వాట్సాప్ ఆ ఫీచర్ ఆండ్రాయిడ్స్ లోకి వచ్చేసింది

వాట్సాప్ ఆ ఫీచర్ ఆండ్రాయిడ్స్ లోకి వచ్చేసింది - Sakshi

వాట్సాప్ కొత్త ఫీచర్.. పిన్ చాట్స్ ఫీచర్ ఆండ్రాయిడ్స్ కు వచ్చేసింది. ఎట్టకేలకు వాట్సాప్ ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బీటా యూజర్లకు ఈ నెల మొదట్లోనే ఈ ఫీచర్ ను వాట్సాప్ లాంచ్ చేసింది. ఈ పిన్ చాట్ ఫీచర్ తో ఫేవరెట్ ఛాట్స్ ను టాప్ లో పిన్ చేసుకుని ఉంచుకునేందుకు అవకాశముంటుంది.

 

ఈ కొత్త ఫీచర్ తో మూడు అత్యంత ముఖ్యమైన గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్స్ ను టాప్ లో పిన్ చేసుకోవచ్చు. దీంతో లాంగ్ లిస్టు సంభాషణను యూజర్లు ఎలాంటి స్క్రోలింగ్ చేయాల్సినవసరముండదు. అంటే ఆ తరువాత ఎన్ని కొత్త చాట్ లు మొదలైనా.. కొత్తగా ఎన్ని మెసేజిలు వచ్చినా పిన్ చేసిన గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్సే టాప్ లో ఉంటాయి.

 

 

టాప్ లో పిన్ చేసుకోవాలనుకున్న చాట్ కోసం.. వాట్సాప్ యూజర్లు, అప్లికేషన్ ను ఓపెన్ చేసి, పిన్ చేయాలనుకున్న చాట్ ను హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేసిన చాట్ కు పైన కుడివైపు డిలీట్, మ్యూట్, ఆర్చివ్ ఆప్షన్ల పక్కన ఇక నుంచి టాప్ లో పిన్ ఐకాన్ కూడా కనిపించనుంది. పిన్ ఐకాన్ క్లిక్ చేస్తే చాట్ టాప్ లో పిన్ అవుతోంది.  మూడే పిన్ చేసుకునే చాన్సుండడంతో కొత్తగా పిన్ చేయాలంటే పాతవి అన్ పిన్ చేయాలి. 

 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top