ఐఫోన్ల ధరల భారీ తగ్గింపు


సాక్షి, న్యూఢిల్లీ:  ఐఫోన్ల ధరల్లో  కోత పెడుతూ  స్మార్ట్‌ఫోన​ దిగ్గజం ఆపిల్‌  పాత సంప్రదాయాన్ని కొనసాగించింది.  తాజాగా  ఐఫోన్ X , ఐఫోన్ 8 మోడళ్ల  ప్రారంభం అనంతరం పాత ఐఫోన్ మోడళ్ల ధరలను అమెరికా, ఇండియాలోనూ తగ్గించింది.  


సాధారణంగా కొత్త ఐఫోన్ లాంచింగ్‌ తరువాత  ఐఫోన్లనుడిస్కౌంట్‌ ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రావడం ఆపిల్‌ ఆనవాయితీగా మార్చుకుంది.  భారతదేశంలో  ఐఫోన్ 6 , ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 7 ,  ఐఫోన్ 7 ప్లస్ ధరలను తగ్గించింది.   దాదాపు రూ. 7 వేల దాకా   కోత పెట్టింది.  వీటితోపాటు అమెరికాలో ఐఫోన్  ఎస్‌ఈ  స్మార్ట్‌ఫోన్‌పై 50డాలర్ల  తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది.

ఐ ఫోన్‌ 6 ఎస్‌ 32 జీబీ స్టోరేజ్‌, 128జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌  ధరలు వరుసగా రూ. 46,900, రూ. 55,900 ఉండగా ప్రస్తుతం  రూ. 40వేలు, రూ.49వేలకే  లభించనుంది.  6ఎస్‌ప్లస్‌ 32జీబీ, 128జీబీస్టోరేజ్‌ ధరలు ప్రస్తుత తగ్గింపు అనంతరం రూ. 49వేలు, రూ.58వేలుగా ఉండనున్నాయి. వీటి   అసలుధర 32 జీబీ రూ.56,100, రూ. 65, 100లు. ఐ ఫోన్‌ 7  32 జీబీ వేరియంట్‌ పై రూ.6 వేల తగ్గింపు తరువాత రూ.49 వేలకు లభ్యం.  128 జీబీ వేరియంట్‌ రూ.58వేలకు అందుబాటులోఉంది. ఐఫోన్‌ 7 ప్లస్‌ 32 జీబీ వేరియంట్‌పై రూ.8300 వరకు తగ్గింపు తర్వాత రూ. 59వేలకు లభ్యమవుతోంది.  అదే 128 జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ఫై రూ.8200తగ్గింపుతో రూ.68వేలకు ఆఫర్‌ చేస్తోంది.


అయితే అమెరికాలో ఎస్‌ఈ మోడల్‌ ధరపై  దాదాపు 3వేల దాకా తగ్గించిన ఆపిల్‌ ఇండియాలో మాత్రం   ఎలాంటి తగ్గింపు ప్రకటించకుండా యథాతథరేట్లను కొనసాగించేందుకు నిర్ణయించింది. ఐ ఫోన్‌  ఎస్‌ఈ 32జీబీ,  128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలు వరుసగారూ. 26,000,  రూ. 35,000 గా  ఉంటాయి.

Back to Top