ఎయిర్‌టెల్‌ 60జీబీ ఫ్రీ డేటా | Airtel rolls out 60GB free data offer for 6 months | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ 60జీబీ ఫ్రీ డేటా

Sep 16 2017 5:16 PM | Updated on Aug 17 2018 6:18 PM

ఎయిర్‌టెల్‌ 60జీబీ ఫ్రీ డేటా - Sakshi

ఎయిర్‌టెల్‌ 60జీబీ ఫ్రీ డేటా

ఎయిర్‌టెల్‌ తన మాన్‌సూన్‌ ఆఫర్‌ ముగియడానికి వస్తున్న క్రమంలో పోస్టు పెయిడ్‌ కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

ఎయిర్‌టెల్‌ తన మాన్‌సూన్‌ ఆఫర్‌ ముగియడానికి వస్తున్న క్రమంలో పోస్టు పెయిడ్‌ కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్తగా మరో ఉచిత డేటా ఆఫర్‌ను తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ప్లాన్‌ కింద యూజర్లు ఆరు నెలల పాటు 60జీబీ ఉచిత డేటాను పొందనున్నారు. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు తొలుత ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ను తమ ఫోన్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రక్రియ పూర్తయితే, 24 గంటల్లో ఈ ఉచిత 60జీబీ డేటా ప్రయోజనాలు యూజర్లకు క్రెడిట్‌ అవుతాయి. నెలకు 10 జీబీ చొప్పున ఆరు నెలల పాటు మొత్తం 60జీబీ డేటాను యూజర్లు పొందుతారు. ఈ ఆఫర్‌ కేవలం ఎయిర్‌టెల్‌​ పోస్టుపెయిడ్‌ కస్టమర్‌, మైఎయిర్‌టెల్‌ యాప్‌ యూజర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు మై ఎయిర్‌టెల్‌ యాప్‌ లేని వారు కూడా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా కంపెనీ సూచించింది. 
 
ఈ ఆఫర్‌ను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి....
  • తొలుత మైఎయిర్‌టెల్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి
  • ఫ్రీ డేటాను క్లయిమ్‌ చేసుకునే ప్రక్రియ బ్యానర్‌గా కనిపిస్తూ ఉంటుంది
  • ఆ బ్యానర్‌ను క్లిక్‌ చేయాలి
  • స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటిస్తూ వెళ్లాలి
  • ఎయిర్‌టెల్‌ టీవీ ఏపీకే అని వస్తుంది, దాన్ని మీ స్మార్ట్‌ఫోన్లలోకి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి
  • యూజర్లు దీన్ని విజయవంతంగా డౌన్‌లోడ్‌ చేసుకున్నాక, ఉచిత డేటా 24 గంటల్లో క్రెడిట్ అవుతుంది
 
ఈ కొత్త ఆఫర్‌ అచ్చం కొన్ని నెలల క్రితం ఎయిర్‌టెల్‌ లాంచ్‌చేసిన మాన్‌సూన్‌ ఆఫర్‌ లాంటిదే. ఎయిర్‌టెల్‌ మాన్‌సూన్‌ ఆఫర్‌ కింద, తన పోస్టుపెయిడ్‌ కస్టమర్లకు నెలకు 10జీబీ ఉచిత డేటాను కంపెనీ అందిస్తోంది. అయితే ఆ ఆఫర్‌ మూడు నెలలే వాలిడ్‌లో ఉంటే, ఈ ఆఫర్‌ ఆరు నెలల వ్యవధిలో వాలిడ్‌లో ఉంటుంది. ఎయిర్‌టెల్‌ ఆటోమేటిక్‌గా నెలకు 10జీబీ డేటాను క్రెడిట్‌చేస్తోంది. ఎయిర్‌టెల్‌ టీవీ ఆప్‌ ఇన్‌స్టాలేషన్లను పెంచడానికి ఈ ఆఫర్‌ ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement