కోహ్లి సెంచరీ.. పంత్‌ ఔట్‌

Virat Kohli Completes 24th Test Century - Sakshi

లంచ్‌ సమయానికి భారత్‌ స్కోర్‌ 506/5

రాజ్‌కోట్‌ : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించగా.. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. బిషూ వేసిన 106 ఓవర్‌ రెండో బంతిని బౌండరీకి తరలించిన కోహ్లి కెరీర్‌లో 24వ టెస్ట్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక కెప్టెన్‌గా కోహ్లికి ఇది 17వ సెంచరీ కావడం విశేషం. ఇదే బిషూ బౌలింగ్‌లో పంత్‌ ఔటై సెంచరీ మిస్‌ చేసుకోవడం గమనార్హం.

364/4 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో  రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు మంచి ఆరంభమే దక్కింది. తొలుత 57 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో పంత్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్‌ విరామ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 417 పరుగులు చేసింది. అనంతరం పంత్‌ దాటిగా ఆడాడు. ఈ క్రమంలో కోహ్లి 184 బంతుల్లో 7 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌తో కోహ్లి భారత గడ్డపై టెస్టుల్లో మూడువేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సెంచరీకి చేరువగా వచ్చిన రిషబ్‌ పంత్‌(92)ను బిషు క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 133 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా సైతం ఆచితూచి ఆడటంతో భారత్‌ లంచ్‌ సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది.

చదవండి: పృథ్వీ ‘షా’న్‌దార్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top