సచిన్, ద్రవిడ్ ల సరసన కోహ్లి

Virat Kohli joins Sachin Tendulkar, Rahul Dravid; completes 10,000 international runs in winning causes

కోల్ కతా:టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. కోల్ కతా నగరంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే ద్వారా భారత్ జట్టు అన్ని ఫార్మాట్లలో కలిపి విజయాలు సాధించిన మ్యాచ్ ల్లో పదివేల పరుగుల్ని పూర్తి చేసుకున్న భారత క్రికెటర్ గా నిలిచాడు. తద్వారా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ద వాల్ రాహుల్ ద్రవిడ్ ల సరసన చేరాడు.

అంతకుముందు సచిన్ , ద్రవిడ్ లు మాత్రమే ఈ మార్కును చేరిన భారత క్రికెటర్లు. భారత జట్టు గెలిచిన మ్యాచ్ ల్లో సచిన్ 17,113 పరుగులు చేయగా, ద్రవిడ్ 10,860 పరుగులు సాధించారు. భారత జట్టుకు విజయాల్ని అందించే క్రమంలో వన్డేల్లో కోహ్లి 6,313 పరుగులు చేయగా, టెస్టుల్లో 2,472 పరుగులు చేశాడు. ఇక టీ 20ల్లో భారత్ గెలిచిన మ్యాచ్ ల్లో కోహ్లి 1,274 పరుగులు చేశాడు. కోల్ కతాలో జరిగిన రెండో వన్డేలో కోహ్లి 92 పరుగులు చేశాడు. ఆపై ఆసీస్ ను కట్టడి చేసి  భారత విజయం సాధించడంతో జట్టు గెలుపొందిన అంతర్జాతీయ మ్యాచ్ ల్లో పది వేల పరుగుల పూర్తి చేసుకున్న మైలురాయిని విరాట్ చేరాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top