ఊరంతా కరెంట్‌ షాక్‌


కౌడిపల్లి: మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం అనంతయ్యపల్లి తండాలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఇళ్లలో కరెంట్‌ షాక్‌ వస్తోంది. తండా మొత్తం విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తమవడంతో.. ఫ్యాన్లకు, టీవీలకు, ఇంటి గేట్లకు, రేకులకు కరెంట్ సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్థులంతా భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఉదయం గ్రామానికి చెందిన పాండ్య అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్‌ సరఫరా సరి చేయాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. 
Back to Top