షావోమి కొత్త బ్రాండు తొలి స్మార్ట్‌ఫోన్‌ అదే!

షావోమి కొత్త బ్రాండు తొలి స్మార్ట్‌ఫోన్‌ అదే!

టెక్నాలజీ ఇండస్ట్రీకి షావోమి ఇవ్వబోతున్న బిగ్‌ సర్‌ప్రైజ్‌ పేరేమిటో తెలిసిపోయింది. 'ల్యాన్‌మి' పేరుతో షావోమి కొత్త సబ్‌-బ్రాండు మార్కెట్లోకి రాబోతుందని తాజా లీకేజీలు చెబుతున్నాయి. 'ల్యాన్‌మి' బ్రాండు కింద తొలి స్మార్ట్‌ఫోన్‌ షావోమి 5ఎక్స్‌ను కంపెనీ త్వరలో లాంచ్‌చేయబోతుందట. ఈ ఫోన్‌ ఎక్కువగా ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకుని వినియోగదారుల ముందుకు రాబోతుంది. చైనీస్‌ వెబ్‌సైట్‌ మైడ్రైవర్స్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెషిఫికేషన్లను లీక్‌ చేసింది. ఈ వెబ్‌సైట్‌ రిపోర్టు ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్లోకి వస్తోందని తెలుస్తోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌ ఈ డివైజ్‌ కలిగి ఉండబోతుందట. ముందస్తు రూమర్లు కూడా షావోమి కొత్త బ్రాండులో కొత్త ఫోన్‌ రూపొందిస్తుందని, దాని పేరు షావోమి ఎక్స్‌1 లేదా ల్యాన్‌మి ఎక్స్‌1 కావొచ్చని తెలిపాయి. 

 

మైడ్రైవర్స్‌ తాజా రిపోర్టుల ప్రకారం షావోమి కొత్త డివైజ్‌ వివిధ వేరియంట్లలో వస్తుందని, ప్రీమియం వేరియంట్‌ స్నాప్‌డ్రాగన్‌ 660 చిప్‌సెట్‌ను, 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంటుందట. 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం, 12 ఎంపీ సెన్సార్లతో రెండు రియర్‌ డ్యూయల్‌ కెమెరాలు, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌ మిగతా ఫీచర్లుగా తెలుస్తున్నాయి. జూలై 26నే కొత్త బ్రాండులో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తుందని మైడ్రైవర్‌ పేర్కొంటోంది. దీని ధర కూడా భారత కరెన్సీలో సుమారు రూ.20వేలుగా ఉంటుందట. ఒకవేళ ఈ డివైజ్‌ గురించి వచ్చే వారాల్లో షావోమి ధృవీకరిస్తే, మిగతా ఫీచర్లు కూడా తెలిసే అవకాశముంది. షావోమి కొత్త సబ్‌బ్రాండు, వివో, ఓప్పోలకు చెక్‌ పెట్టేందుకు వస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు ఆఫ్‌లైన్‌ మార్కెట్లో ముఖ్యంగా చైనాలో మంచి స్థానం ఉంది. షావోమికి ప్రస్తుతం ఆన్‌లైన్‌గానే మంచి మార్కెట్‌ ఉంది. షావోమి మరో కొత్త ఫోన్‌ ఎంఐ మ్యాక్స్‌2ను మంగళవారం భారత మార్కెట్లో ఆవిష్కరిస్తోంది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో ఇది వస్తోంది. దీని ధర రూ.17,999గా ఉండబోతుందని అంచనా.
Back to Top