ఎల్‌జీ వీ30, వీ30+ ధరలు లీక్‌

ఎల్‌జీ వీ30, వీ30+ ధరలు లీక్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఎల్‌జీ తన ఫ్లాగ్‌షిప్‌ వీ30, వీ30+ స్మార్ట్‌ఫోన్లను ఐఎఫ్‌ఏ 2017లో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటి ధరలను కంపెనీ వెల్లడించలేదు. తన స్వదేశం దక్షిణ కొరియాలో వీ30 స్మార్ట్‌ఫోన్‌ రేపటి నుంచి(గురువారం నుంచి) ప్రీ-ఆర్డర్‌కు రానుంది. ఈ సందర్భంగా వీ30 స్మార్ట్‌ఫోన్‌, వీ30+ వేరియంట్‌ ధరలు లీకయ్యాయి.

 

వీ30 స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు 949,300 కేఆర్‌డబ్ల్యూ అని తెలిసింది. అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 53,800 రూపాయలు. అదేవిధంగా ఎక్కువ స్టోరేజ్‌తో వచ్చిన వీ30+ వేరియంట్‌ ధర 998,800 కేఆర్‌డబ్ల్యూ. అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 56,600 అని తెలిసింది. 

 

ప్రీ-ఆర్డర్‌కు రాబోతున్న వీ30 స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ 21 నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తోంది. ఈ ఫోన్‌ను రిజర్వేషన్‌ చేసుకున్న కస్టమర్లు, గూగుల్‌ డేడ్రీమ్‌ వీఆర్‌ హెడ్‌సెట్‌ను డిస్కౌంట్‌లో పొందవచ్చని కంపెనీ పేర్కొంది.    

 

ఎల్‌జీ వీ30 ఫీచర్లు..

6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే

2880 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

 గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌

 ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌

 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌

వీ30+ స్మార్ట్‌ఫోన్‌లో 128జీబీ స్టోరేజ్‌

 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌ 

16, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా 

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్‌, 4జీ వీవోఎల్‌టీఈ

3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్‌
Tags: 
Back to Top