చెందూర్ ఇక లేరు

చెందూర్ ఇక లేరు - Sakshi


సాక్షి, చెన్నై : దేవాదాయ శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చెందూర్ పాండియన్(65) మృత్యువుతో పోరాడి ఓడారు. ఆరు నెలలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో అన్నాడీఎంకే వర్గాలు దిగ్భ్రాంతికి గురి అయ్యాయి. సీఎం జయలలిత తన సంతాపం తెలియజేశారు. తిరునల్వేలి జిల్లా కడయనల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాశన సభకు చెందూర్ పాండియన్ ఎన్నికయ్యారు.



పార్టీకి ఆయన అందిస్తూ వచ్చిన సేవలకు గుర్తింపుగా తొలిసారి ఎమ్మెల్యే కాగానే, మంత్రి చాన్స్ సైతం దక్కింది. రాష్ట్ర మంత్రి వర్గంలో పలు సార్లు మార్పులు జరిగినా, పలువురికి ఉద్వాసనలు లభిం చినా, చెందూర్ పదవి మాత్రం పదిలంగా ఉంటూ వచ్చింది. శాఖల్లో మాత్రం మార్పులు జరుగతూ వచ్చి చివరకు రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రిగా చెందూర్ కొనసాగుతూ వచ్చారు. సంక్రాంతి ముందు రోజు సచివాలయంలో విధులకు హాజరైన ఆయన అస్వస్థతకు లోనయ్యారు. గుండె నొప్పి రావడంతో నగరంలోని గ్రీమ్స్ రోడ్డులో ఉన్న ఓ ఆసుపత్రిలో చేర్పించారు.



ఆ రోజు నుంచి ఆయన ఆసుపత్రికే పరిమితం అయ్యారు. గుండెకు శస్త్ర చికిత్సలు జరిగాయి. అయినా, ఆయన కోలుకోలేదు. ఆసుపత్రికే మంత్రి చెందూర్ పరిమితం కావడంతో దేవాదాయ శాఖ వ్యవహారాలకు ఆటంకం ఏర్పడింది. చివరకు ఆయన స్థానాన్ని మరొకరికి అప్పగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆరుగంటల యాభై నిమిషాలకు చికిత్స ఫలించక చెందూర్ పాండియన్ తుది శ్వాస విడిచారు.

 

చెందూర్ ఇక లేరు : తిరునల్వేలి జిల్లా సెంగోట్టై నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చెందూర్‌పాండియన్ అన్నాడీఎంకేలో క ష్టపడి పైకి వచ్చారు. పార్టీ పరంగా ఎదుగుతూనే స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా సెంగోట్టై మునిసిపాలిటీ చైర్మన్‌గా అవతరించా రు. ఆ నాటి నుంచి రాజకీయా ల్లో దూసుకొస్తూ తిరునల్వేలి జిల్లా అన్నాడీఎంకే రాజకీయా ల్లో కీలక నేతగా మారారు. ఆ జిల్లాలో అన్నాడీఎంకేలో హే మాహేమీలు ఉన్నా, చెందూర్ పాండియన్‌కు పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ప్రాధాన్యతను పెంచారు.



జిల్లా పార్టీ  కార్యదర్శిగా కూడా పనిచేసిన చెందూర్ పాండియన్ ఆసుపత్రిలో చేరడానికి ముం దు రోజు మంత్రిగా తన శాఖ వ్యవహారాలు, నేతగా తన జిల్లాలోని పా ర్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టి చివరకు అనారోగ్యంతో తన జీవితా న్ని చాలించారు. ఆరు నెలలకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు తు ది శ్వాసను విడిచారు. ఆయన మృతితో కడయ నల్లూరు శోక సంద్రంలో మునిగింది. అక్కడి అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో చెం దూర్ పాండియన్‌కు నివాళులర్పిస్తూ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

 

నివాళి : చెందూర్ పాండియన్ మృతి సమాచారంతో సీఎం జయలలిత దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఆసుపత్రికి మంత్రులు ఓ పన్నీరు సెల్వం, వలర్మతి చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సెంగోట్టైకు మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ఆదివారం చెందూర్‌పాండియన్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో జరగనున్న ఈ అంత్యక్రియలకు పార్టీ వర్గాలు తరలి రానున్నడంతో సెంగోట్టైలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.



చెందూర్ పాండియన్‌కు భార్య  షణ్ముగ తురది, కుమారులు అయ్యప్ప రాజ, కుట్టియప్ప, కుమార్తె ప్రియదర్శిని ఉన్నారు. అయ్యప్ప రాజ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది, కుట్టియప్ప సెంగోట్టై అన్నాడీఎంకే కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇక, ప్రియదర్శిని డాక్టర్‌గా రాణిస్తున్నారు. గత ఏడాది జయలలిత సమక్షంలో ప్రియదర్శిని వివాహం జరిగింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top