సరికొత్త ఫీచర్‌తో ‘హెచ్‌టీసీ యూ’

సరికొత్త ఫీచర్‌తో  ‘హెచ్‌టీసీ యూ’ - Sakshi


తైవాన్  కన్జ్యూమర్‌  ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌టీసీ  మరికొత్త స్మార్ట్‌ఫోన్‌ తీసుకురాబోతోంది.   ఐఫోన్ 7ను మించి   ఆకట్టుకుంటున్న  హెచ్‌టీసీ  హెచ్‌టీసీ  యు  పేరుతో మరో డివైస్‌ ను మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. స్క్వీజ్‌ ఫర్‌ ద బ్రిలియంట్‌ యూ  అనే ట్యాగ్‌ లైన్‌తోమే 16 వ తేదీన లాంచ్‌ చేయనుంది.  హెచ్‌టీసీ యూని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు హెచ్‌టీసీ ప్రకటించింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో  స్క్వీజ్‌ ఫర్‌ ద బ్రిలియంట్‌ యూ అని ట్వీట్ చేసింది.  ధర, ఇతర ఫీచర్లను  మాత్రం  వెల్లడించలేదు.

అయితే  హెచ్‌టీసీ యు ని స్క్వీజబుల్‌ టచ్-సెన్సిటివ్ ఫ్రేమ్ తో  రూపొందించారట. సరికొత్తగా జోడించిన ‘ఎడ్జ్ సెన్స్'    ఫీచర్‌ ప్రధాన ఆకర్షణ గా నిలవనుందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి.  మరోవైపు ఇటీవల హెచ్‌టీసీ యు ఆల్ట్రా పేరుతో  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు కంపెనీ ఈ నెలలో ప్రకటించింది. దీని ధరను  రూ. 59,990గా ప్రకటించిన సంగతి తెలిసిందే.



 

హెచ్‌టీసీ యు

5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ ప్లే

స్నాప్‌ డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌,

ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.1ఆపరేటింగ్ సిస్టమ్‌

2560 x 1440 రిజల్యూషన్

‌4జీబీ ర్యామ్

64 జీబీ ఇంటర్నెల్‌  స్టోరేజ్‌

12 ఎంపీరియర్‌ కెమెరా,

16ఎంపీ ఫ్రంట్  కెమెరా

 3000 ఎంఏహెచ్ బ్యాటరీ



 


 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top