పెళ్లికొస్తారా... క్వారంటైన్‌కు పద !

Karnatka Police Arrest Relatives Attend Marriage in Ballari - Sakshi

అమరాపురం గ్రామంలో పెళ్లికళ నిరుత్సాహం

కర్ణాటక,సాక్షి,బళ్లారి: కరోనా మహమ్మారి ప్రబలుతున్నందున లాక్‌డౌన్, భౌతిక దూరం తప్పని సరిగా అమలు అవుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. బళ్లారి తాలూకాలోని అమరాపుర గ్రామంలో అనుమతి లేకుండా పెళ్లి నిర్వహించడంతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుంచి పలువురు పెళ్లికి హాజరు కావడంతో గురువారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించారు.

బంధువుల పెళ్లి కోసం విచ్చేసిన అనంతపురం జిల్లాకు చెందిన 11 మందిని క్వారంటైన్‌కు తరలించడంతో అమరాపురలో నిర్వహిస్తున్న ఓ పెళ్లి వేడుకలో సందడి లేకుండా పోయింది. కరోనా కట్టడి చేసేందుకు బళ్లారి సరిహద్దున చెక్‌పోస్టుల వద్ద గట్టి భద్రత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి బళ్లారిలోకి రాకుండా చెక్‌పోస్టులపై నిఘా ఉంచారు. పెళ్లికొచ్చినా, పేరంటాలకు వచ్చినా క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top