండరీలో ఉండి మంద కృష్ణ మాదిగ రాజకీయాలు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. న్యూట్రల్‌గా ఉంటే ఆయన ఏం అడిగినా సమాధానం చెప్పేవాళ్లమన్నారు. బీజేపీ తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని గానీ కేంద్ర మంత్రిని చేయాలని గానీ మంద కృష్ణ అడిగారా అని ప్రశ్నించారు. బంగారు లక్ష్మణ్‌ని నవ్వులపాలు చేసినప్పుడు మంద కృష్ణ కనీసం స్పందించలేదని గుర్తు చేశారు.పార్టీ ఫిరాయింపులపై తాను మాట్లాడలేనని, ఎందుకంటే తానే పార్టీలు మారి వచ్చానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
కర్ణాటకలో మాదిరిగానే దగా
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలోనూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన ఏ హామీనీ అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, నిధుల సమీకరణ ఎజెండా కూడా కాంగ్రెస్ వద్ద లేదని అన్నారు. దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారైందని విమర్శించారు. పరిపాలనలో, దోపిడీలో మార్పురాలేదని, ప్రజలను వెన్నుపోటు పొడవడంలో మార్పు రాలేదని ధ్వజమెత్తారు. ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆంజనేయులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరి, జెడ్పీటీసీ రాజు రాథోడ్, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నల్లగొండ జిల్లాకు చెందిన రామరాజు, ఇతర నాయకులు మంగళవారం బీజేపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి వారికి బీజేపీ కండువాలు కప్పి ఆహా్వనం పలికారు. ఉగాది రోజున పలువురు నాయకులు, కార్యకర్తలు, బీసీ, అంబేడ్కర్ సంఘాల ప్రతినిధులు బీజేపీలో చేరడం శుభసూచకమని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందూ దొందే రాష్ట్రంలో కేవలం ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వచ్చిందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందూ దొందేనని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల తుక్కుగూడ సభలో రాహుల్‌గాంధీ పాత గ్యారంటీల గురించి మాట్లాడకుండా, ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా.. కొత్త హామీలు ఇచ్చిపోయారని విమర్శించారు. రాహుల్‌గాంధీ వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి ప్రజలను వెన్నుపోటు పొడిచారని, తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. అయితే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని కాంగ్రెస్‌ని నమ్మే పరిస్థితిలో లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆర్జీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల నుంచి ఆర్జీ ట్యాక్స్ (రా హుల్‌గాంధీ ట్యాక్స్) వసూలు చేస్తోందని, బిల్డర్లు, కాంట్రాక్టర్లను ఎవ్వరినీ వదలడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో 25 ఎంపీ సీట్లలో బీజేపీ గెలవబోతోందని, తెలంగాణలో కూడా ప్రజలు మోదీకి అండగా నిలబడి 17 సీట్లలో విజయాన్ని అందించాలని కోరారు. రేవంత్‌కు కాంగ్రెస్ నుంచే ప్రమాదం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ కాంగ్రెస్ నుంచే ప్రమాదం పొంచి ఉందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సికింద్రాబాద్ పార్టీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, అయితే ఆయనకు బీజేపీతో ఎలాంటి అపాయం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి తామెలాంటి అంతరాయం కలిగించబోమని అన్నారు. సీఎంకు ఏదైనా ప్రమాదం ఉందంటే అది కాంగ్రెస్ వారి నుంచే అని ఆయన గుర్తించాలని సూచించారు. తాము బహిరంగంగానే ప్రజల మద్దతు కూడగట్టి కాంగ్రెస్‌ను ఓడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు సభల్లో పాల్గొన్నారని, భవిష్యత్తులో మరిన్ని సభల్లో పాల్గొంటారని తెలిపారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు సైతం ఇప్పటికే మండల స్థాయి వరకు ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. -
ఇంటింటికీ బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. దేశంలో మూడో విడత పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ నెల 18న ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ వెలువడేలోగా రాష్ట్రంలో తొలివిడత ‘ఓటర్స్ ఔట్ రీచ్’పూర్తిచేయాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కింద ఈ నెల 14 నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట ఓటర్లను వారి ఇళ్ల వద్దే పార్టీ కార్యకర్తలు కలుసుకోనున్నారు. 17వ తేదీలోగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసే (మే 11)లోగా ప్రతి కుటుంబాన్ని మొత్తంగా మూడుసార్లు కలిసి మద్దతు కోరాలని బీజేపీ భావిస్తోంది. ప్రతి ఇంటి తలుపు తట్టేలా.. తొలి విడత లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల్లో విస్తృత స్థాయి ప్రచారాన్ని బీజేపీ చేపట్టనుంది. ప్రతి ఇంటి తలుపు తట్టి, ఆ కుటుంబ సభ్యులను కలుసుకుని ఈసారి బీజేపీకి ఓటేయాలని కోరనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం, ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్, పార్టీ జెండా, ఓటర్లకు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రం (అప్పీల్) వంటివి వారికి అందించనున్నారు. ఈ ప్రచార ప్రక్రియకు సంబంధించిన మొత్తం మెటీరియల్ ఇప్పటికే సిద్ధమై పార్టీ యంత్రాంగానికి అందుబాటులోకి తెచ్చినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. మూడురోజులు సన్నాహక సమావేశాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లడానికి ముందు ఈ నెల 11, 12, 13 తేదీల్లో మండల స్థాయిలో దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వీటికి సమాంతరంగా ఈ నెల 15వ తేదీలోగా 17 ఎంపీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సమ్మేళనాలు పూర్తి చేయనున్నారు. వీటిల్లో పోలింగ్ బూత్‌ల కోఆర్డినేటర్లు మొదలు రాష్ట్రస్థాయి వరకు నాయకులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చేవెళ్ల, తదితర చోట్ల ఈ సమ్మేళనాలు పూర్తికాగా, 15 వరకు మిగతా పార్లమెంట్ సీట్ల పరిధిలో నిర్వహించనున్నారు. ప్రత్యేక ‘కాస్ట్ ఔట్ రీచ్’ప్రోగ్రామ్ వివిధ సామాజిక వర్గాలను కలుసుకునేందుకు ప్రత్యేకంగా ‘కాస్ట్ ఔట్ రీచ్’కార్యక్రమాన్ని కూడా బీజేపీ చేపట్టనుంది. జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీల స్థాయిల్లో వివిధ కుల సంఘాలతో సమ్మేళనాలు, యువత, మహిళ, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా వివిధ వర్గాల వారితో ఎక్కడికక్కడ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. నామినేషన్ల సమయంలో ర్యాలీలు ఈ నెల 25న రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. 18వ తేదీ తర్వాత లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ నెల 25వ తేదీ తర్వాత మే 13వ తేదీ పోలింగ్ వరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. మిగతా ఎన్నికల ప్రచారమంతా ఇంటింటికీ వెళ్లడం, కార్నర్ మీటింగ్‌లు లాంటి స్వయంగా ఓటర్లను కలుసుకునే ‘ఓటర్ ఔటర్ రీచ్’కార్యక్రమాలకే నాయకత్వం ప్రాధాన్యతనివ్వనుంది. -
‘కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు’
సాక్షి, హైదరాబాద్: తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) పదవి అడగడం కొత్త కాదని.. అవకాశం వచ్చిన ప్రతి సారి తాను అడుగుతానని కాంగ్రెస్ నేత జాగ్గారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకే. రెడ్డిలలో ఎవరికైనా అవకాశం ఇస్తే ఆ పోటీ పడే లిస్ట్‌లో నేను ఉంటాను. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ. రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. విషయ అవగాహన లేని మంత్రి కిషన్ రెడ్డి. ఆర్థిక వనరుల సమీకరణ, బతుకు తెరువు కోసం పీకే సర్వే సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు. మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. దామోదర రాజనర్సింహకు, మీరా కుమార్‌కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారు. వర్షాకాలంలో వర్షాలు పడుతాయి. ఎండ కాలంలో వర్షాలు పడవు. కనీసం బుద్ధి లేకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఒక కాంగ్రెస్ అభిమానిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఆయన రాజే. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. మా వంద రోజుల పాలన గురించి మమ్మలని అడగకండి. ఆర్టీసి బస్సులలో ప్రయాణం చేసే మహిళలను అడగండి వాళ్ళు చెపుతారు. ఫిరాయింపుల మీద నేను మాట్లాడలేను. నేను కూడా రెండు సార్లు పార్టీ మారాను. పదవుల కోసం నేను కక్కుర్తి పడను’అని జగ్గారెడ్డి అన్నాఉ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ ఉందని, రాజ పూజ్యం 16, అవమానం 2 ఉందని తెలపారు. -
సిద్ధిపేట: 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్‌కు గురయ్యారు. రెండురోజుల క్రితం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
మోదీ హయాంలోనే సురక్షితం
మొయినాబాద్ రూరల్: దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ సాధిస్తారని, జూన్ 8 లేదా 9న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మోదీ హయాంలోనే దేశం సురక్షితంగా ఉందన్న ఆయన దేశంలో పదేళ్ల క్రితం నాటి, ప్రస్తుత పరిస్థితులపై ఆలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాద దాడులు, మతకల్లోలాలు జరిగేవని గుర్తుచేశారు. గతంలో కీలుబొమ్మలాంటి ప్రధాని ఉండేవారని.. మోదీ రాకతో దేశానికి బలమైన లీడర్ లభించారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ కన్వినర్ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటనే మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. పదేళ్ల క్రితం అనేక వస్తువులను మనం దిగుమతి చేసుకునే వారమని, ప్రస్తుతం మనమే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో పదిహేను రోజులకో కుంభకోణం జరిగి రూ.వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని స్పష్టంచేశారు. ఆరి్టకల్ 370 రద్దు చేస్తామని చెప్పిన మోదీ చేసి చూపించారన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆయనతోనే సాధ్యమైందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగమే వస్తుందని విమర్శించారు. రుణమాఫీకి రేవంత్ డబ్బులెక్కడి నుంచి తెస్తారో? డిసెంబర్లో రుణమాఫీ చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి అందుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉచితంగా బస్సుల్లో తిప్పితే అన్నీ ఇచ్చినట్లు అనుకోవద్దని ప్రజలకు సూచించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యరి్థ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాశ్, సనివెళ్లి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మరెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, ఆయా నియోజకవర్గాల బూత్ లెవల్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
బస్సు యాత్రతో ‘కారు’ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని తొలుత భావించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 97 బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. కానీ తాజాగా బహిరంగ సభలకు బదులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సాధ్యాసాధ్యాలపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ సెగ్మెంట్లలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు బస్సు యాత్ర దోహద పడుతుందని భావిస్తున్నారు. వేసవి తీవ్రతలో జన సమీకరణ కష్టతరమవుతుందనే ఉద్దేశంతో బస్సు యాత్ర చేస్తేనే మంచిదనే అభిప్రాయానికి ఇప్పటికే కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి ప్రారంభం! ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న బస్సు యాత్ర తీరుతెన్నులను పరిశీలించిన కేసీఆర్ ఇక్కడ కూడా అదే రీతిలో ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర ద్వారా సుమారు వంద అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మినీ మీటింగులు లక్ష్యంగా, వీలైనన్ని మండలాలను కవర్ చేసేలా ప్రచారానికి రూట్ మ్యాప్, షెడ్యూలుపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 15 తర్వాత మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రతికూలాంశాలపైనా చర్చ నాలుగు నెలల క్రితం ప్రమాదానికి గురైన కేసీఆర్ ఇంకా ఊతకర్ర సాయంతోనే నడుస్తుండటంతో బస్సు యాత్ర ఎంతవరకు సాధ్యమనే చర్చా జరిగినట్టు తెలిసింది. మరోవైపు ఇటీవల ఉమ్మడి వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసీఆర్ చేసిన ‘పొలంబాట’సందర్భంగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తినట్లు పార్టీ వర్గాలు గుర్తించాయి. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తోపులాటకు దిగుతుండటంతో వారిని నియంత్రించడం కష్టతరమవుతోందని సెక్యూరిటీ విభాగం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ అంశాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం. 13న చేవెళ్లలో బహిరంగ సభ కేసీఆర్ బస్సు యాత్రకు ముందు, గతంలో నిర్ణయించిన మేరకు ఈ నెల 13న చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభతోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్, ముఖ్య నేతలతో జరుగుతున్న సన్నాహక, సమన్వయ భేటీల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. క్షేత్ర స్థాయిలో చేయాల్సిన ప్రచారం, ఎజెండా తదితరాలపై దిశా నిర్దేశం చేస్తున్నారు. -
హస్తం టార్గెట్@14 'మూడంచెల వ్యూహం'
3 స్థానాలపై ప్రత్యేక దృష్టి రాష్ట్రంలోని మూడు స్థానాల్లో గెలుపు అంత సులభమేమీ కాదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ఎంఐఎం, మెదక్‌లో బీఆర్ఎస్, కరీంనగర్లో బీజేపీలను నిలువరించడం కష్టమేనని నాయకత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ప్రత్యేకంగా దృష్టి పెడితే గెలుపు అసాధ్యమేమీ కాదని కూడా అంతర్గత చర్చల్లో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉన్నా మెదక్‌లో మాత్రం బీసీ కార్డు ఉపయోగపడుతుందని, కరీంనగర్లో ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నామని, మొత్తం మీద మూడుచోట్లా విజయం లక్ష్యంతో గట్టిపోటీ ఇస్తామని నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ జాతీయ మేనిఫెస్టోతో పాటు 23 అంశాలతో రూపొందించిన తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని, 100 రోజుల రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని అంటున్నారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీ సమీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఇక అసెంబ్లీ స్థాయి సన్నాహక సమావేశాలకు సన్నద్ధమవుతున్నామని, నామినేషన్ల ఘట్టం ప్రారంభం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం 14 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేయనుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లు, ఆ ఎన్నికల తర్వాత పార్టీ బలాబలాల్లో చోటుచేసుకున్న మార్పులు ప్రాతిపదికన రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలను 3 కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీ కింద కష్టపడితే గెలుపు సులభమేనని ధీమాగా ఉన్న స్థానాలు, బీ కేటగిరీ కింద ఎంత కష్టమైనా గట్టిగా కృషి చేస్తే గెలుపొందొచ్చని భావిస్తున్న నియోజకవర్గాలు, సీ కేటగిరీలో గెలుపు అంత సులభం కాదని భావిస్తున్న స్థానాలను చేర్చింది. ఈ మేరకు మూడు కేటగిరీల్లో మూడు ప్రత్యేక వ్యూహాలను అమలు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ద్వితీయ శ్రేణి కేడర్‌కు సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. 8 చోట్ల మెజారిటీపై దృష్టి: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలాచోట్ల 20 వేల కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. 20–50 వేల మధ్య మెజార్టీ సాధించిన స్థానాలు 40 వరకు ఉన్నాయి. ఇందులో పార్లమెంటు స్థానాల వారీగా పరిగణనలోకి తీసుకుంటే కనీసం ఎనిమిది చోట్ల కాస్త కష్టపడితే విజయం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఇందులో నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్, జహీరాబాద్ నియోజకవర్గాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో సాధ్యమైనంత మెజార్టీ సాధన దిశగా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగా ఆయా జిల్లాల పరిధిలోని మంత్రులు, లోక్‌సభ ఇన్చార్జులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చూసుకోవాలని, అలాగే పోలింగ్ రోజున అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆరుచోట్ల జాగ్రత్తగా.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం బీ కేటగిరీలో ఆరు స్థానాలున్నాయని తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ స్థానాల్లో గెలుపు కష్టమైనా.. అందుకోసం గట్టిగా కృషి చేయాలని అంచనా వేస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం తాను ప్రాతినిధ్యం వహిస్తున్నది కావడంతో ఈ నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ మాజీ నేత, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని గెలిపించడం ద్వారా ఉమ్మడి పాలమూరు రాజకీయాల్లో ఆధిపత్యం చాటాలని ఆయన పట్టుదలతో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక నిజామాబాద్‌లో జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణ అభ్యర్థిత్వాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరిద్దరికీ ఉన్న మంచి పేరుకు తోడు పార్టీ అభ్యర్థిత్వాలు కలిసి రేసులో ప్రతిపక్షాల కంటే ముందే ఉంటామనే ధీమాతో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాలకు గ్రేటర్ హైదరాబాద్‌తో సంబంధమున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసుకుంటే ఇక్కడ గెలుపు కష్టమేనని, అయితే మారిన రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఖరారులాంటి అంశాలు విజయానికి బాటలు వేస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఆరు స్థానాల్లో ఏ స్థానానికి ఆ స్థానంలో ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో బీఆర్ ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినా, కాంగ్రెస్ సమావేశాలకు కూడా ఆయన హాజరవుతున్నారు. శనివారం తుక్కుగూడలో జరిగిన జనజాతర సభకు కూడా ఆయన హాజరై వేదికపై కూర్చున్నారు. ఈయన కాంగ్రెస్‌లోకి వస్తారన్న ప్రచారం చాలాకాలంగా జరుగుతున్నా ఆదివారం పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా ఆ పార్టీలో చేరారు. వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది ఎమ్మెల్యేలు ఆ జిల్లాలో ఉండగా, వెంకట్రావు చేరికతో పదికి పది చోట్లా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావడం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరడం గమనార్హం. -
ఆ రెండు పార్టీల ప్రయత్నాలు ఫలించవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందని, తాము చేసింది చెప్పి ఓట్లడిగేందుకు బీజేపీ దగ్గర ఏమీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ఆ రెండు పార్టీలు చేసే ప్రయత్నాలు ఫలించ బోవని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సాను కూల రాజకీయ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఆదివారం జూబ్లీ హిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సికింద్రా బాద్, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన నాయకులతో ఆయన విడివిడిగా సమీక్ష నిర్వహించారు. పార్టీ అభ్యర్థులు దానం నాగేందర్, కడియం కావ్యలతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, కె.ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్, విజయారెడ్డి, ఫిరోజ్‌ఖాన్, రోహిణ్‌రెడ్డి, ఆదం సంతోష్ తదితరులు హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలి సికింద్రాబాద్ సమీక్షలో భాగంగా రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ గెలిచిందని, ఇప్పుడు కూడా గెలవడం ద్వారా హైదరాబాద్ నగరంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కో రారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికి పరిస్థితిలో మార్పు వచ్చిందని, జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలం పెరిగినందున ఈ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలందరితో కలిసి సమన్వ యంతో ముందుకెళితే గెలుపు కష్టమేమీ కాదని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందని చెప్పేందుకు సికింద్రాబాద్ గెలుపు అవసరమని స్పష్టం చేశారు. వరంగల్ సమీక్ష సందర్భంగా.. సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ఇక్కడి నుంచి బరి లో దింపుతున్నందున అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నాయకులు కష్టపడి పనిచేయాలని, కావ్య గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, బూత్ స్థాయి నుంచి కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయాలని చెప్పారు. నేడు కొడంగల్‌కు సీఎం సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం తన సొంత నియో జకవర్గమైన కొడంగల్‌కు వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని మండలాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత సా యంత్రానికి ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. -
దోచుకునేందుకు కష్టపడుతున్నారా?
సాక్షి, హైదరాబాద్: రోజుకు 18 గంటలు కష్టపడు తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నా రని, దోచుకోవడానికి కష్టపడుతున్నారా? అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. వందరో జుల్లో సంపద అంతా దోచుకున్నారని, రాష్ట్రం నుంచి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని ఆరోపించారు. కరువుతో రైతులు బాధపడుతున్నా..తుక్కుగూడ సభలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు సైతం రైతుల గురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9నే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసగించారన్నారు. ఇప్పు డు దేశ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నా యకులు శ్రీకారం చుట్టారని, 2014 కంటే ముందు అరాచకాలు మళ్లీ రాష్ట్రంలో మొదలయ్యా యని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కేసుల గురించి ఎన్నడూ మాట్లాడ లేదని, మేము రైతుల గురించి మాట్లాడుతుంటే, కాంగ్రెస్‌వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లా డుతున్నారని చెప్పారు. రైతుగోడు పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడన్నారు. ఓ వైపు పార్టీ మారిన వారిని పక్కన కూర్చోబెట్టుకొని, మరోవైపు పార్టీ మారిన వారిని డిస్ క్వాలిఫై చేయాలని చట్టం తెస్తామని మాట్లాడుతుంటే.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూసి బాధపడి కేసీఆర్ సూచనలు ఇస్తుంటే..అవి పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ నిబంధనలు లేకుండా కృష్ణా జలాలను నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటికి విడుదల చేసి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, వి.నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
కేసీఆర్, కేటీఆర్‌వి పచ్చి అబద్ధాలు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబా ద్): రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు ఎండిపోయాయంటూ బీఆర్ఎస్ పార్టీ అధి నేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షు డు డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆరోపించారు. గత వర్షాకా లంలో తక్కువ వర్షపాతం ఉండటం వల్ల సుమారు రెండు లక్షల ఎకరాల వరకు ఎండిపోయి ఉంటా యని, కానీ వాటిని ఎక్కువగా చూపుతూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆదివా రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ శాఖ విశ్రాంత అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం చైర్మన్, రిటైర్డ్ సంయుక్త వ్యవసాయ సంచాలకులు భోమిరెడ్డి కృపాకర్‌రెడ్డి జన్మది నాన్ని పురస్కరించుకుని ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నారెడ్డి మాట్లాడుతూ, రానున్న పార్ల మెంటు ఎన్నికలలో లబ్ధిపొందేందుకు రైతులను, ప్రజలను ప్రతిపక్షాలు తప్పు దారి పట్టిస్తున్నాయని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సంస్థల అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ విశ్రాంత వ్యవసాయ శాఖ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ రంగారెడ్డి అధ్యక్షతన జరిగి న ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖ ర్, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శి జి. కృపాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కు మార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.ఆర్.బిస్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కృపాకర్‌రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. -
హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు 'ప్రధాని ప్రశంసలు'
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్ని కల్లో హైదరాబాద్ బీజేపీ అభ్య ర్థిగా పోటీ చేస్తున్న మాధవీల తకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తాజాగా ఓ టీవీలో నిర్వహించే ఆప్కీ అదాలత్ కార్యక్రమంలో మాధవీలత పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత రజత్శర్మ ప్రశ్నలకు మాధవీలత ఇచ్చిన సమాధానాలు అసాధరణమైనవని, చాలా దృఢమైన అంశాలు ప్రస్తావించారని, తర్కంతో మాట్లాడారని ప్రధాని ప్రశంసించారు. ఈ కార్య క్రమాన్ని అందరూ వీక్షించాలంటూ ప్రధాని మోదీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మొదలు.. ఒకప్పుడు సంతోష్‌నగర్‌లో తన ఇల్లు వర్షపు నీటిలో మునిగిపోయిన ఘటన వరకు పలు అంశాలను మాధవీలత గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో హైదరాబా ద్లో మత ఘర్షణలు ఎంత భయానక వాతావ రణం సృష్టించేవో తెలిపారు. మత ఘర్షణలకు, రాజకీయ కక్షలకు పెద్దగా తేడాలేదన్నారు. హైదరా బాద్ నగరం లక్షలాది మందికి ఐటీలో ఉపాధి కల్పిస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజల భాగస్వా మ్యం ఒకశాతం కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ టికెట్ మళ్లీ ఆ ఫ్యామిలీకే ?
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆదివారం(ఏప్రిల్ 7) ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమావేశమై కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీశ్‌రావు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ మళ్లీ దక్కడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల సాయన్న కూతురు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం మృతి చెందడంతో ఈ సీటు ఖాళీ అయి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపున లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అభ్యర్థిని అధికారికంగా మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ నేతలు పలువురు ఈ ఉప ఎన్నికలోనూ టికెట్ కోసం పార్టీని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. వీరందరి అభ్యర్థిత్వంపై చర్చించిన తర్వాత టికెట్ సాయన్న కుటుంబానికే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన గణేష్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా పార్టీ ఆయనను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్ -
ఎమ్మెల్యే ‘తెల్లం’కు కాంగ్రెస్ కండువా.. స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం(ఏప్రిల్ 7) ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఫొటోను కేటీఆర్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తాజాగా రిలీజ్ చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13వ పాయింట్ గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే లు, ఎంపీలు ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టేకి వెళితే ఆటోమెటిక్‌గా అనర్హతకు గురయ్యేలా చట్ట సవరణ చేస్తాం అని మేనిఫెస్టోలో చెబుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించిందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కండుడవా కప్పి మరీ చేర్చుకుంటున్నారన్నారు. గెలిచేంత వరకు ఒక మాట ... గెలిచాక ఇంకో మాట. ఇదే కాంగ్రెస్ రీతి .. నీతి. బీజేపీకి కాంగ్రెస్‌కు తేడా ఏంటి. మేనిఫెస్టోలు అమలు చేసే ఉద్దేశం లేనపుడు ఎందుకీ నాటకాలు రాహుల్‌గాంధీ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. కాగా, తెల్లం వెంకట్రావ్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ నేడు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వెంటనే వెంకట్రావ్ సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ను కలిశారు. దీంతో, అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారనే చర్చ నడిచింది. ఇక, గత కొన్ని రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం కూడా ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ మీటింగ్‌లో పాల్గొనడం, గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. మరోవైపు.. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపైన కూడా ఆయన కూర్చున్నారు. అయితే, ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఇక, పార్టీ చేరిన వెంటనే వారికి టికెట్ కూడా రావడం విశేషం. దీంతో, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు హైకమాండ్‌పై సీరియస్ అవుతున్నారు. తమకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
న్యాయ్ కాదు.. కాంగ్రెస్‌ది నయ వంచన: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా న్యాయ్ పేరిట నయా నాటకానికి కాంగ్రెస్ నాయకులు తెరతీశారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీ.. తెలంగాణ అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నయ వంచన చేసిందని మండిపడ్డారు. కాగా, నిన్న తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ సభపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేటీఆర్ ట్విట్టర్లో.. ‘అది జనజాతర సభ కాదు... హామీల పాతర... అబద్ధాల జాతర సభ.. రాహుల్ గాంధీ గారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. 6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..! పార్లమెంట్ ఎలక్షన్లలో.. న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..? తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు ?? నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా నయవంచన చేస్తోంది కాంగ్రెస్ అసత్యాలతో అధికారంలోకి వచ్చి.. అన్నదాతలను ఆత్మహత్యల పాల్జేస్తోంది.. నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోంది.. గ్యారెంటీలకు పాతరేసి... అసత్యాలతో జాతర చేస్తోంది.. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు.. కాంగ్రెస్ అసమర్థ పాలనలో... సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారు. మీ మోసాలపై మహిళలు మండిపడుతున్నారు.. రాహుల్ గారు.. మా అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా..? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా ? 200కిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా ? చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా ? డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా ? 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే.. కాంగ్రెస్ కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు చేతి గుర్తుకు ఓటేస్తే.. చేతులెత్తేయడం ఖాయమని.. తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. సకల రంగాలను సంక్షోభంలోకి నెట్టిన.. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే.. నిండా మునగడం ఖాయమని తేలిపోయింది. అందుకే.. వందరోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం ఖాయం.’ అని కామెంట్స్ చేశారు. అది జనజాతర సభ కాదు... హామీల పాతర... అబద్ధాల జాతర సభ.. రాహుల్ గాంధీ గారు... అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. 6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..! పార్లమెంట్ ఎలక్షన్లలో.. న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..? తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు ??… https://t.co/bQk4H9XmaM — KTR (@KTRBRS) April 7, 2024 -
కాంగ్రెస్ చెప్పేదొకటి.. చేసేది మరొకటి
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారే నేతలు వెంటనే తమ పదవులు కోల్పోయేలా చట్టం తెస్తామని కాంగ్రెస్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి, చేసేది మరొకటి ఉంటుందని సామాజికమాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘దేశంలో ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. అయితే తను ప్రారంభించిన ‘ఆయా రాం– గయా రాం సంస్కృతి’పై ఇప్పటికైనా కాంగ్రెస్ విధానం మార్చుకోవడం మంచిదే. కానీ ఇచ్చిన హామీలకు పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటాయి. ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకోబోమని ఒకవైపు చెప్తూనే, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇచ్చింది. మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయకున్నా పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీకి నిబద్ధత ఉంటే ఈ అంశంపై మాట్లాడాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడం ద్వారా తాము అబద్ధాలు చెప్పమని రాహుల్ దేశం ఎదుట నిరూపించుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. -
గ్యారంటీలపై చర్చకు రాహుల్ సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని.. కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని, వీటిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో బహిరంగ చర్చకు సిద్ధమ ని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు రాహుల్ సిద్ధమేనా అని సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోను తుక్కు గూడలో విడుదల చేశామని, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ రాహుల్ గాంధీ పేర్కొనడాన్ని కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. హామీల్ని నిలబెట్టుకున్నామంటున్న రాహుల్ గాంధీకి దమ్ము, ధైర్యముంటే హామీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు .‘తెలంగాణ ప్రజల తరఫున మేం వస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ చర్చకు రావాలి’ అని డిమాండ్ చేశారు. ఉట్టికెగరనోడు.. ఆకాశానికి ఎగురుతానన్నట్లు రాహుల్ తీరు ఉందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలియని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఉన్నారని విమర్శించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ముగిశాక శనివారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక్కడ చేత కాలేదు కానీ దేశవ్యాప్తంగా చేస్తారా? తెలంగాణలో హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వడం చేత కాలేదు కానీ దేశవ్యాప్తంగా దానిని అమలుచేస్తామంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నిర్వహణ చేత కాక రాజీనామా చేసిన రాహుల్ గాంధీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మీ ఇళ్లలో నోట్లు ముద్రించే యంత్రాలున్నాయా? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఆ పార్టీ కార్యా లయాల్లో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో, సోనియా గాంధీ ఇంట్లోనో నోట్లు ముద్రించే యంత్రాలు పెట్టుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. చైనా బ్రాండ్ వస్తువులు బాగుంటాయంటున్న రాహుల్‌గాంధీ అవి ఇక్కడకు వస్తాయని అంటున్నారా.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చైనాను పొగుడు తున్న ఆయనకు కొద్దిగా కూడా బుద్ధి లేదని మండిపడ్డారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు గాంధీ పరివార్ కి మోదీ పరివారానికి మధ్య జరిగే పోరాటమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఈవీఎంల ద్వారానే గెలిచిన రేవంత్ రెడ్డి వాటిపైనే ఆరోపణలు చేయడానికి సిగ్గుండాలన్నారు. ఫిరాయింపులపై ఉన్న దృష్టి పాలనపై ఏదీ? సీఎం రేవంత్‌రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న ధ్యాస పాలనపై కానీ, ఎన్నికల హామీల అమలుపై కానీ లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ 44వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం పార్టీ కార్య క్రమంలో పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో ఆట ఆడేది బీజేపీ మాత్రమేనని అన్నారు. -
సెంటిమెంట్.. కొత్త ఉత్తేజం..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇక్కడ్నుంచే ప్రచారభేరి నిర్వహించి, అధికారంలోకి వచ్చిందని.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలసి వస్తుందన్న సెంటిమెంట్ కనిపించింది. ఈ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి సభా ప్రాంగణం కిక్కిరిసింది. ముఖ్య అతిథి రాహుల్, ఇతర కీలక నేతల రాక ఆలస్యమైనా.. మంత్రులు, ఇతర నేతలు ప్రసంగిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ సభా వేదిక వద్దకు చేరుకున్నాక.. సీనియర్ నేతలు వీహెచ్, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పలువురు మహిళా నేతలు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అనంతరం రాహుల్ ర్యాంప్‌పై నడుస్తూ అభివాదం చేశారు. తర్వాత ప్రసంగించారు. ఈ సమయంలో కార్యకర్తల నినాదాలతో సభాస్థలి మార్మోగిపోయింది. రాహుల్ రాక ఆలస్యం..: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 6:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు స్వాగతం పలికారు. రాహుల్ వారితో కలసి నేరుగా నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. కాసేపు వారితో భేటీ అయ్యారు. తర్వాత సాయంత్రం 7:15 గంటల సమయంలో తుక్కుగూడ సభావేదిక వద్దకు చేరుకున్నారు. సభ అనంతరం 8:30 గంటల సమయంలో శంషాబాద్‌కు వెళ్లి, ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. సభ తర్వాత సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సభ జరిగిన తీరు, లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై చర్చించినట్టు సమాచారం. న్యాయపత్రం విడుదల.. ‘ప్రత్యేక హామీలు’ వాయిదా జన జాతర సభ వేదికగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలుగులో ‘న్యాయ పత్రం’పేరిట విడుదల చేశారు. ‘మార్పు కోసం హస్తం’పేరుతో ఐదు గ్యారంటీల పత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే.. ఈ సభలోనే తెలంగాణ కోసం 23 హామీలతో రూపొందించిన ప్రత్యేక హామీలను కూడా ప్రకటించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ హామీలను త్వరలోనే తెలంగాణ ప్రజల ముందుంచుతామని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. తెల్లం వెంకట్రావు రాకపై చర్చ! జన జాతర సభ వేదికపై భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కనిపించడం చర్చకు దారితీసింది. ఆయన ఇంకా కాంగ్రెస్‌లో చేరకపోయినా.. సభా వేదికపై కూర్చోవడం గమనార్హం. ఆయనతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆసీనులయ్యారు. వెంకట్రావు, ప్రసాదరెడ్డిలను పలువురు కాంగ్రెస్ నేతలు కలసి అభినందిస్తూ కనిపించారు. -
జైల్లో చిప్పకూడు తినిపిస్తా
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కాలు విరిగిందని, అధికారం పోయిందని, కూతురు జైలుకెళ్లిందని ఇన్నాళ్లూ సంయమనం పాటించామని.. సైలెంట్‌గా ఉన్నామని ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాను జానారెడ్డి టైపు కాదని.. తప్పుడు మాటలు మాట్లాడితే అంగీ, లాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని హెచ్చరించారు. గతంలోనే తాను చెప్పినట్టు కేసీఆర్, కూతురు, అల్లుడు, కుటుంబం ఉండేట్టు అందులో డబుల్ బెడ్రూం కట్టిస్తానని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ ప్రసంగించారు. బీఆర్ఎస్తోపాటు బీజేపీపై, ఆ పార్టీల నేతలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే..‘‘ఇన్నాళ్లూ కుక్కలు మొరిగినయ్. ఇప్పుడో నక్క వచ్చింది. మొన్న సూర్యాపేటకు, నిన్న కరీంనగర్‌కు వెళ్లింది. కేసీఆర్ తననేం పీకుతారని అడుగుతున్నారు. వెంట్రుక కూడా పీకలేరని అంటున్నారు. అది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? పదేళ్లుగా రాష్ట్రాన్ని పీడించి, దోచుకున్న దొంగలు వాళ్లు. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం.. గత ఏడాది సెప్టెంబర్ 17న సోనియాగాంధీ ఇదే చోట సభలో ఆరు గ్యారంటీలిచ్చి తెలంగాణలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా దేశానికి ఐదు గ్యారంటీలను రాహుల్‌గాంధీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుంది. జూన్ 9న ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఎలా తొక్కారో.. అదే ఊపు, ఉత్సాహం, పట్టుద లతో బీజేపీని తొక్కడానికి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సభకు వచ్చారు. వైబ్రెంట్ తెలంగాణ నినాదాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తాం. మా పాలనను మీ ముందు పెట్టాం మా 100 రోజుల పాలనను మీ ముందు పెట్టాం. మేం మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమ లు చేస్తే, ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించామని అనుకుంటే మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు, అనుమతులు తెచ్చుకోవాలన్నా తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలు గెలవాలి. మోదీ.. గాంధీ కుటుంబం మధ్య పోరాటం.. విదేశాలు తిరుగుతూ గంటకో డ్రెస్ మార్చే మోదీ దేశ ప్రధాని కావాలో.. దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి చుట్టివస్తున్న రాహుల్ గాంధీ కావాలో తేల్చుకోవాలి. రాబోయేవి ఎన్నికలు కావు. పోరాటం. నరేంద్ర మోదీ కుటుంబం, గాంధీ కు టుంబం మధ్య పోరాటం. మోదీ కుటుంబంలో ఈవీఎం, ఈడీ, ఐటీ, సీబీఐ ఉన్నాయి. గాంధీ కుటుంబంలో ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీతోపా టు ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులను త్యాగం చేసిన సోనియాగాంధీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, దేశంలో దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు. నమో అంటే నమ్మితే మోసం.. రాజ్యాంగాన్ని మార్చాలనే మోదీ ప్రయత్నా లను ఆపాలంటే తెలంగాణ రాహుల్ గాంధీ వెంట నడవాలి. అసలు బీజేపీకి ఎందుకు ఓటే యాలి? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోసం చేసినందుకా? రైతులను చంపినందుకా? దేశంలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టినందుకా? హైదరాబాద్‌లో వరదలు వస్తే ఈ సిగ్గులేని కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి అయినా వరద సాయం తెచ్చారా? నమో అంటే నమ్మితే మోసం. 2024 నాటికి ప్రతిపేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని మోదీ చెప్పారు. మరి తెలంగాణలో ఎన్ని ఇళ్లు ఇచ్చా రో బీజేపీ నేతలు లెక్కచెప్పి ఓట్లడగాలి..’’ అని రేవంత్ డిమాండ్ చేశారు.