యువీకి అ‍క్కడ పనేంటి?

 Yuvraj Singh chooses Yo Yo test preparation at NCA over Ranji Trophy - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ లో ఫిట్‌నెస్‌ శిక్షణలో పాల్గొంటుండడంపై బీసీసీఐలోని కొందరు పెద్దలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రంజీ మ్యాచ్‌లకు డుమ్మాకొట్టి మరీ జాతీయ క్రికెట్‌ అకాడమీ లో ఫిట్‌నెస్‌ శిక్షణలో పాల్గొనడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ రంజీ సీజన్‌లో పంజాబ్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవ లం ఒకదానిలోనే (విదర్భ) పాల్గొన్న యువీ అందులో 20, 42 పరుగులు చేశాడు. ఇక ఎలాంటి గాయాలు లేకపోయినా ఎన్‌సీఏలో యువరాజ్‌ ఫిట్‌నెస్‌ శిక్షణలో పాల్గొంటుండడాన్ని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు ప్రశ్నించారు. అసలు యువరాజ్‌ కు ఎన్‌సీఏలో పనేమిటో అర్థం కావడం లేదన్నారు.

గతంలో యో యో ఫిట్‌ నెస్‌ టెస్టుకు హాజరైన యువరాజ్‌ అందులో విఫలమయ్యాడు. ఆ క్రమంలోనే భారత్‌ జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న యువరాజ్‌.. యోయో ఫిట్‌ నెస్‌ పరీక్ష పాసవ్వాలని చూస్తున్నాడు. అయితే గాయాలు లేకపోయినా ఎన్‌సీఏలో యువరాజ్‌ ఫిట్‌ నెస్‌ శిక్షణలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top