యశ్‌కు చుక్కెదురు

Yash Mother Petition cancellation in Courtin Renta House Case - Sakshi

అద్దె ఇంటి వివాదం  

రూ.23 లక్షల బకాయిలు చెల్లించి, ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశం  

యశ్‌ తల్లి పిటిషన్‌ కొట్టివేత   

సంచలన హిట్‌ చిత్రం కేజీఎఫ్‌ హీరో యశ్‌ కుటుంబానికి న్యాయ పోరాటంలో చుక్కెదురైంది. అద్దె ఇంటి మరమ్మతుకు చేసిన రూ.12.50 లక్షలను బాడుగ కింద పరిగణించాలన్న యశ్‌ తల్లి పుష్ప పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సినీ పరిశ్రమలోని కొందరు పెద్దల కుట్ర వల్లే వివాదం ఇంత రచ్చకెక్కిందని పుష్ప ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.  

కర్ణాటక, యశవంతపుర:   హైకోర్టు ఆదేశాల ప్రకారం యజమానికి బాడుగ చెల్లించి ఇంటిని ఖాళీ చేయాలని ప్రముఖ నటుడు యశ్‌ కుటుంబం నిర్ణయించింది. 2015 నుంచి బాకీ పడిన అద్దె రూ.23 లక్షలను చెల్లించటానికి యశ్‌ సిద్ధమయ్యారు. ఇందులో మధ్యవర్తుల ద్వారా కొంత మొత్తం తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. బనశంకరి మూడవస్టేజీలోని ఆరవ బ్లాక్‌లో యశ్‌ కుటుంబం బాడుగ ఇంటిలో ఉంటోంది. బాకీ పడిన బాడుగను చెల్లించి ఇంటినీ ఖాళీ చేయాలని ఇంటి యజమానులు మునిప్రసాద్, వనజా దంపతులు.. యశ్‌ కుటుంబాన్ని కోరారు. అయితే బాడుగ ఇవ్వకుండా, ఖాళీ చేయకుండా యశ్‌ తల్లి ఎ.పుష్ప ఉండిపోయారనియజమానులు ఆరోపిస్తున్నారు.

 హైకోర్టు సూటి ప్రశ్న  
 ఇంటిని మరమ్మతు చేయించిన ఖర్చును బాడుగలో లెక్కించాలని యశ్‌ కుటుంబం హైకోర్టులో అర్జీ వేసింది. కేసును విచారించిన హైకోర్ట్‌ ధర్మాసనం బాడుగ ఇవ్వకుండా, ఖాళీ చేయకుండా ఎలా ఉంటారని యశ్‌ కుటుంబాన్ని ప్రశ్నించింది. అద్దె బకాయిలను చెల్లించి మార్చి లోపు ఇంటిని ఖాళీ చేయాలని యశ్‌ తల్లికి గడువు ఇచ్చింది. అద్దెను డిడి రూపంలో యజమానుల పేరుతో ఉమ్మడిగా చెల్లించి మార్చి 31లోపు ఖాళీ చేయాలని స్పష్టంచేసింది. కోర్టు ఆదేశాల మేరకు రూ.23 లక్షలను చెల్లించటానికి యశ్‌ తల్లి అంగీకరించారు. 2010 నుండి నెలకు రూ.40 వేలు చొప్పున బాడుగకు యశ్‌ కుటుంబం అక్కడ నివాసముంటోంది.  

2015 నుంచి వివాదం  
 2015లో ఇంటిని ఖాళీ చేయాలని యజమాని యశ్‌ కుటుంబాన్ని కోరారు. ఖాళీ చేయకపోవటంతో వారు బెంగళూరు సివిల్‌ కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్ట్‌ ప్రతి 11 నెలలకు ఒకసారి 5 శాతం అద్దెను పెంచి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంటి రిపేరీకి రూ.12.50 లక్షల సొంత డబ్బును ఖర్చు చేశామని, దానిని బాడుగలోకి లెక్కించాలని యశ్‌ తల్లీ పుష్ప వాదించారు. కోర్టు పాత ఆదేశాలనే మళ్లీ జారీచేయడంతో దీనిని సవాల్‌ చేస్తూ పుష్ప హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ ఎఎస్‌ బోపణ్ణ, శ్రీనివాస హరీశ్‌కుమార్‌లతో కూడిన న్యాయపీఠం అమె పిటిషన్‌ను కొట్టివేసింది. 2019 మార్చి 31లోపు 9 శాతం వడ్డీతో బాడుగను చెల్లించి ఖాళీ చేయాలని స్పష్టంచేసింది. దీంతో యశ్‌ కుటుంబం కోర్టు బయట పరిష్కారానికి ఆలోచించారు.  

ఇది కొందరు పెద్దల కుట్ర: పుష్ప  
బాడుగపై మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకుంటా మని యశ్‌ తల్లి పుష్ప తెలిపారు. ఈ వివాదం పెద్ద ది కావడం వెనుక చిత్రరంగానికి చెందిన పెద్దల ప్ర మేయం ఉందని అమె ఆవేదన వ్యక్తం చేశారు. సిని మా రంగంలో ఇంత దిగజారుడుగా వ్యవహరిస్తారనుకోలేదని అన్నారు. ఇంటి యజమానులతో సత్స ంబంధాలు ఉన్నాయని,  మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top