గూగుల్‌ కొత్త ఓఎస్‌ వచ్చేస్తోంది..

గూగుల్‌ కొత్త ఓఎస్‌ వచ్చేస్తోంది..

మరికొన్ని రోజుల్లో గూగుల్‌ కొత్త ఓఎస్‌ 'ఆండ్రాయిడ్‌ ఓ' అధికారికంగా విడుదల కాబోతుంది. ఆగస్టు 21న ఈ ఆండ్రాయిడ్‌ ఓను విడుదల చేయనున్నట్టు లేటెస్ట్‌ టెక్నాలజీ ఆవిష్కరణలను లీక్‌చేసే వ్యక్తి ఇవాన్‌ బ్లాస్‌ ట్వీట్‌ చేశారు. ఒకవేళ ఇది ఆగస్టు 21 అధికారికంగా విడుదలైతే, పిక్సెల్‌, నెక్సల్‌ డివైజ్‌లో తొలుత దీన్ని అప్‌డేట్‌ ఉంటుందని టెక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.  ఆగస్టు 21న ఆండ్రాయిడ్‌ ఓ ను విడుదల చేస్తారని, అదేవిధంగా పేరును కూడా అదే రోజు ప్రకటిస్తారని ఆండ్రాయిడ్‌ పోలీసు మేనేజింగ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ రడ్‌రాక్‌ చెప్పారు. ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌ను కూడా గూగుల్‌ గతేడాది ఆగస్టు 22నే ఆవిష్కరించింది. అదే పంథాను అనుసరిస్తూ ఒక్క రోజు ముందుగా ఆగస్టు 21న ఆండ్రాయిడ్‌ ఓకు ముహుర్తం ఖరారు చేసినట్టు వెల్లడైంది. దీనిపేరును కూడా ఓరియోగా నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

మొత్తంగా యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచే లక్ష్యంతో, పలు మెరుగుదలను, పాలిష్‌లను, యూజర్‌ సెంట్రిక్‌ ఫీచర్లను ఆండ్రాయిడ్‌ ఓలో గూగుల్‌ తీసుకొస్తోంది. దీనిలో కీలకమైన ఫీచర్లు నోటిఫికేషన్‌ డాట్స్, పిక్చర్‌ మోడ్‌లో కొత్త పిక్చర్‌. స్మార్ట్‌ఫోన్‌లో వేరు పనిచేసుకుంటూ కూడా చిన్న విండోలో వీడియోలను చూసుకోవచ్చు. దీంతోపాటు సోషల్ నెట్వర్కింగ్‌ యాప్‌లు, జీమెయిళ్ల నోటిఫికేషన్లు కేటగిరీ ప్రకారం కనిపిస్తాయి. ఉదాహరణకు జీమెయిల్లో సాధారణ మెయిళ్ల నోటిఫికేషన్లు, ప్రయారిటీ ఇన్‌బాక్స్‌లోని మెయిళ్ల నోటిఫికేషన్లు వేర్వేరుగా కనిపిస్తాయి. మరో ఫీచర్‌ కాపీ లెస్‌, అంటే ఆండ్రాయిడ్‌ ఓలో కాపీ, పేస్ట్‌లను తేలికగా చేసుకోవచ్చు. మంచి బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ ఆల్గారిథమ్స్‌, యాప్‌ అప్టిమైజేషన్లు, మెరుగుపరిచిన బ్లూటూత్‌ ఆడియో వంటి పలు మెరుగుదులను మనం ఆండ్రాయిడ్‌ ఓలో చూడొచ్చు. 

 
Back to Top