ధోనీ, యువరాజ్ ఫ్రెండ్స్ అయ్యారా..!

ధోనీ, యువరాజ్ ఫ్రెండ్స్ అయ్యారా..!


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి, డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్కు మధ్య ఎన్నో విభేదాలున్నాయని గతంలో ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే వీటికి తాజా వీడియో సమాధానం చెబుతుందని ఆశించవచ్చు. మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా-ఏ జట్టుపై ఇంగ్లండ్ నెగ్గిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత యువీ,ధోనీ భుజంపై చెయ్యి వేసి సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగాడు. మరికొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. యువీ తన ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. వెల్ డన్ ధోనీ.. నీ కెప్టెన్సీలో మూడు మేజర్ టోర్నీలు నెగ్గగా, అందులో రెండు వరల్డ్ కప్ లున్నాయని ధోనిని ప్రశంసించాడు.అతడి కెప్టెన్సీలో ఆడటం చాలా గొప్పవిషమని  వ్యాఖ్యానించాడు.

కెప్టెన్సీ కెరీర్ గురించి ధోనీని యువీ ప్రశ్నించగా.. నీలాంటి ఆటగాళ్లు ఉండటంతో జట్టుకు ఎంతో సేవల చేయగలిగాను. కెప్టెన్ గా కెరీర్ ఎంతో కూల్ గా, అద్భుతంగా కొనసాగిందన్నాడు. ప్రస్తుతం నీ చేతిలో కెప్టెన్సీ లేదు. నువ్వు ఇప్పటికీ సిక్సర్లఫై ఫోకస్ చేస్తావా అని యువీ ప్రశ్నించగా.. 10 ఏళ్ల కెరీర్ ను ఎంతో ఎంజాయ్ చేశాను. చెత్త బంతులు పడితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తేలేదని దీటుగా బదులిచ్చాడు. ఆరు బంతుల్లో ఆరుసిక్సర్లు కొట్టడం నీవల్లే సాధ్యమయిందని, నీలాగే అందరూ సమిష్టిగా రాణించడం వల్లే ఎన్నో విజయాలు చేకూరాయని యువీని కొనియాడాడు. ఆ సరదా వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఇకనుంచి వీరి ఫ్రెండ్ షిప్ కంటిన్యూ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.

Back to Top