ఈ ఫోన్‌ తొలిరోజే దుమ్మురేపింది

ఈ ఫోన్‌ తొలిరోజే దుమ్మురేపింది

అదిరిపోయే ఫీచర్లతో మోటో ఈ4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ జూలై 12న మార్కెట్లోకి లాంచ్‌ అయిన  సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తొలిరోజే దుమ్మురేపింది. ఎక్స్‌క్లూజివ్‌ పార్టనర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే లక్షకు పైగా యూనిట్ల అమ్మకాలను నమోదుచేసింది. తొలి 60 నిమిషాల్లో నిమిషానికి 580 యూనిట్లకు పైగా మోటో ఈ4 ప్లస్‌ అమ్ముడుపోయినట్టు ఫ్లిప్‌కార్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రకటించారు. ఉత్తర భారత దేశ నగరాల నుంచి ఈ ఫోన్‌కు భారీ ఎత్తున్న డిమాండ్‌ వచ్చినట్టు కూడా ఫ్లిప్‌కార్ట్‌ చెప్పింది. మొత్తం అమ్మకాల్లో యూపీ, బిహార్‌ రాష్ట్రాల నుంచి 12 శాతం నమోదైనట్టు తెలిపింది. అంతేకాక మోటో ఈ4 ప్లస్‌ లైవ్‌గా లాంచ్‌ అయ్యేటప్పుడు కేవలం గంటల్లోనే ఈ  ప్రొడక్ట్‌ పేజీని 1.5 లక్షల మంది కస్టమర్లు విజిట్‌ చేసినట్టు తెలిసింది. 9,999 రూపాయలకు మోటో ఈ4 ప్లస్‌ మార్కెట్లోకి లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ లాంచింగ్‌తో పాటు పలు ఆఫర్లను కూడా కంపెనీ తీసుకొచ్చింది. 

 

లాంచింగ్‌ ప్రత్యేక ఆఫర్లు

మోటో హెడ్‌ఫోన్స్‌ పై రూ .649డిస్కౌంట్‌  

హాట్‌స్టార్‌ ​యాప్‌ ప్రీమియం సేవలు 2 నెలల పాటు ఉచితం

ఐడియా సెల్యులార్ వినియోగదారులకు రూ. 443 రీఛార్జిపై 3 నెలల పాటు 84జజీబీ డేటాను పొందవచ్చు. 

దీనితో పాటు ఈ ఫోన్‌ను పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్‌లో కొనుగోలుచేస్తే రూ. 9,000వరకు ధర తగ్గుతుంది. 

రూ.4వేల బై బ్యాక్‌ గ్యారంటీ ఆఫర్‌

రిలయన్స్‌జియో ప్రైమ్‌ కస్టమర్లు 4జీబీ  30జీబీ అదనపు డేటా

 

మోటో ఈ4 ప్ల‌స్‌ ఫీచర్లు

5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,

720 x 1280 పిక్సెల్స్‌ రిజ‌ల్యూష‌న్

ఆండ్రాయిడ్ 7.1.1 నోగ‌ట్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌,

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,

 2/3 జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్

128జీబీ వరకు విస్తరణ మెమరీ

13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్

5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
Back to Top