జాతీయ క్రికెట్ అకాడమీకి సాహా
భుజానికి శస్త్రచికిత్స అనంతరం భారత టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాడు. గాయానికి మరో మూడు వారాల విశ్రాంతి అవసరముండటంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో అతను కోలుకోవడంపై దృష్టి పెట్టాడు.
దీనిపై సాహా స్పందిస్తూ... ‘చేతిని కదల్చకుండా ఉంచడం చాలా కష్టంగా ఉంది. కానీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలంటే ఇవన్ని తప్పవు. ఈ స్థితిలో పేస్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టం. ఆస్ట్రేలియా పర్యటన వరకు కోలుకుంటానని భావిస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం’ అని అన్నాడు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు