‘అయ్యారే..’ మనోళ్ల అద్భుత డైవింగ్‌ చూశారే..!

Team India Players Shikhar Dhawan And Rohit Sharma Swims Downtime - Sakshi

ధావన్‌, అయ్యర్‌ సెలయేటి డైవింగ్‌

ట్రినిడాడ్‌ :  విండీస్‌ పర్యటలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు జలకాలటల్లో మునిగితేలారు. భారత ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మతో పాటు యువ ఆటగాళ్లు శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, నవదీదప్‌ సైనీ, ఖలీల్‌ అహ్మద్‌ నీటిలో కేరింతలు కొట్టారు. వెస్టిండీస్‌ ఆటగాళ్లు నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పోలార్డ్‌ కూడా మనోళ్లతో కలిసి సెలయేరులో డైవింగ్‌ చేశారు. ఇక తమ విన్యాసాలకు సంబంధించిన వీడియాలను ధావన్‌, అయ్యర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

‘సహజసిద్ధమైన సెలయేటి నీటిలో.. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ.. ఆహా..! ఎంత ఆనందం’అంటూ ధావన్‌ పేర్కొన్నాడు. ‘నాకు ఎగరడం రాదని.. ఇంకెవరూ అనలేరు. సాక్ష్యం ఈ వీడియోనే’అని అయ్యర్‌ చెప్పాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి జోరుమీదున్న టీమిండియా... మూడు వన్డేల సిరీస్‌లోనూ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా ట్రినిడాడ్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో చివరిదైన మూడో వన్డే జరుగనుంది. ఇక తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top