జియోని స్మార్ట్‌ఫోన్‌: భారీ బ్యాటరీ, సెల్ఫీ కెమెరా

జియోని స్మార్ట్‌ఫోన్‌: భారీ బ్యాటరీ, సెల్ఫీ కెమెరా


సాక్షి, న్యూఢిల్లీ: జియోనీ ​ఇండియా  కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది. ఎక్స్‌ సిరీస్‌ను  కొనసాగించిన కంపెనీ  ఎక్స్‌ 1 ఎస్‌ పేరుతో కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది. రూ.12,999 ధరలో   బ్లాక్‌,  గోల్డ్‌ కలర్స్‌లో సెప్టెంబర్‌ 21నుంచి ఈ డివైస్‌ అందుబాటులో ఉండనుంది.  ఫింగర్‌  ప్రింట్‌ సెన్సర్‌,  అతిపెద్ద బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెప్పింది.

ఆధునిక వినియోగదారులకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా మెరుగైన   సెల్ఫీ కెమెరా, బ్యాటరీ సామర్థ్యాలను అందించే లక్ష్యంతో ఎక్స్‌ 1ఎస్‌ ను  విడుదల చేశామని బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ అలోక్ శ్రీవాస్తవ  ఒక ప్రకటనలో తెలిపారు. ఇక లాంచింగ్‌ ఆఫర్ల విషయానికి వస్తే ఎయిర్‌టెల్‌  వినియోగదారులకు వరుసగా 6 రీచార్జ్‌లకు   10 జీబీ డేటా అదనం.  ఎక్స్‌ 1 ఎస్‌ ఫీచర్లు

5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

ఆండ్రాయిడ్‌ 7.0.1 ఆపరేటింగ్‌ సిస్టం

1.5 గిగా హెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌

గొరిల్లా గ్లాస్‌ ప్రొ టెక్షన్‌ 3

 ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌  

13 ఎంపీ రియర్‌ కెమెరా

16 ఎంపీ సెల్ఫీ కెమెరా

3 జీబీ ర్యామ్‌

16 జీబీ స్టోరేజ్‌

256 వరకు విస్తరించుకునే అవకాశం

4000 ఎంఏ హెచ్‌ బ్యాటరీ సామర్ధ్యం

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top