టీమిండియా ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ రికార్డు

Team India ends 2017 with its all-time best ODI record in a calendar year - Sakshi

విశాఖ: శ్రీలంకతో ఇక్కడ జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ రికార్డును నమోదు చేసింది. లంకేయులతో ఆఖరి వన్డేలో విజయంతో ఎనిమిది వరుస సిరీస్‌ విజయాల్ని భారత్‌ సొంతం చేసుకోవడంతో పాటు ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డేల్లో విజయంతో ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ రికార్డును సాధించింది. ఈ ఏడాది టీమిండియా 29 వన్డేలకు గాను 21 మ్యాచ్‌ల్లో విజయంగా సాధించగా, 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరొక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఫలితంగా ఈ ఏడాది టీమిండియా గెలుపు-పరాజయాల రేషియో 3.000గా నమోదైంది. వన్డే ఫార్మాట్‌లో ఇదే భారత్‌కు ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ రికార్డు.

మరొకవైపు శ్రీలంక మరొక చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ ఏడాది 29 వన్డేలు ఆడిన లంకేయులు కేవం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగా, 23 మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యారు. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తద్వారా వారి గెలుపు-పరాజయాల రేషియా 0.217గా నమోదైంది. ఇది ఏ జట్టు పరంగా చూసినా ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యంత చెత్త రికార్డుగా క్రికెట్‌ పుస్తకాల్లోకి కెక్కింది.

ఇదిలా ఉంచితే సొంతగడ్డపై టీమిండియా.. లంకతో 51 వన్డేలు ఆడగా, 36 విజయాల్ని సాధించి, 12 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 1982 నుంచి చూస్తే భారత జట్టు స్వదేశంలో లంకేయులతో ఇప్పటివరకూ తొమ్మిది ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడగా తొమ్మిదింట విజేతగా నిలిచింది. ఇక ఒక సిరీస్‌ డ్రా అయ్యింది. మరొకవైపు  ఈ ఏడాది భారత్‌ జట్టు తన వన్డే రన్‌ రేట్‌లో కూడా అత్యుత్తమ రికార‍్డును సాధించింది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ నమోదు చేసిన వన్డే రన్‌ రేట్‌ 5.93. ఇది క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ నమోదు చేసిన అత్తుత్తమ రన్‌ రేట్‌. ఈ క్రమంలోనే 2009లో నమోదు చేసిన 5.88 రన్‌ రేట్‌ను భారత్‌ జట్టు సవరించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top