సరసమైన ధరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు


న్యూఢిల్లీ:
మొబైల్‌ తయారీ దిగ్గజం ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ మంగళవారం మరో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. క్లౌడ్‌ సీ1,  ఆక్వా ఎస్‌1 పేరుతో   వీటిని లాంచ్‌ చేసింది. వీటి ధరలు వరుసగా  రూ.3,499, రూ.3,999గా ఉండనున్నాయి.  ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు అమెజాన్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయని కంపెనీ తెలిపింది.  రెండు స్మార్టుఫోన్లూ, 4జీ  వోల్ట్‌ సపోర్ట్‌,  ఆండ్రాయిడ్‌ నౌగట్‌(7.0) ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తాయి. క్లౌడ్‌ సీ1 ఫీచర్లు

4 అంగుళాల డిస్‌ప్లే

2 ఎంపీ సెల్ఫీ కెమెరా

 5 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ప్లాష్‌

1.3 గిగా హెర్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌

1 జీబీ రామ్‌

8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ

1750 ఎంఏహెచ్‌ బ్యాటరీఆక్వా ఎస్‌1  ఫీచర్లు

5 అంగుళాల డిస్‌ప్లే

5 ఎంపీసెల్ఫీ కెమెరా

 5 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ప్లాష్‌

1.25 గిగా హెర్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌

1 జీబీ రామ్‌

8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ

 2300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top