ఆరు రూపాయలకే అపరిమిత డేటా

ఆరు రూపాయలకే అపరిమిత డేటా

ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో వొడాఫోన్ ఇటీవల ఆఫర్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఇండియా మళ్లీ సరికొత్త ఆఫర్ ను లాంచ్ చేసింది.  ఆ ఆఫర్ తో గంటకు తక్కువ ధర ఆరు రూపాయలతో అపరిమిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. సూపర్ నైట్ పేరుతో ఈ ఆఫర్ ను వొడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు లాంచ్ చేసింది. దీనిలో భాగంగా 29 రూపాయలతో అపరిమిత 3జీ/4జీ డేటా వాడకాన్ని, డౌన్ లోడ్స్ ను ఐదు గంటల పాటు వినియోగించుకోవచ్చు.రోజుల్లో ఏ సమయంలోనైనా ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్ కేవలం రాత్రి 1 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నేడు వొడాఫోన్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. '' వొడాఫోన్ సూపర్ నైట్ రిపీట్ గా కొనుగోలు చేస్తూ.. కస్టమర్లు అపరిమితంతో ప్రతి రాత్రి సూపర్ రాత్రిగా అనుభూతి పొందండి. గంటకు కేవలం ఆరు రూపాయలతో డేటాను ఎంజాయ్ చేయండి'' అని వొడాఫోన్ పేర్కొంది.

 

ఈ వినూత్న ప్రొడక్ట్ ను లాంచ్ చేసిన తర్వాత మాట్లాడిన వొడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సందీప్ కటారియా.. సూపర్ అంబ్రిలా కింద తమ కస్టమర్లకు వొడాఫోన్ నైట్ తీసుకురావడం తాము చాలా సంతోషిస్తున్నామని, అన్ని ఇతర సూపర్ ప్రొడక్ట్ లాగానే, ఇంటర్నెట్ వాడకానికి ఉన్న ధర అడ్డంకులను ఇది తొలగిస్తుందని పేర్కొన్నారు. నేటి యువత జీవనంలో మొబైల్ ఫోన్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.  ఈ సూపర్ నైట్ ప్యాక్స్ తో నామమాత్ర ధరలతో ఐదు గంటల పాటు ఎంత కావాలంటే అంత డేటా డౌనో లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

 

సూపర్ నైట్ పై అందించే అపరిమిత డేటాతో వొడాఫోన్ ప్లే నుంచి విభిన్నమైన కంటెంట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని కూడా పేర్కొంది. డిజిటల్ చానల్స్, రిటైల్ టచ్ పాయింట్ల నుంచి ఈ సూపర్ నైట్ ప్యాక్ లను కస్టమర్లు కొనుగోలు చేసుకోవచ్చు లేదా  *444*4# డయల్ చేసి కూడా కస్టమర్లు ఈ ప్యాక్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. వొడాఫోన్ సూపర్ నెట్ తో కనెక్ట్ అయిన వెంటనే ఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. జియో కూడా రూ.19 ప్యాక్ ను ఆఫర్ చేస్తోంది. దీనికి గట్టి పోటీగా వొడాఫోన్ ఈ ఆఫర్ ను లాంచ్ చేసింది. 
Back to Top