తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: ఆర్‌ఎఫ్‌వైఎస్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్ఎస్) జట్టు సత్తా చాటింది. జూనియర్ బాలుర, బాలికల విభాగాల్లో చాంపియన్‌గా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన జూనియర్ బాలుర ఫైనల్లో టీఎస్ఎస్ 4–1తో కెన్నడీ హై గ్లోబల్ స్కూల్ జట్టుపై గెలిచింది. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న బి. సునీల్‌కు ‘గోల్డెన్ బూట్ అండ్ బాల్’ అవార్డు దక్కగా, కెన్నడీ స్కూల్‌కు చెందిన కృష్ణ గుప్తా ‘గోల్డెన్ గ్లోవ్’ పురస్కారా న్ని దక్కించుకున్నాడు.
బాలికల విభాగంలో టీఎస్ఎస్ 12–0తో ఇంటర్నేషనల్ స్కూల్‌ను చిత్తుగా ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. సీనియర్ బాలుర ఫైనల్లో ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజి 1–0తో సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజిపై, కాలేజి బాలుర ఫైనల్లో వెస్లీ డిగ్రీ కాలేజి 3–2తో ముఫకంజా కాలేజిపై నెగ్గాయి.
మరిన్ని వార్తలు