కొత్తకొత్తగా నోకియా 105, 130 వచ్చేశాయ్‌

కొత్తకొత్తగా నోకియా 105, 130 వచ్చేశాయ్‌

న్యూఢిల్లీ : హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా బ్రాండుకు చెందిన 105, 130 ఫీచర్‌ ఫోన్లను రీఫ్రెష్‌ మోడల్స్‌గా భారత్‌లో లాంచ్‌ చేసింది. మైక్రోసాఫ్ట్‌ బ్రాండులో తొలుత ఇవి 2015, 2014లో మార్కెట్లోకి వచ్చాయి. అనంతరం తాజాగా వీటిని రీఫ్రెష్‌గా మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది హెచ్‌ఎండీ గ్లోబల్‌. అయితే కొత్త నోకియా 130 మోడల్‌ ధర, అందుబాటులో ఉండే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. నోకియా 105ను సింగిల్‌ సిమ్‌, డ్యూయల్‌ సిమ్‌ వేరియంట్లలో 999 రూపాయలకు, 1149 రూపాయలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్‌ నీలం, తెలుపు, నలుపు రంగుల్లో జూలై 19 నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.

 

మొదటిసారి నోకియా బ్రాండులో ఓ హ్యాండ్‌సెట్‌ రూ.999కు మార్కెట్లోకి రావడం విశేషం. ఈ డివైజ్‌లను రీఫ్రెస్‌గా, కొత్త ఫీచర్లతో ఎర్గోనామిక్‌ డిజైన్‌లో లాంచ్‌ చేసినట్టు హెచ్‌ఎండీ గ్లోబల్‌ చెప్పింది. ఈ రెండు ఫీచర్‌ ఫోన్లు సిరీస్‌ 30 ప్లస్‌ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌లతో రన్‌ కానున్నాయి. నోకియా 105 ఫీచర్‌ ఫోన్‌కు స్క్రీన్‌ సైజును పెంచి, వాడుకాన్ని కూడా కంపెనీ మెరుగుపరిచింది. కొత్త ఎర్గోనామిక్‌ డిజైన్‌ను ఈ ఫోన్‌ కలిగిఉంది.   
Back to Top