అమెరికా అమ్మాయి... తమిళ అబ్బాయి

Tamil Man Marriage With American Woman In Tamil Nadu - Sakshi

అన్నానగర్‌:  అమెరికా అమ్మాయితో తమిళ అబ్బాయికి సాంప్రదాయబద్ధంగా వివాహమైంది. వారి వివాహం తమిళనాడులోని అరూర్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. అమెరికా మహిళా డాక్టర్‌ను ఉత్తంగరై ఇంజినీర్‌ తమిళ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై సమీపంలో బావక్కల్‌ గ్రామానికి చెందిన షన్భుగం చెన్నై అన్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య రేణుకాదేవి.

ఈ దంపతుల కుమారుడు తిరునావుక్కరసు అమెరికాలో ఆరేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అదేవిధంగా అమెరికాకు చెందిన డాక్టర్‌ కల్లకర్‌ కుమార్తె ఎలిజబెత్‌ డాక్టర్‌. ఆమెతో తిరునావుక్కరసు మూడేళ్ల క్రితం ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమకు రెండు కుటుంబాల అంగీకారం తెలిపారు. దీంతో వారు తమిళ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం ఎలిజబెత్‌ కుటుంబంతో సహా తమిళనాడు వచ్చారు. సోమవారం సాయంత్రం అరూర్‌లో ఉత్తంగరై రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో ఎలిజబెత్, తిరునావుక్కరసు వివాహం తమిళ సంప్రదాయం ప్రకారం జరిగింది. పెద్దల సమక్షంలో వధూవరులు ఒక్కటయ్యారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top