ఎల్‌జీ క్యూ6 ప్లస్‌ లాంచ్‌..


సాక్షి, ముంబై:  ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల  సంస్థ ఎల్‌ జీ మరో కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  క్యూ 6 సిరీస్‌కు కొనసాగింపుగా క్యూ 6 ప్లస్‌ పేరుతో కొత్త మొబైల్‌ను  విడుదల చేసింది.  అన్ని రీటైల్‌ స్టోర్లలో  దీని ధర రూ. 17,990గా ఉంది.  4జీబీర్యామ్‌, 64జీబీ  స్టోరేజ్‌ ఆప్షన్‌తో  ఆస్ట్రో బ్లాక్ , ఐస్ ప్లాటినం కలర్స్‌లో లభ్యం. క్యూ 6 ప్లస్‌ లాంచింగ్‌  తో ఎల్‌జీ కూడా రూ. 15వేలకు పైనధర పలికే స్మార్ట్‌ఫోన్‌ జాబితాలో  చేరిపోయింది.

ఎల్‌జీ క్యూ 6ప్లస్‌  ఫీచర్లు

5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే

ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టం

క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 435 చిప్‌సెట్‌

4జీబీర్యామ్‌

64జీబీ  స్టోరేజ్‌

13 ఎంపీ రియర్‌ కెమెరా

5  ఎంపీ సెల్ఫీ కెమెరా

3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Back to Top