నిజాయితీ ఉంటే ఉపఎన్నికలకు సిద్ధమవ్వు

నిజాయితీ ఉంటే ఉపఎన్నికలకు సిద్ధమవ్వు


చంద్రబాబుకు వాసిరెడ్డి పద్మ సవాల్‌సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబుకు నిజా యితీ ఉంటే ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్ధమవ్వాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సవాల్‌ విసిరారు. ఎన్నికల్లో కొందరు వెయ్యి, ఐదు వందల నోట్లు పంచి రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇలాంటి వాళ్లు ప్రజాసేవ ఎలా చేస్తారని బాబు వ్యాఖ్యలు చేయడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో పద్మ మాట్లాడు తూ.. ఓటర్లను కొనటం, వ్యవస్థల్ని మేనేజ్‌ చేసే ప్రక్రియ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, ఇందుకు ఓటుకు కోట్లు కేసు నిదర్శమన్నారు.పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 21 మందికి రూ. 31 కోట్లు చొప్పున ముడుపులు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాల్సిన అవసరం, బాధ్యతా ఉందని, పూర్తి పారదర్శకంగా ఎన్నికలకు సిద్ధమవ్వగలరా అని ప్రశ్నించారు. డిజిటల్‌ ఓటింగ్‌కు సంబంధించి ఎంతో నమ్మకంతో ఉన్నామని, డిజిటల్‌ ఎకానమీ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు డిజిటల్‌ ఓటింగ్‌కు సిఫార్సు చేయాలని డిమాండ్‌ చేశారు.

Back to Top