అత్యంత ఖరీదైన నోకియా ఫోన్‌ వచ్చేస్తోంది

అత్యంత ఖరీదైన నోకియా ఫోన్‌ వచ్చేస్తోంది

నోకియా బ్రాండులో హెచ్‌ఎండీ గ్లోబల్‌ లాంచ్‌ చేస్తున్న అత్యంత ఖరీదైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ త్వరలో మార్కెట్లోకి వచ్చేస్తోంది. నోకియా 8 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 40వేల రూపాయలకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఈ నెల 31న గ్లోబల్‌గా లాంచ్‌ చేయబోతుందట. హెచ్‌ఎండీ కొత్తగా లాంచ్‌ చేయబోతున్న ఫ్లాగ్‌షిప్‌ డివైజ్‌ల గురించి ఇప్పటికే మార్కెట్లో పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నోకియా 8 లేదా నోకియా 9 ఫ్లాగ్‌షిప్‌ను కంపెనీ లాంచ్‌ చేస్తుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తాజాగా జర్మన్‌ వెబ్‌సైట్‌ విడుదల చేసిన రిపోర్టులో నో​కియా బ్రాండులో తర్వాత రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8గా తెలిసింది.

 

ఈ డివైజ్‌ మోడల్‌ నెంబర్‌ టీఏ-1004గా జర్మన్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. అదనంగా ఈ ఫోన్‌ జూలై 31 నుంచి విక్రయానికి రానుందని కూడా చెప్పింది. ఇదే సమయంలో నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ గురించి ఊసైన ఎత్తలేదు. అదేవిధంగా నోకియా 8 ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో 40వేల రూపాయలుగా ఉండబోతుందని తెలిపింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ కూడా తమ తొలి హైఎండ్‌ ఫోన్‌ లాంచ్‌ చేయాలని నిర్ణయించిందని తెలిసింది. అది నోకియా 8గా మార్కెటింగ్‌ కూడా చేస్తుందట. 

 

నోకియా 8లో ఉండబోతుందన్న ఫీచర్లేమిటో ఓ సారి తెలుసుకుందాం...

స్నాప్‌ డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌

4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

డ్యూయల్‌ సిమ్‌ కార్డులు 

నాలుగు రంగులు(బ్లూ, స్టీల్‌, గోల్డ్‌/బ్లూ, గోల్డ్‌/కాపర్‌)

అంచనా ధర రూ.43,415

ఇటీవలే కంపెనీ ఎక్స్‌క్లూజివ్‌ పార్టనర్‌షిప్‌ జర్మన్‌ ఆప్టిక్స్‌ జీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఫేమస్‌ జీస్‌ లెన్స్‌ ఉండబోతున్నాయి. 
Back to Top