ఎంఐ 6 వచ్చేసింది..ఫీచర్స్‌
బీజింగ్‌:  బడ్జెట్‌ ధరల్లో స్మార్ట్‌ ఫోన్‌ లను లాంచ్‌  చేస్తూ ఫోన్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న  చైనా మొబైల్‌ మేకర్‌ షియోమి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది.  బీజింగ్‌ లో బుధవారం ఈ డివైస్‌ను  విడుదల చేసింది. గత కొన్ని  రోజులుగా ఊరిస్తున్న ఈ ఎంఐ 6 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.23,500గా కంపెనీ ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్‌ ఫోన్ ఫోర్‌ సైడెడ్‌ క్వర్డ్‌ 3 డీ గ్లాసెస్‌తో బ్లూ వేరియంట్‌తోపాటు సిల్వర్‌ ఎడిషన్‌లో కూడా లాంచ్‌ చేసింది. రెండు కెమెరాలను వెనుక భాగంలోను, ఫింగర్‌  ప్రింట్‌ సెన్సర్‌ను ముందుభాగంలోనూ అమర్చింది.  స్ప్లాష్  రెసిస్టెంట్‌ గా అందుబాటులోకి తీసుకొచ్చిన  ఈ   కొత్త డివైస్‌లో ప్రపంచంలో అతి చిన్న   10 ఎన్‌ఎం ప్రాసెసర్‌  అమర్చినట్టు తెలిపింది.

ఎంఐ 6 ఫీచర్స్‌

ఆండ్రాయిడ్‌ 6.0 మార్షమల్లౌ

5.15 అంగుళాల ఫుల్‌ హెచ్‌ డీ డిస్‌ప్లే

క్వాల్కం  లేటెస్ట్‌ ప్రాసెసర్‌

6 జీబీ  ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్

6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్

డ్యుయల్‌ కెమెరా, డ్యుయల్‌ స్పీకర్స్‌

3350 ఎంఏహెచ్‌ బ్యాటరీ

కాగా డిస్‌ప్లే విత్‌ ఐ కేర్‌ అని  షియామి చెబుతున్న తాజా స్మార్ట్‌ఫోన్‌ శాంసంగ్‌ గెలాక్సీ 8,  ఐ ఫోన్‌ 7లకు గట్టి పోటీలే ఇవ్వనుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.  

 

Back to Top