సఫారీలకు బ్రేక్ వేస్తారా?

సఫారీలకు బ్రేక్ వేస్తారా? - Sakshi


లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బిలో ఇక్కడ శనివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ ఉపుల్ తరంగా తొలుత సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇరు జట్ల బలబలాల్ని పరిశీలిస్తే దక్షిణాఫ్రికానే పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో లంకేయుల కంటే చాలా ముందంజలో ఉంది. ఇదిలా ఉంచితే, లంకపై దక్షిణాఫ్రికాకు తిరుగులేని వన్డే రికార్డు కల్గి ఉంది. ఇరు  జట్ల మధ్య వరుసగా జరిగిన ఏడు వన్డేల్లో దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. దాంతో సఫారీలకు లంక ఎంతవరకూ బ్రేక్ వేస్తుందో చూడాలి.





2015 తరువాత తొలిసారి..



శ్రీలంక ప్రధాన పేసర్ లసిత్ మలింగా దాదాపు రెండేళ్ల తరువాత వన్డేల్లో పునరాగమనం చేశాడు. 2015లో చివరిసారి లంక తరపున వన్డేల్లో కనిపించిన మలింగా ఇంతకాలానికి తిరిగి జట్టులో చేరాడు. గత కొంతకాలంగా గాయాలతో సతమవుతున్న మలింగా లంక ఆడిన పలు వన్డే మ్యాచ్ లకు దూరంగానే ఉంటూ వచ్చాడు. ఆ క్రమంలోనే మలింగా తిరిగి జట్టులో స్థానం దక్కించుకోవడం కష్టమని భావించారు. కాగా, ఇటీవల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగి రాణించిన మలింగా.. మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.


 


మరొకవైపు ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న ఆటగాళ్ల పరంగా చూస్తే అత్యధిక వికెట్లను సాధించిన ఘనత మలింగా పేరిట ఉంది. ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వికెట్లు(22)తో మలింగా తొలిస్థానంలో ఉన్నాడు. ఓవరాల్ గా చూస్తే చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లను తీసిన  ఘనత న్యూజిలాండ్ బౌలర్ మిల్స్(28) ఖాతాలో ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top