బలాదూర్‌గా హోం క్వారంటైనీ

Home Quarantine Caught on Road in Karnataka - Sakshi

కర్ణాటక,దొడ్డబళ్లాపురం: విదేశాల నుంచి వచ్చినవారికి హోం క్వారంటైన్‌ విధించినప్పటికీ అనేక చోట్ల బలాదూరుగా వీధుల్లో తిరుగుతూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారు. చెన్నపట్టణ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఇదే విధంగా బాధ్యతలేకుండా తిరుగుతుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ నివాసి అయిన ఒక వ్యక్తి వారం రోజులక్రితం సౌదీ నుండి తిరిగివచ్చాడు. అతడికి అధికారులు 14 రోజులు ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. అయితే సదరు వ్యక్తి ఇంట్లో ఉండకుండా పట్టణ వీధుల్లో బాధ్యతారాహిత్యంగా తిరుగుతుండడంతో స్థానిక ప్రజలు అతడి చేతిపై కరోనా సీలు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. తాలూకా ఆరోగ్యాధికారితో కలిసి వచ్చిన పోలీసులు వ్యక్తికి గట్టిగా హెచ్చరించి ఇంటికి పంపించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top