అంపైర్ల నిర్ణయంపై సెహ్వాగ్‌ పంచ్‌

 Virender Sehwag leads Twitter jokes as umpires take bizarre lunch break - Sakshi

సెంచూరియన్‌: ప్రతీ విషయాన్ని వ్యంగ్యంగా కోడ్‌ చేస్తూ ట్వీటర్‌లో స్పందించే భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. దక్షిణాఫ్రికా-భారత​ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో అంపైర్ల లంచ్‌ బ్రేక్‌ నిర్ణయాన్నీ విడిచిపెట్టలేదు. 'భారత బ్యాట్స్‌మెన్లను అంపైర్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాదారుల్లా చూస్తున్నారు..లంచ్‌ తర్వాత రండి అని చెబుతున్నారు' అని సెహ్వాగ్ ట్వీటర్‌లో సెటైర్‌ వేశాడు. 'అంపైర్లు గతంలో బ్యాంకులో పని చేశారనుకుంటా.. అందుకే చిన్న పనికి ముందు లంచ్ బ్రేక్ తీసుకున్నారు' అని మరో నెటిజన్ అందుకు బదులిచ్చాడు. ‘2 పరుగుల కోసం 40 నిమిషాల లంచ్‌ కావాలా. రెండు నిమిషాల్లో తయారయ్యే మ్యాగీ నూడిల్స్‌ సరిపోదూ' అని మరొక అభిమాని చురకలంటించాడు. 'విజేతను ప్రకటించే ముందు ఒక  షార్ట్‌ బ్రేక్‌ అంటూ రియాల్టీ షోలో సస్పెన్స్‌ క్రియేట్‌ చేసే మాదిరిగా అంపైర్లు వ్యవహరించారు' అని మరొకరు సెటైర్లు వేశాడు.

సఫారీలు నిర్దేశించిన 119 పరుగుల విజయలక్ష్యంలో భాగంగా భారత్‌ జట్టు 117 పరుగుల వద్ద ఉండగా ఆటగాళ్లు లంచ్‌కు వెళ్లాల్లివచ్చింది. భారత జట్టు ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు పూర్తయ్యేసరికి ఫీల్డ్‌ అంపైర్లు లంచ్‌ బ్రేక్‌ అంటూ డిక్లేర్‌ చేశారు. ఇది మొత్తం క్రికెట్‌ అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై కోహ్లి కూడా అసహనం వ్యక్తం చేశాడు.రెండు పరుగుల ముందు లంచ్‌ బ్రేక్‌కు వెళ్లాలా అంటూ మైదానం విడిచాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top