అద్భుత ఫీచర్లతో ఆసుస్‌ ఫోన్‌, లాంచ్‌ ఆఫర్లు కూడా...

అద్భుత ఫీచర్లతో ఆసుస్‌ ఫోన్‌, లాంచ్‌ ఆఫర్లు కూడా...

గూగుల్‌ డేడ్రీమ్‌, ట్యాంగో సపోర్టుతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ ఆసుస్‌ జెన్‌ఫోన్‌ ఏఆర్‌ మార్కెట్లోకి లాంచ్‌ అయింది. న్యూఢిల్లీ ఈవెంట్‌గా గురువారం ఈ ఫోన్‌ను కంపెనీ భారత్‌లో లాంచ్‌ చేసింది. దీని ధర రూ.49,999గా కంపెనీ పేర్కొంది. బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌లో నిన్న సాయంత్రం 4 గంటల నుంచే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ అతిపెద్ద ఆకర్షణ 8జీబీ ర్యామ్‌. అంతేకాక గూగుల్‌ ట్యాంగో ఏఆర్‌ ప్లాట్‌ఫామ్‌, గూగుల్‌ డేడ్రీమ్‌ వీఆర్‌ ప్లాట్‌ఫామ్‌లను ఇది సపోర్టు చేయడం మరో ప్రత్యేకత.  

 

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ ఏఆర్‌ స్పెషిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి...

5.70 అంగుళాల క్యూహెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 4 ప్రొటెక్షన్‌

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 821 ఎస్‌ఓసీ

8జీబీ ర్యామ్‌

128జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌

2టీబీ వరకు విస్తరణకు అవకాశం

4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌,​

23 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా

8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

3300ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఆండ్రాయిడ్‌ 7.0 ఓఎస్‌

 

లాంచ్‌ ఆఫర్లు....

రూ.6,499 ఉన్న గూగుల్‌ డేడ్రీమ్‌ వ్యూ వీఆర్‌ హెడ్‌సెట్‌పై ఫ్లిప్‌కార్ట్‌ 2,500 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయనుంది. అదేవిధంగా రిలయన్స్‌ జియోకి, ఆసుస్‌కు భాగస్వామ్యం ఉన్నందున్న ఆ నెట్‌వర్క్‌ సబ్‌స్క్రైబర్లు ఈ ఫోన్‌ను కొనుగోలుచేస్తే 100జీబీ వరకు అదనపు డేటాను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. కంప్లిమెంటరీ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కల్పిస్తోంది. రూ.309తో రీఛార్జ్‌ చేసుకున్న ప్రతిసారీ అదనంగా జియో యూజర్లు 10జీబీ డేటాను పొందుతూ ఉంటారు. ఇలా 2018 మార్చి వరకు 10 రీఛార్జ్‌లపై పొందవచ్చు.  
Back to Top