ఒకరికొకరు.. వైరల్‌ ఫొటోలు..!

Virat Kohli and Anushka Sharma at Indian Sports Honours - Sakshi

తాజాగా ముంబైలో జరిగిన ఇండియన్‌ స్పోర్ట్స్‌ హానర్స్‌ వేడుకలో విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్న ఈ లవ్‌బర్డ్స్‌ చేతిలో చేయి వేసి ఈ వేడుకకు వచ్చారు. కలిసి ఫొటోలు దిగారు. ఎంతో కంఫర్ట్‌బుల్‌గా సన్నిహితంగా కనిపించారు.

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించాడు. ఆమెను ప్రేమిస్తున్నట్టు వాలెంటైన్స్‌ డే నాడు ఫొటో పెట్టి మరీ కన్ఫర్మ్‌ చేశాడు. అనుష్క మాత్రం ఈ విషయంలో మౌనాన్ని పాటిస్తుంది. మీడియా ముఖంగా తమ ప్రేమ గురించి ఆమె ఏనాడూ చెప్పలేదు. కానీ వీరి మధ్య రోజురోజుకు దృఢమవుతున్న అనుబంధం చూస్తే.. ఒకరికొకరు అన్నట్టుగా ఈ ప్రేమజంట ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది.

Back to Top