విరాట్ కోహ్లి మరో ఆరోపణ

విరాట్ కోహ్లి మరో ఆరోపణ


రాంచీ: బెంగళూరు టెస్టులో రివ్యూ వివాదం మరచిపోక ముందే కోహ్లి మరో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చాడు. భారత జట్టు ఫిజియో పాట్రిక్‌ ఫర్‌హర్ట్‌ను కొంత మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు కావాలని అగౌరవపరిచారంటూ కోహ్లి ఆరోపించాడు. తనకు చికిత్స చేయడం అతని బాధ్యత అని, అనవసరంగా అతని పేరును ఎందుకు లాగారో తనకు అర్థం కావడం లేదని విరాట్‌ అన్నాడు. అయితే ఈ ఆరోపణలను స్మిత్‌ ఖండించాడు. కోహ్లి వ్యాఖ్యలతో తాను నిరాశ చెందానని, అసలు అలాంటిదేమీ జరగలేదని అతను వివరణ ఇచ్చాడు.భారత్‌లో ఆడే సమయంలో మైదానంలో ఉద్రిక్తతలు సహజమేనని, అయితే క్రీడా స్ఫూర్తితో ఆడటం ముఖ్యమని స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు తన భుజం గాయం, మ్యాక్స్‌వెల్‌ వెక్కిరింతల అంశాన్ని చాలా చిన్నదిగా కోహ్లి కొట్టిపారేశాడు.

Back to Top