‘భారత్‌తో టెస్టు సిరీస్‌ మాదే’

We can win the fourth Test, says Jos Buttler - Sakshi

సౌతాంప్టన్‌: టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను కచ్చితంగా గెలుస్తామంటున్నాడు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌. ఈ మేరకు నాల్గో టెస్టు మ్యాచ్‌లో విజయం తమదేనని స్సష్టం చేశాడు. నాల్గో టెస్టులో శనివారం మూడో రోజు ఆట తర్వాత మాట్లాడిన బట్లర్‌.. ‘మేము నాల్గో టెస్టులో విజయం సాధిస్తాం. ప‍్రస్తుతం మా జట్టు మంచి స్థితిలోనే ఉంది. మా సీమర్లతో పాటు స్పిన్నర్లు మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషిద్‌లు విజయంలో కీలక పాత్ర పోషించడం ఖాయం. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు చేయడం మాకు లాభించింది. మొయిన్‌ అలీని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపి, జో రూట్‌ను నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం కలిసొచ్చింది.

రూట్‌ 48 పరుగులు చేయడంతో పాటు స్టోక్స్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.  మొయిన్‌ అలీ బౌలింగ్‌లో మరోసారి రాణిస్తాడనే అనుకుంటున్నా. ఒకవేళ మా పేసర్లకు స్పిన్నర్ల నుంచి చక్కటి సహకారం అందితే భారత్‌ను సులువుగా ఆలౌట్‌ చేస్తాం’ అని బట్లర్‌ తెలిపాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 8 వికెట్లకు 260 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 233 పరుగుల ఆధిక్యంలో ఉంది. కరన్‌ (67 బంతుల్లో 37 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top