జాతీయ టోర్నీలో మన స్విమ్మర్లు రాణిస్తారు

Swimmers of Telangana will do better in Future National Tournies, Coach Ayush Yadav - Sakshi

తెలంగాణ కోచ్‌ ఆయుష్‌ యాదవ్‌ ఆశాభావం

సాక్షి, హైదరాబాద్‌: గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర స్విమ్మర్ల ప్రదర్శన మెరుగైందని రాష్ట్ర స్విమ్మింగ్‌ కోచ్‌ ఆయుష్‌ యాదవ్‌ అన్నారు. ఈసారి జాతీయ స్థాయి పోటీల్లో మన స్విమ్మర్లు రాణించి తెలంగాణకు 6 నుంచి 8 పతకాలు అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 24 నుంచి 29 వరకు పుణేలో జాతీయ సబ్‌జూనియర్, జూనియర్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ జరుగనుంది.  మొత్తం 36 మందితో కూడిన తెలంగాణ బృందం జాతీయ టోర్నీలో పాల్గొననుంది.

18 మంది బాలికలు, 18 మంది బాలురు రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. సిద్దిపేటలో మే నెలలో జరిగిన అంతర్రాష్ట్ర స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన స్విమ్మర్లతో రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. వీరికి ఈనెల 3 నుంచి 21 వరకు గచ్చిబౌలిలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. కోచ్‌ ఆయుష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వీరంతా జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.  

జట్ల వివరాలు

 గ్రూప్‌–1 బాలురు: రుత్విక్‌ రెడ్డి, హేమంత్‌ రెడ్డి, శ్రీభువన్‌ రెడ్డి, యశ్‌వర్మ, యువరాజ్‌ శర్మ (రంగారెడ్డి), శ్రీకల్యాణ్, సీహెచ్‌ అభిలాష్‌ (ఖమ్మం), ఎన్‌. కృష్ణ సాకేత్‌ (హైదరాబాద్‌); బాలికలు: ఎం. ప్రణతి, త్రిషా తనూజ్, జి. జాహ్నవి, వి. దీక్షిత.  గ్రూప్‌–2 బాలురు: వై. జశ్వంత్‌ రెడ్డి, బి. సాయి నిహాల్, పి. శ్రీవర్‌‡్ష (రంగారెడ్డి), సూర్యాన్షు (హైదరాబాద్‌), ఆదిత్య (వరంగల్‌); బాలికలు: ఇష్వి మతాయ్, కె. సంజన, హంసిని, నిశా గణేశ్, మెహ్‌రూశ్‌ అష్ఫాక్, జి. రాజలక్ష్మీ.  గ్రూప్‌–3 బాలురు: పి. త్రిషిక్‌ (వరంగల్‌), ధ్రువ్‌ కన్నా, ఎన్‌. సిద్ధార్థ్‌ (రంగారెడ్డి); బాలికలు: సీహెచ్‌ నందిని, ఎన్‌. సంస్కృతి, ఆస్తా, జి. కాత్యాయని, వృత్తి అగర్వాల్‌  గ్రూప్‌–4 బాలురు: ఎం. సుహాస్‌ ప్రీతమ్, అభయ్‌; బాలికలు: జి. లాస్య, నిత్య, సుహర్ష.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top