వారిద్దరిపై వేటుకి కారణమిదే: కోహ్లి

Virat Kohli Reveals the Reason Behind 'Resting' Ravindra Jadeja and Ravichandran Ashwin

ముంబై: గత మూడు సిరీస్ లుగా భారత జట్టు ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను పక్కకుపెట్టడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి స్పందించాడు. 2019 వరల్డ్ కప్ లో మణికట్టు స్పిన్నర్లకే ఎక్కువ అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే అశ్విన్, జడేజాలను కొన్ని సిరీస్ ల నుంచి తప్పించినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా స్పిన్ భారాన్ని మోస్తున్న వారికి విశ్రాంతి ఇవ్వాలనే తలంపుతో కూడా పక్కకుపెడుతున్నామని పేర్కొన్నాడు.

'వరల్డ్ కప్ కు అత్యుత్తమ బౌలింగ్ కాంబినేషన్ ను గుర్తించే పనిలో ఉన్నాం. మణికట్టు స్పిన్నర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది మాకు ముందు నుంచి ఉన్న ఆలోచన. అలా అని కుల్దీప్ యాదవ్, చాహల్ తో మెగా టోర్నీకి వెళ్లాలని కాదు.. ఇటీవల వారిద్దరూ మెరుగ్గు రాణిస్తూ జట్టు ఎంపికని క్లిష్టతరం చేస్తున్నారు. మేము ఒక స్పిన్నర్ తోనే తుది జట్టును ఎంపిక చేయాలని చూస్తున్నా చాహల్ , కుల్దీప్ లు ఆ అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. మరోవైపు బౌలర్ల భారం గురించి కూడా ఆలోచిస్తున్నాం. సెలక్టర్ల జట్టు ఎంపికను క్రికెటర్లందరూ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే టీమిండియా ఒక లక్ష్యంగా ముందుగా సాగుతోంది'అని కోహ్లి వివరించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top