లెనోవో కె8ప్లస్‌ కొత్త వేరియంట్‌...డిస్కౌంట్‌


సాక్షి, ముంబై:  చైనా మొబైల్‌ ఉత్పత్తిదారు లెనోవో కె 8 ప్లస్‌ లో కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేసింది.  ఇటీవల లాంచ్‌ చేసిన  లెనోవో కె 8 ప్లస్‌ లో 4 జీబీ వేరియంట్‌ను శుక్రవారం విడుదల చేసింది.   దీని ధర రూ.11,999గా కంపెనీ ప్రకటించింది. ఇ-కామర్స్ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకంగా లభించనుంది.ఈ సందర్భంగా  లాంచింగ్‌ ఆఫర‍్లను కూడా కంపెనీ ప్రకటించింది.  ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌ లో వెయ్యి రూపాయల డిస్కౌంట్‌ అందిస్తోంది.  దీంతోపాటు రూ.10వేల దాకా ఎక్సేంజ్‌ ఆఫర్‌కూడా  అందుబాటులో ఉంచింది.లెనోవో కె8 ప్లస్ ఫీచర్లు

5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే

మీడియా టెక్ డాక్ హెలియో పీ25 ఆక్టా కోర్ 2.6  ప్రాసెసర్

ఆండ్రాయిడ్‌ 7.1.1

4జీబీ ర్యామ్‌,

32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం

13ఎంపీ+ 5ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరాలు

8 ఎంపీ సెల్ఫీ  కెమెరా

4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Back to Top