తెలంగాణకు రెండో విజయం

Telangana gets Second Victory in Football Championship   - Sakshi

జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఫుట్సల్‌ యూత్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు జోరు కనబరుస్తోంది. కర్ణాటక ఫుట్సల్‌ సంఘం ఆధ్వర్యంలో బెంగళూరులోని ఆక్టివ్‌ ఎరీనా మరథహల్లి వేదికగా జరుగుతోన్న ఈ అండర్‌–20 టోర్నీలో మనోళ్లు వరుసగా రెండు విజయాలను సాధించారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 4–0తో ఛత్తీస్‌గఢ్‌పై ఘనవిజయం సాధించింది. తెలంగాణ జట్టు తరఫున నరేశ్‌ 2 గోల్స్‌ సాధించగా... జీవన్, జైద్‌ చెరో గోల్‌ చేశారు.

మంగళవా రం జరిగిన తొలి మ్యాచ్‌లో తెలంగాణ 9–1తో గుజరాత్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ నరేశ్‌ 4 గోల్స్‌తో చెలరేగాడు. జైద్, జీవన్‌ చెరో 2 గోల్స్‌ చేయగా... తాహా ఆరిఫ్‌ సయ్యద్‌ ఒక గోల్‌ సాధించాడు. తెలంగాణ జట్టుకు ఫయాజ్‌ ఖాన్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top