ధోని చర్యపై గావస్కర్‌ భిన్న స్పందన..!

Sunil Gavaskar Opinion On MS Dhoni Indian Army Special Forces Gloves Row - Sakshi

ఐసీసీ రూల్స్‌ పాటించాలని వెల్లడి

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని కీపింగ్‌ గ్లౌవ్స్‌పై ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ ధరించడంపై ఇండియన్‌ క్రికెట్‌ లెజెండ్‌ సునీల్‌ గావస్కర్‌ భిన్నంగా స్పందించారు. ఇండియన్‌ క్రికెట్‌లో ధోనికి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నిబంధనల్ని పాటించాల్సి అవసరం ఉందని స్పష్టం చేశారు. భారత ఆర్మీపై గౌరవంతో ధోని ఏం చేశాడనే విషయం పక్కన బెడితే.. అతను ఐసీసీ రూల్స్‌ అతిక్రమించొద్దని అభిప్రాయపడ్డారు. ఒక సీనియర్‌ క్రికెటర్‌గా ధోని చర్య.. మిగతా దేశాల క్రికెటర్లకు తప్పుడు సందేశంగా పరిణమించొచ్చని అన్నారు. ఇతర ఆటగాళ్లు కూడా తమ నచ్చిన విధంగా నడుచుకునే అవకాశముందని పేర్కొన్నారు.
(ఎంఎస్‌ ధోనికి స్మృతి మద్దతు)

ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన బుధవారం జరిగిన తొలిమ్యాచ్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌.. ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) ఉన్న గౌవ్స్‌ ధరించి కీపింగ్‌ చేసిన సంగతి తెలిసందే. దీనిపై భిన్న వాదనలు వినిపించాయి. భారత క్రికెట్‌ అభిమానులు ధోని చర్యపై హర్షం వ్యక్తం చేయగా.. మరొక వర్గం మాత్రం ‘క్రికెట్‌లో బలిదాన్‌ ఎందుకు..?’అని విమర్శలు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ధోనితో ఆ లోగో తీయించండి’ అని బీసీసీఐని కోరింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్‌ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు.

(ఆ లోగో తీయాల్సిన అవసరం లేదు: బీసీసీఐ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top