ప్రాణం ఖరీదు?

Suicide Cases Hikes In Karnataka - Sakshi

ఉద్యాననగరిలో ఆత్మహత్యలపర్వం ఏటా 2 వేల వరకూ నమోదు

సమస్యలను ఎదుర్కోలేక పలాయనమా?

కౌన్సెలింగ్‌తో సత్ఫలితాలు

అదొక బహుళ అంతస్తుల ఐటీ సంస్థ ఆఫీసు. 12వ అంతస్తు నుంచి ఒక యువకుడు కిందికి దూకేశాడు. క్షణాల్లో మరణం. మరో ఘటనలో..భార్యాభర్తలు ఉన్నతోద్యోగులు. కుటుంబ కలహాలను తట్టుకోలేక భర్త ఉరివేసుకున్నాడు. ఇలా బెంగళూరులో ప్రతిఏటా సగటున 2 వేల మంది వరకూ ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, ఇందులో 600 మందికిపైగా మహిళలు ఉంటున్నారు. తమిళ రాజధాని చెన్నై తరువాత బెంగళూరు అత్యధిక ఆత్మహత్యలతో దేశంలో రెండవస్థానంలో నిలుస్తోంది. అందరూ ఇష్టపడే ఉద్యాననగరి ఆత్మహత్యల రాజధానిగా మారబోతోందా? అనే భయం వ్యాపిస్తోంది. మామూలు కారణాలకే ప్రాణాలు తీసుకోవడం పరిపాటిగా మారుతోంది. దీనికి అంతం పలకాల్సిన సమయం వచ్చింది.

బొమ్మనహళ్లి: నగర జీవనం కొందరికి స్వర్గతుల్యమైతే, మరికొందరికి నరకప్రాయంగా మారుతోంది. ఇది బలవన్మరణాలకు దారి తీస్తోంది. సగటున రోజుకు ఆరుమంది ప్రాణాలు తీసుఉం టున్నారు.దీనికి కారణాలను అన్వేషిస్తే ప్రేమ, స హజీవనం వైఫల్యాలే ప్రధానంగా కనిపిస్తున్నా యి.చదువులో వెనుకబాటు, పరీక్షల్లో తప్పుతా మోననే భయం,సంపన్నుల కుటుంబాల్లో సంక్షోభాలు తదితరాలే ఎక్కువమంది యువతీ యువకులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని మానసికనిపుణులు,ఫ్యామిలీ కౌన్సెలర్లు చెబుతున్నారు. ఇటువంటి బలవన్మరణాలను నిరోధించడానికి నగరంలో అనేక హెల్ప్‌లెన్లు ఉన్నా, బాధితుల్లో ఎ క్కువమంది వాటిని సంప్రదించ లేకపోతున్నారు.

కౌన్సెలింగ్‌ తీసుకోవడం తప్పేం కాదు
నగరంలోని సహాయ్‌ అనే హెల్ప్‌లైన్‌కు ఇలాంటి కేసులు నెలకు కనీసం నాలుగైదు వస్తున్నాయి. తమను సంప్రదించేటప్పుడు బాధితులు దాదాపుగా ఏడుస్తుంటారని, తమ సహాయం కోరే వారి సంఖ్య పెరుగుతుండడం నిజంగా మంచి పరిణామమని సహాయ్‌ సమన్వయకర్త పహ్లాజని తెలిపారు. ఒకసారి తమను సంప్రదిస్తే, తామిచ్చే సలహాల వల్ల తదనంతరం బాధితులు  ఆత్మహత్య గురించి ఆలోచనే చేయబోరని చెప్పారు.  నగరంలోని కోరమంగళ, ఇందిరా నగర, ఫ్రేజర్‌ టౌన్, నిమ్‌హాన్స్, జయనగర నాలుగో బ్లాకులలో హెల్ప్‌లైన్లు ఉన్నాయి.

కాలేజీల్లోనూ సహాయం
సహజీవన సంబంధాల వైఫల్యం వల్ల యువతీ యువకులు దాదాపుగా సమాన సంఖ్యలో హైల్ప్‌లైన్ల సహాయాన్ని అర్థిస్తున్నారు. నగరంలో చాలా కళాశాలలు తమ ప్రాంగణాల్లోనే కౌన్సెలర్లను నియమించాయి. ప్రేమ వైఫల్యం, ఇళ్లలో లైంగిక వేధింపులకు గురైన వారే ఎక్కువగా ఆత్మహత్యల గురించి ఆలోచిస్తున్నట్లు తమ దష్టికి వచ్చిందని ఓ ప్రముఖ కళాశాలలోని కౌన్సెలర్‌ తెలిపారు.18–21 ఏళ్ల యువతులు ఒత్తిడి తట్టుకోలేక తమ వద్దకు వస్తుంటారని చెప్పారు. తమ కుటుం బంలోనే లైంగిక వేధింపులకు గురవుతున్న వారు తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించినప్పుడు, వారు పిల్లలకు అండగా నిలవడం లేదని కూడా తెలి పారు. ఈ పోకడ మారాల్సి ఉం దని అభిప్రాయపడ్డారు. ఇలా లైంగిక వేధింపుల కు గురవుతున్న బాల బాలికలు ఎక్కువగా ఉన్నత కుటుంబాలకు చెందిన వారు కావడం గమనార్హం.వివిధ పరీక్షలు, అడ్మిషన్ల సమయాల్లో కూడా ఆ త్మహత్యల పోకడలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సైక్రియాటిస్టులు చెబుతున్నారు. ఆత్మహత్యా ప్రయత్నాల నుంచి బయటపడిన వారిని తల్లిదండ్రులు తమ వద్దకు తీసుకు వస్తుంటారని, క్రమం తప్పని కౌన్సెలింగ్, మందులు వల్ల బాధితుల్లో సమూల మార్పులను తీసుకు రావచ్చని వారు తెలిపారు.

హెల్ప్‌లైన్లకు కాల్‌ చెయ్యండి
రీచ్‌ క్లినిక్, కోరమంగల –9902075544, 25530049
పరివర్తన్‌ కౌన్సెలింగ్‌ సెంటర్,  ఇందిరా నగర – 25298686, 25273462
సహాయ్‌ హెల్ప్‌లైన్, ఫ్రేజర్‌ టౌన్‌– 25497777
విశ్వాస్‌ సొసైటీ ఫర్‌ మెంటల్‌ హెల్త్, జయనగర –26632126
నిమ్హాన్స్‌– సోమవారం నుంచి శనివా రం వరకు (ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్‌)

ఇవే ప్రధాన కారణాలు
ఆత్మహత్యల జాబితాను చూస్తే వైవాహిక, సహజీవన సంబంధాల వైఫల్యం, మానసిక ఒత్తిడి లాంటి సంఘటనలే ప్రథమ స్థానంలో నిలుస్తున్నాయని కౌన్సెలర్లు తెలిపారు. 16 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారిలోనే ఇలాంటి పోకడలు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.చదువు, ప్రేమ, జీవితాల్లో దుస్సంఘటనలు, అనారోగ్యం తలెత్తినప్పుడు ముందుగా ఎంచుకునేది ఆత్మహత్యలేనని వారు చెబుతున్నారు. చిన్న చిన్న కారణాలకే అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టడంలో అన్నివర్గాలవారూ ఉంటున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top