తల్లీ వందనం

Karnataka Police Officer Honored His Mother - Sakshi

విధుల్లో చేరడానికి ముందు తల్లికి ఎస్‌ఐ పాదాభివందనం  

ఫొటో షేర్‌ చేసిన ఏడీజీపీ భాస్కర్‌రావ్‌

ఎందరికో స్ఫూర్తి అంటూనెటిజన్లు కామెంట్‌

యశవంతపుర : తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. బిడ్డల క్షేమాన్ని కోరి అనునిత్యం వారి కోసం శ్రమించే వారు. అటువంటి వారి రుణం తీర్చుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ ఫొటోలో తల్లి పాదాలకు నమస్కరిస్తున్న ఈ యువ ఎస్‌ఐ సంస్కారానికి నెటిజన్లు హాట్సాఫ్‌ చెబుతున్నారు. ఇప్పుడు సామాజిక మధ్యామాల్లో ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను ఏకంగా కర్ణాటక రిజర్వు బెటాలియన్‌కు చెందిన ఏడీజీపీ భాస్కర్‌ రావ్‌ షేర్‌ చేయడంతో పాటు ఒక సందేశం కూడా ఇచ్చారు.

ఇటీవలె ఎస్‌ఐ శిక్షణ పూర్తి చేసుకున్న ఈ యువ ఎస్‌ఐ విధుల్లో చేరడానికి ముందు పొలంలో పనులు చేసుకుంటున్న తన తల్లి దగ్గరకు వచ్చి పాదాభివందం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోను చూసిన ఐపీఎస్‌ అధికారులు సైతం ఆ యువ ఎస్‌ఐని అభినందించడంతో పాటు ఎంతో మందికి స్ఫూర్తి అంటూ కామెంట్లు పోస్టు చేశారు. ఈ ఫొటోను ఒక్కరోజులోనే 17 వేల మంది నెటిజన్లు లైక్‌ కొట్టి స్నేహితులకు షేర్‌ చేసి యువ అధికారిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top