స్త్రీ, పురుషులు సమానం కాదు: కోహ్లి

Virat Kohli Womens Day Special Message - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : స్త్రీ, పురుషులు సమానం కాదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలకు కోహ్లి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా అభిమానులను మీ జీవితంలోని శక్తివంతమైన మహిళలకు ట్యాగ్‌ చేయండి అని సబ్‌టైటిల్స్‌తో కూడిన ఓ వీడియోను ట్వీట్‌ చేశాడు. తన జీవితంలో శక్తివంతమైన మహిళ అనుష్కశర్మేనని ట్యాగ్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.

ఆ వీడియోలో కోహ్లి మాట్లాడుతూ.. ‘  స్త్రీ, పురుషులు సమానం కాదు. నిజాయితీగా చెప్పాలంటే ఒకరితో ఒకరిని పోల్చకూడదు. లైంగిక వేధింపులు, వివక్ష, సెక్సిజమ్‌, గృహ హింస, బెదిరింపులు.. వంటి జాబితా పెద్దదైనా.. వీటన్నింటిని భరిస్తూ.. మహిళలు ఎదుగుతున్నారు. పురుషుల కంటే వాళ్లు ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’ అని కోహ్లి పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top