గాయపడ్డ అంపైర్‌ మృతి

Umpire Dies A Month After Being Hit On Head By Ball - Sakshi

లండన్‌: బంతి తగిలి తీవ్రంగా గాయపడిన అంపైర్‌ జాన్‌ విలియమ్స్‌(80) నెల రోజులకు పైగా మృత్యువుతో పోరాడి  తుది శ్వాస విడిచారు. నెలరోజులకుపైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన విలియమ్స్‌ గురువారం మృతి చెందారు. ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో భాగంగా జులై 13న పెమ్‌బ్రోక్‌షైర్‌ వర్సెస్‌ నార్‌బెత్‌ జట్ల మధ్య కౌంటీ క్రికెట్‌ జరిగింది. ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన విలియమ్స్‌ తలకు బంతి తగలడంతో తీవ్ర గాయమైంది. 

గాయపడిన వెంటనే విలియమ్స్‌ను కార్డిఫ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా కోమాలోకి వెళ్లాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హావర్‌ఫోర్డ్‌వెస్ట్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పెమ్‌బ్రోక్‌షైర్‌ క్రికెట్‌ క్లబ్‌ గురువారం ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపింది. ‘అంపైర్‌ జాన్‌ విలియమ్స్‌ గురించి చేదు వార్త వినాల్సివచ్చింది. ఈ ఉదయం ఆయన ఆస్పత్రిలో మృతిచెందారు’ అని ట్వీట్‌ చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top