ఎల్జీ వీ20 ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్

ఎల్జీ వీ20 ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ భారత్ మార్కెట్లోలోకి ప్రవేశించి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకుంది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి కానుకగా...ఎల్జీ భారత వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. 'సెలబ్రేటింగ్ టుగెథర్నెస్' క్యాంపెయిన్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్లో భాగంగా సరికొత్త ఆండ్రాయిడ్ నోగట్ 7.0తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఎల్జీ వీ20పై 20 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ 54,999 రూపాయలకు లాంచ్ చేసింది.

 

ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్లైన్ స్టోర్లలలో రూ.44,990 ధరకు అందుబాటులో ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో 39,990కే అందుబాటులో ఉంది. వీ20 స్మార్ట్‌ఫోన్‌పై ప్రకటించిన ఈ ఆఫర్ గడువు మే 31 ముగియనుంది. 5.7 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ క్వాంటమ్ డిస్ప్లే, సెకండరీ డిస్ప్లే, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 16ఎంపీ, 8ఎంపీలతో రెండు వెనుక కెమెరాలు, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా దీనిలో ఫీచర్లు. ఒక్క ఎల్జీ వీ20 స్మార్ట్ ఫోన్‌పైనే కాక, కంపెనీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, మైక్రోవేవ్ ఓవెన్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ కండీషనర్లపై కూడా కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. కంపెనీ అన్ని ఉత్పత్తులపైనా 20వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్, సలుభతరమైన ఈఎంఐ ఆప్షన్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్ బ్యాక్లను  ఎల్జీ ప్రకటించింది. 
Back to Top